జెడ్పీటీసి, ఎంపీటీసి ఎన్నికల పై చంద్రబాబు కీలక ప్రకటన చేసారు. "ఆ నాడు బ్రిటీష్ వారితో పోరాడి, ప్రజాస్వామ్యం కావలని, పోరాడి మన దేశానికి స్వాతంత్రం సాధించుకున్నాం. 75 ఏళ్ళు సంబరాలు జరుపుకుంటున్నాం. ప్రజాస్వామ్యంలో, ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ అనేవి హక్కు. ఇది వరకు ప్రభుత్వాలు ఎన్నికలు జరిపేవి, తరువాత ఎన్నికల కమిషన్ పెట్టి స్వయం ప్రతిపత్తి ఇచ్చారు. ఒకప్పుడు సేహన్ లాంటి అధికారికి, అందరూ భయపడి, పని చేసే పరిస్థితి వచ్చింది. మన రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు ఒక ఫార్స్ గా తయారు అయ్యారు. ముఖ్యమంత్రి ఒక వారంలో ఎన్నికలు పెట్టేయాలని చెప్తారు. మార్చి 29న, మంత్రులే ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయో చెప్తారు. అప్పటికి ఇంకా కొత్త ఎలక్షన్ కమిషన్ రాలేదు. ముందే వీళ్ళు డిసైడ్ అయిపోతారు. కొత్త ఎన్నికల కమిషన్ రాగానే, పార్టీలను రమ్మని పిలిచారు. అయితే నిన్నే, ఎన్నికల తేదీలు ప్రకటించేశారు. అంటే, ఏంటి దీని అర్ధం ? నిర్ణయం తీసుకుని, మమ్మల్ని పిలవటం ఎందుకు ? గత ఎన్నికల కమీషనర్, గవర్నర్ కి, కేంద్రానికి లేఖ రాసి, జెడ్పీటీసి , ఎంపీటీసి ఎన్నికల్లో జరిగిన ఘటనలు, అసాధారణ ఏకగ్రీవాల పై ఫిర్యాదు చేసారు. దీని పై తేల్చండి, కొత్త నోటిఫికేషన్ ఇవ్వండి అని అడిగినా, అవేమి పట్టించుకోవటం లేదు. అడుగడుగునా పోటీ లేకుండా చేయటానికి, చేయని ప్రయత్నం లేదు. కేసులు పెడతాం అని బెదిరించటం, ఇంట్లో మద్యం సీసాలు పెడతాం అని చెప్పటం, అరెస్ట్ లు చేయటం, చివరకు ఓటర్లను కూడా, మీ పధకాలు కట్ చేస్తాం అని బెదిరించటం, రిగ్గింగ్ చేయటం, తరువాత ఎన్నికల ఫలితాలు సమయంలో కూడా, ఇవే దౌర్జన్యాలు చేసారు."
"ఇప్పుడున్న ఎలక్షన్ కమీషనర్, నిన్నటి దాక చీఫ్ సెక్రటరీ, ముఖ్యమంత్రికి ప్రాధాన సలహదారు, జగన్ చేస్తున్న పనులు అన్నిటికీ తల ఊపి రంగుల కేసులో, కోర్టు బోను ఎక్కారు. ఇలాంటి వ్యక్తి ఎన్నికల కమిషన్ ను ఎలా చేస్తారు ? మొన్న ఏమో ఆర్డినెన్స్ తెచ్చి, హైకోర్టు జడ్జినే రాష్ట్ర ఎన్నికల కమిషన్ గా పెడతాం అని చెప్పారు. ఇప్పుడు ఎందుకు పెట్టలేదు ? నీలం సాహనీ జడ్జి గా పని చేసారా ? సుప్రీం కోర్టు కూడా, మళ్ళీ నోటిఫికేషన్ ఇచ్చే సమయంలో, నాలుగు వారల ముందు నోటిఫికేషన్ ఇవ్వాలని చెప్పారు. కోర్టు తిడితే తిడుతుందిలే అని, నిన్న నోటిఫికేషన్ ఇచ్చి, ఎనిమిదిన ఎలక్షన్ అంటారా ? అన్ని రాజకీయ పార్టీలు, మీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు కదా ? దొంగ, పోలీస్ కలిస్తే ఏమి అవుతుందో, అదే ఇక్కడ జరిగింది. ఎప్పుడో 13 నెలల క్రిందట ఇచ్చిన నోటిఫికేషన్ కాదు, ఇప్పుడు ఫ్రెష్ నోటిఫికేషన్ ఇవ్వండి అని కోరాం,మరో పక్క కేసు కోర్టులో పెండింగ్ లో ఉంది, మరో పక్క సుప్రీం కోర్టు గైడ్ లైన్స్ ఫాలో అవ్వటం లేదు. ఇంత కంగారుగా, ఈ నిర్ణయం తీసుకోవటం వెనుక, ఉద్దేశం ఏమిటి ? "
"మీరు అనుకున్న వారిని డిక్లేర్ చేసుకోవటానికి, అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు కదా ? ఈ ప్రభుత్వం ఎంత వరకు వెళ్ళింది అంటే, సర్పంచ్ కు చెక్ పవర్ కూడా రద్దు చేసే విధంగా నిర్ణయం తీసుకుని, ఇప్పుడు వీఆర్ఏలకు చెక్ పవర్ ఇచ్చారు. వీళ్ళకు ఏ మాత్రం కూడా ప్రజాస్వామ్యం పై నమ్మకం లేదు. అంబేద్కర్ రాజ్యాంగం పై వీరికి నమ్మకం లేదు. చట్టం, న్యాయం పై వీరితో పనిలేదు. ఈ బరి తెగించిన ప్రభుత్వ వైఖరికి నిరసనగా కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పట్లేదు. ఇలాంటి ప్రభుత్వంలో, ఇలాంటి ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో ఎన్నికలు సజావుగా జరుగుతుందని మాకు నమ్మకం లేదు. అందుకే ఈ ఎన్నికలను బహిష్కరించాలని నిర్ణయం తీసుకున్నాం. ఎంతో బాధతో ఈ నిర్ణయం తీసుకున్నాం. ఎందుకంటే మా కార్యకర్తలను వీళ్ళు వేధించిన తీరుకి నిరసనగా, బాధతో ఈ నిర్ణయం తీసుకున్నాం. మా కార్యకర్తల్లో బాధ ఉంది, కానీ తప్పదు. ప్రజలు కూడా, ఈ విషయం అర్ధం చేసుకోవాలి. రాజకీయాల్లో టిడిపికి పోరాడటం కొత్త కాదు. ఇలాంటి రౌడీలతో పోరాడటం కొత్త, పోలీసులతో పోరాడి ఎన్నికలకు వెళ్ళటం కొత్త. ఏది ఏమైనా ప్రజా సమస్యల పైన మాత్రం, ప్రజలతరుపున పోరాడుతూనే ఉంటాం."