ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను బహిష్కరిస్తున్నామని టీడీపీ జాతీయ అధ్యక్ష్యులు నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టి చెప్పిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన తాము ఈ విషయంలో న్యాయ పోరాటం కూడా చేస్తామని చెప్పారు. ఈ రోజు ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు కొత్తగా నోటిఫికేషన్ ఇవ్వక పోవటం పై హైకోర్టులో కేసు వేశామని, రేపు విచారణకు వచ్చే అవకాసం ఉందని అన్నారు. చంద్రబాబు మాట్లాడుతూ, "ఎస్ఈసీ నిన్న ఉదయం 10 గంటలకు చార్జ్ తీసుకొని సాయంత్రం కలెక్టర్ల కాన్ఫిరెన్స్ పెట్టి ఆగమేఘాల మీద నోటిఫికేషన్ విడుదల చేశారు. ముఖ్యమంత్రి సూచనలే మీరు ఫాలో అవ్వాలా? కనీసం సాంప్రదాయాలు ఎస్ఈసీ పాటించరా? సర్పంచ్ ల పవర్ లు కూడా కట్ చేశారు. రాజ్యాంగ సవరణ 73,74లను తీసుకువచ్చారు. గ్రామానికి సర్పంచ్ లు చాలా ముఖ్యం. ఫైనాన్స్ కమీషన్ నిధులు నేరుగా వారికి వస్తుంటే నేడు వీఆర్వోలకు చెక్ డ్రైవింగ్ లు ఇచ్చారు. ఇవ్వన్ని చూసిన తరువాత వైసీపీ ప్రభుత్వానికి ఏ మాత్రం ప్రజాస్వామ్యం మీద గౌరవం లేదని తేలింది. అంబేద్కర్ రాజ్యాంగం అమలు చేయాలన్న ధ్యాస లేని, న్యాయస్థానాలంటే కనీసం మర్యాదలు పాటించని ప్రభుత్వమని తేలిపోయింది. ఇలాంటి ఎన్నికల కమీషన్ లో న్యాయం జరుగుతుందన్న నమ్మకం లేదు. ఎస్ఈసీ ఒక రబ్బరు స్టాంప్ మాత్రమే. స్వయం ప్రత్తిపత్తిగా వ్యవహరించే పరిస్థితి లేదని ఎన్నికలను బహిష్కరిస్తున్నారు. నామినేషన్ల సమయంలో మా నాయకులు ఎన్నో బాధలు పడ్డారు. నేడు ఫ్రీ అండ్ ఫేరింగ్ ఎన్నికలు జరుగుతాయని నమ్మకం లేదు. మా అభ్యర్ధులపై మళ్లీ తప్పుడు కేసులు పెట్టరని నమ్మకం లేదని కఠిన నిర్ణయం తీసుకున్నాం. హైకోర్టులో మేము కూడా పిటీషన్ వేశాం. దానిన కూడా రేపు విచారిస్తామని అంటున్నారు. "

"అప్రజాస్వామిక చర్యలకు మేము భాగస్వాములు కాలేం. అందుకే ఎన్నికల బహిష్కరిస్తున్నాం. చాలా సార్లు ఇలాంటి సంఘటనలు జరిగాయి. గతంలో తమిళనాడులో జయలలిత స్థానిక సంస్థలు, ఉప ఎన్నికలు బాయ్ కాట్ చేశారు. జ్యోతిబసు కూడా ఎన్నికలను బహిష్కరించిన సంఘటనలు ఉన్నాయి. ఈ ఎన్నికలు బాధతో బాయ్ కాట్ చేస్తున్నాం. నా 40 ఏళ్ల రాజకీయ చరిత్రలో ఎప్పుడూ ఇలాంటి సంఘటనలు జరగలేదు. ఏంటి ఈ ఉన్మాద చర్యలు? ఎందుకు రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారు? మా పార్టీ తరుపున నామినేషన్ వేసిన అభ్యర్ధులందరిలో బాధ ఉంది. అందరితో మాట్లాడిన తరువాతే ఈ నిర్ణయం తీసుకున్నాం. ఎన్నికల్లో పోరాటం చేస్తున్న వారి భవిష్యత్ కోసం పార్టీ ప్రయోజనాల కోసం కఠిన నిర్ణయాలు తీసుకున్నారు. ఎన్నికల్లో త్యాగాలు చేసిన వారికి ఇంత కంటే మెరుగైన గుర్తింపునిచ్చే బాధ్యత మాది. విలువ కట్ట లేని త్యాగాలు చేసిన వారి రుణం తీర్చుకునే సమయం వస్తుంది. మేము యుద్ధం చేయాలి లేదంటే తీవ్రవాదుల్లా తయారవ్వాలా? ఎన్నికల్లో పోటీ లేకపోయినా.. వైసీపీ అరాచకాలపై వీరోచితంగా పోరాడుతాం, ప్రభుత్వ, వైపల్యాల్ని ఎప్పటికప్పడు ఎండగడతాం. రాబోయే రోజుల్లో పార్టీని మరింత బలోపేతం చేస్తాం. తెలుగుదేశం పార్టీ 39 ఏళ్ల అనుభవంలో ఎప్పుడూ లేనంత అప్రజాస్వమానికి వాతావరణంలో ఎన్నికలను బహిష్కరిస్తున్నాం. దీనిని ప్రజలందరూ అర్ధం చేసుకోవాలి. అడిగే వ్యక్తులు లేకపోతే ప్రజల సమస్యలు ఇంకా దారుణం అవుతాయి. ప్రజాప్రతినిధుల్ని ప్రజలు ఎన్నుకునే అవకాశం కూడా కల్పించలేకపోతున్నారు. నేడు ప్రభుత్వం చేస్తున్న ఉన్మాద చర్యలను ఎండగట్టేందుకు కఠిన నిర్ణయం తీసుకున్నాం. కోర్టు తీర్పులను పట్టించుకోని ప్రభుత్వాన్ని ప్రజల్లో దోషులుగా నిలబెడతాం." అని అన్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read