ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ మధ్య జగన్ మోహన్ రెడ్డి పేరు కంటే, మంత్రి పెద్దిరెడ్డి పేరు ఎక్కువగా వినిపిస్తుంది. జగన్ మోహన్ రెడ్డి తరువాత ముఖ్యమంత్రి అయ్యే అన్ని అర్హతులు ఉన్నాయి అంటూ, కొంత మంది సామాజిక మాధ్యమాల్లో ప్రచారం కూడా చేస్తూ ఉంటారు. కాంట్రాక్టర్ గా భారీ ప్రాజెక్ట్ లు చేస్తూ, ఆర్ధికంగా బలంగా ఉన్న పెద్దిరెడ్డి, చిత్తూరు జిల్లాలోనే కాక, రాష్ట్ర వ్యాప్తంగా తన పట్టు కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యంగా సొంత జిల్లా చిత్తూరు, అలాగే ఇంచార్జ్ మంత్రిగా కృష్ణా జిల్లాలో ఆయన తన మార్కు చూపిస్తున్నారు. ఈ ప్రభావం మొన్న స్థానిక సంస్థల ఎన్నికలల్లో కనిపిచింది. ఎక్కడో రాయలసీమలోనో, పల్నాడులోనో బెదిరింపులు, దౌర్జన్యాలు ఉంటాయని అనుకుంటే, చిత్తూరు జిల్లాలో ఈ సారి అవి ఎక్కువ ఉన్నాయి. అయితే ఇంత పట్టు ఉన్న పెద్దిరెడ్డి, ప్రభుత్వం తీసుకున్న ఒక నిర్ణయంలో మాత్రం వ్యతిరేకంగా మాట్లాడారు. ఎట్టి పరిస్థితిలోనూ ప్రభుత్వం ఆ నిర్ణయం తీసుకోదని, తాను ఆదేశాలు ఇస్తాను అంటూ చెప్పుకొచ్చారు. అయితే ప్రభుత్వంలో ఇంత పెద్ద నిర్ణయం తీసుకుంటే, పెద్దిరెడ్డికి చెప్పకుండా నిర్ణయం తీసుకున్నారా ? లేక చంద్రబాబు లేఖ రాసారు కాబట్టి, ఎక్కడ సొంత జిల్లాలో వ్యతిరేకత వస్తుందని పెద్దిరెడ్డి రంగంలోకి దిగారా అనేది తెలియదు కానీ, పెద్దిరెడ్డి హామీతో ప్రస్తుతానికి అయితే అక్కడ ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.
ఇక విషయానికి వస్తే, కుప్పం నియోజకవర్గం పై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. చంద్రబాబు నియోజకవర్గం కావటంతో, ఆయనకు ఇబ్బందులు కలిగించే నిర్ణయాలు సహజంగా తీసుకుంటారు. అయితే అక్కడ మొత్తం వ్యవహారాన్ని దగ్గర ఉండి చూస్తున్న పెద్దిరెడ్డికి తెలియకుండా, రెస్కో అంటే రూరల్ ఎలక్ట్రిక్ కో-ఆపరేటివ్ సొసైటీ (రెస్కో) అనే స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థను, ప్రభుత్వంలో విలీనం చేసుకోవటానికి ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. నిజానికి రెస్కో వల్ల, అక్కడ స్థానికంగా విధ్యుత్ అవసరాలు తీరుస్తూ, నాణ్యమైన విద్యుత్ అందిస్తూ, ప్రజలకు ఉపయోగపడుతుంది. అయితే దీన్ని ప్రభుత్వంలో విలీనం చేయాలని నిర్ణయం తీసుకోవటంతో, అక్కడ ప్రజల అభ్యంతరాల మేరకు, చంద్రబాబు , ప్రభుత్వానికి లేఖ రాసి, నిర్ణయం వెనక్కు తీసుకోవాలని కోరారు. అయితే విషయం తెలుసుకున్న పెద్దిరెడ్డి హడావిడిగా ప్రెస్ ముందుకు వచ్చి, రెస్కోని ప్రభుత్వంలో విలీనం చేయమని, ఇప్పుడు ఎలా ఉందో అలాగే ఉంచుతూ ఉత్తర్వులు వచ్చేలా చూస్తానని అన్నారు. అయితే ఇక్కడ పెద్దిరెడ్డికి తెలియకుండా, అంత పెద్ద నిర్ణయం ప్రభుత్వం ఎలా తీసుకుంది, పెద్దిరెడ్డిని సైడ్ చేసి, ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారు అనేది చర్చ జరుగుతుంది.