ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉద్యోగులు ఇంకా ఇంకా జీతాలు కోసం ఎదురు చూస్తూనే ఉన్నారు. అదేంటి నాలుగో తారీఖు వచ్చినా, ప్రైవేటు వాళ్ళే జీతాలు ఇస్తే, ప్రభుత్వం ఇంకా ఇవ్వటం లేదు అని ఆశ్చర్యపోతున్నారా ? ఆశ్చర్యం ఏమి లేదు, దిగజారిపోతున్న రాష్ట్ర ఆర్ధిక పరిస్థితికి, నిదర్శనం ఈ ఘటన. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 4.5 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు, 3.5 లక్షల మంది పెన్షనర్లకు ఇంకా జీతాలు అందలేదు. దీంతో వారిలో అసంతృప్తి నెలకొంది. ఆర్ధిక ఏడాది మొదటి నెలలోనే, ఇలా ఉంటే, అసలు రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి రాను రాను ఎలా ఉంటుందో అని భయపడుతున్నారు. ఓట్ ఆన్ ఎకౌంటు బడ్జెట్ కు రాష్ట్ర గవర్నర్ ఆమోద ముద్ర వేసినప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వం నుంచి జీతాల బిల్లులు , ఇంకా రిజర్వ్ బ్యాంక్ వద్దకు వెళ్ళలేదు. నిధులు సౌలభ్యం లేకపోవటంతోనే, ఈ బిల్లులు ఆర్బిఐకి వెళ్లలేదని చెప్తున్నారు. సీఎఫ్‌ఎంఎస్‌ అనే సిస్టం ఆంధ్రప్రదేశ్ లో అమలవుతుంది. దీంతో నిధులు సౌలభ్యం లేకుండా, బిల్లులు పంపటం సాధ్యం కాదు. ఓట్ ఆన్ ఎకౌంటు బడ్జెట్ కు ఆమోద ముద్ర వేసినప్పటికీ, ఆయా పద్దుల కింద నిధులు కేటాయింపులు జరగలేదు. నిధులు అందుబాటులోకి లేకపోవటంతో, ఆ పద్దులకు నిధులు విడుదల చేయలేదు. కొన్ని పద్దులకు, 31వ తేదీ రాత్రి నిధులు విడుదల చేసినప్పటికీ, వాటి వరుకు సరిపోయాయి.

sec 04042021 2

జీతాలు, పెన్షన్లకు నిధులు లేకపోవటంతో, ఈ బిల్లుని ఆర్బిఐకి పంపలేదని తెలుస్తుంది. అయితే ముందుగా ఏప్రిల్ 1, తరువాత గుడ్ ఫ్రైడే అని, శనివారం డబ్బులు పడతాయని అందరూ భావించారు. శనివారం రాత్రి వరకు ఎదురు చూసారు. చివరకు పడకపోవటంతో, ఈ రోజు ఆదివారం, సోమవారం మళ్ళీ సెలవు కావటంతో, మళ్ళీ మంగళవారం దాకా ఎదురు చూసే పరిస్థితి. అయితే మంగళవారం నిధులు సమకూర్చుకుని, బిల్లులు పంపితే, బుధవారం నుంచి జీతాలు పడే అవకాసం ఉన్నట్టు తెలుస్తుంది. మరి నిధులు మంగళవారానికి సమకూరుతాయా లేదా అనేది చూడాలి. అయితే ముందుగా జీతాలకు డబ్బులు సమకూరి, వారికి ముందు జీతాలు చెల్లించిన తరువాత, అప్పుడు పెన్షన్ లకు చెల్లిస్తారని తెలుస్తుంది. పెన్షన్లకు కూడా డబ్బులు సమకూరి, వారికి వేయాలి అంటే, వచ్చే వారం ఎప్పటిలోగా అవుతుందో అని ఎదురు చూస్తున్నారు. అయితే జీతాలు, పెన్షన్లు లేట్ కావటంతో, చిన్న చిన్న ఉద్యోగులు, తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కట్టుకోవాల్సిన ఖర్చులు ఉండటంతో, జీతాలు తొందరగా రావాలని కోరుకుంటున్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read