విషయం: ‘కుప్పం రూరల్ ఎలక్ట్రిక్ కో-ఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్’ (రెస్కో) విద్యుత్ పంపిణీ మరియు రిటైల్ అమ్మకాలు మరియు కార్యకలాపాలు- రెస్కో కుప్పం స్వాధీనంపై ఏపీఈఆర్ ఆదేశాలు ప్రజాభీష్టానికి వ్యతిరేకం- ఏ.పి.ఈ.ఆర్.సి ఆదేశాల నిలుపుదల - అభ్యర్థనకు - సంబంధించి. Ref: APERC Proc.No.APERC / E-221 / 19/2021, తేదీ 25.03.2021. పైన తెలిపిన ఏ.పి.ఈ.ఆర్.సి రెఫరెన్సు ప్రకారం, 'కుప్పం రూరల్ ఎలక్ట్రిక్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్, (రెస్కో) కుప్పం AP ప్రభుత్వం నుండి విద్యుత్ అమ్మకం, పంపిణీ మరియు రిటైల్ లైసెన్స్ మినహాయింపు పొందడంలో విఫలమైందనే కారణం చూపుతూ రెస్కో' కార్యకలాపాలను స్వాధీనం చేసుకోవాలని APSPDCLకు APERC ఆదేశాలు జారీ చేసింది. కుప్పం రెస్కోను ఎపిఎస్పిడిసిఎల్ స్వాధీనం చేసుకునే ఇటువంటి ఏకపక్ష చర్య సరైన నిర్ణయం కాదు. కుప్పం గ్రామీణ ఎలక్ట్రిక్ కో-ఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ (కె.ఆర్.ఈ.సి.ఎస్. లిమిటెడ్, కుప్పం) ను రెస్కో అని పిలుస్తారు. రెస్కో , కుప్పం 1981 లో కుప్పం నియోజకవర్గంలోని వెనుకబడిన మరియు మారుమూల ప్రాంతాలలో 100% గ్రామీణ విద్యుదీకరణ లక్ష్యంతో స్థాపించబడింది. రెస్కో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సహకారంతో తన లక్ష్యాన్ని సాధించడంలో విజయవంతమైంది. రెస్కో కో-ఆపరేటివ్ సొసైటీలో సుమారు 122000 మంది వాటాదారులు ఉన్నారు మరియు 124000 కనెక్షన్లు కలిగి ఉంది., ఇందులో అన్ని గృహ, వాణిజ్య, పారిశ్రామిక మరియు వ్యవసాయ కనెక్షన్లు ఉన్నాయి.
ఇందులో మెజారిటీ వాటాదారులు చిన్న మరియు మధ్యతరగతి రైతులు మరియు ఎస్సీ, ఎస్టీ, బిసి వర్గాలకు చెందినవారు. వారి ప్రధాన జీవనోపాధి వ్యవసాయం మాత్రమే. రెస్కో కుప్పం అసెంబ్లీ నియోజకవర్గం ప్రజలకు ఒక గర్వకారణమైన సంస్థ. స్థాపించిన నాటి నుంచి రెస్కో విజయవంతంగా నడుస్తోంది. కానీ, ఒక చిన్న కారణాన్ని చూపుతూ రెస్కోను APSPDCL లో విలీనం చేయడం అర్థం లేని పని. కుప్పం వాసులు APERC యొక్క ఈ ఆకస్మిక నిర్ణయంతో చాలా నిరాశకు గురౌతున్నారు. రెస్కో కుప్పం స్వాధీనంకు APERC జారీ చేసిన ఆదేశాలు ప్రజల అభీష్టానికి పూర్తగా వ్యతిరేకం. లైసెన్స్ నుండి మినహాయింపు కోసం ప్రభుత్వం సిఫారసు చేయడం రెస్కో ప్రారంభమైన నాటి నుండి ప్రతి సంవత్సరం జరుగుతోంది. ఇదేమి కొత్త కాదు. కాబట్టి, రెస్కో కుప్పం లైసెన్స్ మినహాయింపుకు తగు ఆదేశాలను వెంటనే జారీ చేయాలి. రెస్కో కుప్పం స్వాధీనంకు APERC జారీ చేసిన ఆదేశాలను వెంటనే రద్దు చేయాలని అభ్యర్థిస్తున్నాను. కృతజ్ఞతలతో..... (నారా చంద్రబాబు నాయుడు)