నిన్న ఆంధ్రప్రదేశ్ మంత్రి రంగనాథరాజు వరి సోమరిపోతుల పంట అంటూ, చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. దీని పై అన్ని వైపుల నుంచి విమర్శలు వచ్చాయి. మంత్రి శ్రీరంగనాథరాజు రైతుల పై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా టీడీపీ రైతు విభాగం అధ్యక్షుడు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో రంగనాథరాజు చిత్రపటం దహనం చేస్తూ నిరసన తెలిపారు. అయితే అన్ని వైపుల నుంచి విమర్శలు రావటంతో, మంత్రి శ్రీరంగనాథరాజు స్పందిస్తూ తన మాటలు వెనక్కు తీసుకున్నారు. తిరుపతి ప్రెస్ క్లబ్‌లో ఈ రోజు మంత్రి రంగనాథరాజు మీడియా సమావేశం ఏర్పాటు చేసారు. కౌలు రైతులకు ఇబ్బందులు ఉన్నాయని, ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు కౌలు రైతులకు అందడం లేదుని, భూమి ఉన్న రైతులే అనుభవిస్తున్నారని, అందుకే తొందరపాటులో అలా మాట్లాడానని. తన మాటలు ఇబ్బంది పెట్టి ఉంటే క్షమించాలని, తన మాటలు వెనక్కు తీసుకుంటున్నా అని మంత్రి తెలిపారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read