ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిన సంగతి అందరికీ తెలిసిందే. ఇందులో ఆశ్చర్యం లేదు. 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు లక్షా 25 వేల కోట్లు అప్పు చేసారు. అయితే అవి అభివృద్ధి రూపంలో కళ్ళకు కనిపించాయి. పోలవరం నిర్మాణానికి 11 వేల కోట్లు, అమరావతి కోసం 10 వేల కోట్లు, 62 ఇరిగేషన్ ప్రాజెక్ట్ లు, సిసి రోడ్డులు, ఎన్టీఆర్ హౌసింగ్, డ్రైనేజీలు, పంచాయతీ భవనాలు, అంగన్వాడీ భవనాలు, సంక్షేమం పై, ఈ ఖర్చు కనిపించేది. అయితే, ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి, పోయిన ఏడు 52 వేల కోట్లు అప్పు చేస్తే, ఈ ఏడు ఇప్పటికే 79 వేల కోట్లు అప్పు చేసారు. అంటే దాదాపుగా లక్షన్నర కోట్ల అప్పు. ఎన్ని సంక్షేమ పధకాలు చేసినా, ఇంత అప్పు ఏమి అవుతుందో అర్ధం కావటం లేదు. ఆదాయం ఎంతో కొంత వస్తూనే ఉంది. ఫిబ్రవరి 2021 చివరి నాటికి, కాగ్ లెక్కలు చూస్తే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అప్పుల్లో నెంబర్ వన్ గా ఉంది. పెద్ద పెద్ద రాష్ట్రాలు దరిదాపుల్లో కూడా లేవు. ఆంధ్రప్రదేశ్ 79 వేల కోట్లతో, మొదటి స్థానంలో ఉంటే, రాజస్తాన్ 51 వేల కోట్లతో రెండో స్థానంలో ఉంది అంటే, మన అప్పులు ఏ స్థాయిలో ఉన్నాయో అర్ధమువుతుంది. ఇక్కడ ఇంకో విషయం ఏమిటి అంటే, బడ్జెట్ లో, అప్పు అంచనా, ఇప్పటికే 63.97% దాటిపోయింది. ఇంత భారీ స్థాయిలో మన అప్పులు ఉన్నాయి.

cag 28032021 2

ఈ ఆర్ధిక సంవత్సరం, సగటున నెలకు రూ.7,199 కోట్లు అప్పు చేసింది మన రాష్ట్రం. అయితే ఇక్కడ మరో అంశం ఎవరికీ అర్ధం కావటం లేదు. పోయిన ఏడాది 52 వేల కోట్లు అప్పు చేస్తే, ఈ ఏడాది 79 వేల కోట్లు అప్పు చేసారు. అయితే పోయిన ఏడాదితో పోల్చితే, ఆదాయ, వ్యయాల్లో పెద్దగా తేడా లేకపోవటం గమనార్హం. ఇప్పటి వరకు అంచనా వేసిన దాని ప్రకారం పెన్షన్లకు 102శాతం, రాయతీలకు 123% తప్పితే, అన్ని పద్దులు, అంచనాలకు లోబడే ఉన్నాయి. మరి, చేసిన అప్పు, దేనికి ఉపయోగిస్తున్నారు అంటే సమాధానం చెప్పే వారు లేరు. పోయిన ఏడాదికి, ఈ ఏడాదికి దాదాపుగా 52% అప్పు పెరిగింది అంటే, ఇవి దేనికి ఉపయోగించారు ? ఇవన్నీ తేలాలి అంటే, బడ్జెట్ పెట్టాలి. బడ్జెట్ సమావేశాలు ఏమో ప్రభుత్వం పెట్టటం లేదు. బడ్జెట్ కూడా మూడు నెలలకు ఆర్డినెన్స్ తెచ్చారు. అంటే మూడు నెలల వరకు బడ్జెట్ సమావేశాలు పెట్టె ఉద్దేశం లేదు అనే అనుకోవాలి. మరి, బుగ్గన గారు కానీ, ఇతర అధికారులు కానీ, చేసిన అప్పు దేనికి ఖర్చు చేసారో, చెప్తే, ఏపి ప్రజలు సంతోషిస్తారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read