చంద్రబాబు ఇండిగో విమానంలో రేణిగుంట విమానశ్రాయం చేరుకున్నారు. అయితే చంద్రబాబుని విమానాశ్రయంలోనే పోలీసులు నిర్బందించారు. ఎయిర్ పోర్ట్ దగ్గరకు, జిల్లా టిడిపి నేతలను ఎవరినీ రానివ్వలేదు. అందరినీ హౌస్ అరెస్ట్ చేసారు. రేణిగుంట ఎయిర్ పోర్ట్ లో మొత్తం పోలీసులు మొహరించారు. చంద్రబాబు కాన్వాయ్ ని కూడా అరైవల్ బ్లాక్ లో కాకుండా, చాలా దూరంగా ఆపేసారు. దీంతో చంద్రబాబుని బయటకు రానివ్వకుండా, ఎయిర్ పోర్ట్ లోనే నిర్బందిస్తారని తెలుస్తుంది. చంద్రబాబుతో పాటుగా వచ్చిన ప్రయాణికులు, చంద్రబాబు మాతో పాటు బయటకు వస్తారని అనుకున్నాం అని, అయితే ఇప్పటి వరకు ఆయన బయటకు రాకపోవటం ఆశ్చర్యానికి గురి చేస్తుందని అన్నారు. ఇక టిడిపి నేతలు ఈ పరిణామం పై మండి పడుతున్నారు. అయితే అందుతున్న సమాచారం ప్రకారం, పోలీసులు చంద్రబాబుకు నోటీసులు అందించినట్టు తెలుస్తుంది. ఎన్నికల ప్రక్రియకు విఘాతం కలుగుతుంది అంటూ చంద్రబాబుకు నోటీసులు జారీ చేసారు. అలాగే క-రో-నా నిబంధనల గురించి కూడా అనుమతి లేదని నోటీసులో తెలిపారు. అతిక్రమిస్తే అదుపులోకి తీసుకుంటాం అని పోలీసులు నోటీసులో తెలిపారు.
చంద్రబాబు రేణిగుంట ఎయిర్ పోర్ట్ లో నిర్బంధం... అదుపులోకి తీసుకుంటాం అని హెచ్చరిస్తున్న పోలీసులు...
Advertisements