వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత, వాలంటీర్ అనే వ్యవస్థను తీసుకుని వచ్చిన సంగతి తెలిసిందే. 90 శాతం పైగా వాలంటీర్లను, తమ పార్టీ వాళ్ళనే పెట్టాను అంటూ, విజయసాయి రెడ్డి బహిరంగంగానే చెప్పారు. ఆ వీడియో కూడా వైరల్ అయిన విషయం తెలిసిందే. అయితే వాలంటీర్లు, ఒకటో తారీఖు పెన్షన్ ఇవ్వాటం మినహా, ప్రజలకు పెద్దగా ఉపయోగం పడటం లేదు. ఇలాంటి వారి పై నెలకు వందల కోట్లు, ఏడాదికి వేల కోట్లు ఖర్చు ప్రభుత్వం ఎందుకు పెడుతుందా అని అనుకున్న వారికి, మొన్న స్థానిక సంస్థల ఎన్నికల్లో క్లారిటీ వచ్చింది. మొన్న ఎన్నికల్లో వైసీపీ కార్యకర్తలు, నాయకులు ఏ మేరకు పని చేసారో కానీ, వాలంటీర్లు మాత్రం, చక్కగా పని చేసారనే ఆరోపణలు ఉన్నాయి. ప్రతి 50 ఇళ్ళకు ఒక వాలంటీర్ ఉండటంతో, వారిని ఎన్నికల్లో అధికార పార్టీ వాదేసింది. ముఖ్యంగా మాటు ఓటు వేయకపోతే, మీ పధకాలు కట్ చేస్తాం, మీ పెన్షన్ తీసేస్తాం అని బెదిరించారు. దీంతో ప్రజలు కూడా, ఇంకా మూడేళ్ళు పైగా భరించాలి, వీళ్ళతో ఎందుకు అనుకున్నారో ఏమో, చాలా మంది వైసీపీకి ఓటు వేసారు. దీంతో ఈ వాలంటీర్ వ్యవస్థ దెబ్బ ఏంటో తెలుగుదేశం పార్టీకి తెలిసి వచ్చింది. ఇప్పటికే దీనికి విరుగుడుగా ఏమి చేయాలో అనే ఆలోచనలో ఉన్న తెలుగుదేశం పార్టీ, అనేక ఆలోచనలు ఆలోచిస్తుంది.

volunteer 29032021 2

అయితే ఇప్పుడు తిరుపతి ఉప ఎన్నిక జరుగుతూ ఉండటంతో, ముందుగా అక్కడ ఒక వినూత్న ఆలోచనతో ముందుకు వెళ్తుంది. ఏదైనా ప్రజల సహకారం లేనిదే, ఏమి చేయలేరు కాబట్టి, ప్రజలను భాగస్వామ్యులను చేస్తూ, ఇలా బెదిరిస్తున్న వాలంటీర్ల పని పట్టాలని డిసైడ్ అయ్యింది. ఈ రోజు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక దినోత్సవం జరిగింది. తిరుపతిలో టిడిపి రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు, పాల్గున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మాకు ఓటు వేయకపోతే, మీ పధకాలు కట్ చేస్తాం అంటూ వాలంటీర్లు బెదిరిస్తే, దాన్ని వెంటనే బహిర్గతం చేయాలని అన్నారు. ఇలా వాలంటీర్లు బెదిరిస్తే, దాన్ని వీడియో తీసి, 7557557744 అనే నంబర్ కు వాట్స్ అప్ చేయాలని, వీళ్ళ దురాగతాలను, ఆధారాలతో పట్టిస్తే, వారికి 10 వేల రూపాయాలు ఇస్తామని అన్నారు. తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని అన్ని నియోజకవర్గాల్లో ఇది వర్తిస్తుందని, ఈ విషయం అందరికీ తెలియ చేయాలని అన్నారు. పధకాలు అనేవి మీ హక్కు అని, ఎవరూ ఏమి చేయ లేరని అన్నారు. మరి టిడిపి చెప్తున్న ఈ ఐడియా ఎలా వర్క్ అవుతుందో చూడాలి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read