మన దేశంలో జమిలీ ఎన్నికలు జరపటానికి, కేంద్రంలో ఉన్న బీజేపీ సమాయత్తం అవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే దీని పై ఒక అంచనాకు వచ్చిన బీజేపీ, ఒక్కో అద్దంగి తొలగించుకుంటూ వెళ్తుంది. నిజానికి క-రో-నా రాకపోయి ఉంటే, ఈ పాటికే జమిలి ఎన్నికల వాతవరణం వచ్చేసేది. ముందుగా బీజేపీ అనుకున్న దాని ప్రకారం, 2022లో జమిలి ఎన్నికలకు వెళ్ళాలని, దాని కోసం కొన్ని రాష్ట్రాల ఎన్నికలు ముందుకు జరపాలని, కొన్ని రాష్ట్రాల ఎన్నికలు అప్పటి వరకు పొడిగించాలని అనుకున్నారు. అయితే, క-రో-నా రావటంతో, మొత్తం రివర్స్ అయ్యింది. అయినా బీజేపీ ఈ విషయంలో హడావిడి పడటం లేదు. ఒక ప్లాన్ ప్రకారం, ఒక్కో అడుగు వేసుకుంటూ వెళ్తుంది. రాజ్యంగ ప్రక్రియలో, చేయాల్సిన అన్నీ, ఒక్కోటి చేసుకుంటూ ముందుకు వెళ్తుంది బీజేపీ. ఇందులో భాగంగా, ఇప్పటికే లా కమిషన్ నుంచి అభిప్రాయలు తీసుకున్నారు. లా కమిషన్ ఇప్పటికే జమిలికి సై అని చెప్పింది. ఈ లా కమిషన్, అన్ని పార్టీల అభిప్రాయం కూడా తీసుకుంది. మెజారిటీ పార్టీలు జమిలి ఎన్నికలకు ఒకే చెప్పేసారు కూడా. ఇది ఇలా ఉంటే, ఇప్పుడు మరో కీలకమైన కమిటీ కూడా జమిలి ఎన్నికల పై తన రిపోర్ట్ ఇచ్చింది. వారం రోజుల క్రితం, పార్లమెంటరీ స్థాయీ సంఘం కూడా జమిలి ఎన్నికల పై తన అభిప్రాయం చెప్పింది.

jamili 29032021 2

జమిలి ఎన్నికలకు ఈ కమిటీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తన రిపోర్ట్ లో, అనేక అంశాలు ప్రస్తావించింది. జమిలి ఎన్నికలు మన దేశానికి కొత్త కాదని, స్వాతంత్ర్యం వచ్చిన కొత్తలో, మూడు సార్లు జమిలి పద్ధతిలోనే ఎన్నికలు జరిగిన విషయాన్ని చెప్పారు. దీంతో జమిలి ఎన్నికలకు కావలసిన అన్ని రాజ్యంగ ప్రక్రియలను, కేంద్రం ఒక్కోటి ఆమోదించుకుంటూ వెళ్తుంది. ఇప్పటికే ప్రధాని మోడి కూడా, ఈ విషయం పై తన అభిప్రయాన్ని కుండ బద్దలు కొట్టేసారు. ప్రతి సారి ఎన్నికలు జరుగుతూ ఉండటం వల్ల, ఖజానాకు భారమే కాకుండా, అభివృద్ధి కార్యక్రమాలకు ఆటంకం అని అన్నారు. అందుకే జమిలి ఎన్నికల పై చర్చ జారగాలని అన్నారు. వన్ నేషన్ - వన్ ఎలక్షన్ అనే నినాదాన్ని ప్రజల్లోకి కూడా తీసుకుని వెళ్లారు. ఇక ఎన్నికల కమిషన్ కూడా, ఇదే ప్రక్రియలో భాగంగా తన వంతు కూడా సైలెంట్ గా చేసుకుంటూ వెళ్తుంది. ఒక్కో ఎన్నికకు ఒక్కో ఎన్నికల జాబితా కాకుండా, మొత్తం అన్ని రకాల ఎన్నికలకు ఒకే వోటింగ్ లిస్టు ఉండేలా ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. ఈ హడావిడి అంతా చూస్తుంటే, 2023లో జమిలి ఎన్నికలు ఉండే అవకాసం ఉందని, పలువురు అభిప్రాయ పడుతున్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read