జగన్ మోహన్ రెడ్డి, విజయసాయి రెడ్డి పై ఇప్పటికే 11 సిబిఐ కేసులు, 5 ఈడీ కేసులు ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ కేసులు విచారణ, ఇంకా సాగుతూనే ఉంది. చార్జ్ షీట్లు ఫైల్ అవ్వటంతో,16 నెలల జైలు జీవితం తరువాత, కండీషనల్ బెయిల్ తో, బయటకు వచ్చారు. అయితే తదనంతర పరిణామాల్లో, ఇప్పుడు అధికారంలోకి వచ్చారు. సిబిఐ కేసులు విచారణ జరిగితే, శిక్ష పడుతుందా లేదా అనేది, చూడాల్సిన విషయం. ఈ విషయం పక్కన పెడితే, ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి పై, మరో సిబిఐ కేసు అంటూ, యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ ఎంపీ రఘరామకృష్ణం రాజు బాంబు పేల్చారు. తానే స్వయంగా కేసు పెడతానని అంటున్నారు. అయితే రెండు రోజుల క్రితం రఘురామరాజు పై, సిబిఐ కేసు నమోదు అయ్యింది. ఇది వరుకే ఒక కేసు నమోదు చేయగా, ఇది రెండో కేసు. మొదటి కేసు పంజాబ్ నేషనల్ బ్యాంక్, రెండో కేసు స్టేట్ బ్యాంక్ పెడితే, సిబిఐ కేసు పెట్టింది. అయితే ఈ కేసు పై, ఇప్పటికే రఘురామరాజు వివరణ ఇచ్చారు. దీని పై ఇప్పటికే ఎన్సీటీఎల్ లో కేసు నడుస్తుందని, నేను ఏమి నిధులు మళ్ళించలేదని, ఎక్కడికీ డబ్బు తీసుకుపోలేదని, తమిళనాడు ప్రభుత్వం తన పవర్ ప్లాంట్ కి డబ్బులు ఇవ్వకపొవటంతో, నష్టపోయామని, దీని పై కేసు జరుగుతుంటే, ఇవేమీ ప్రాధమికంగా విచారణ చేయకుండా, తన పై సిబిఐ కేసు పెట్టటం వెనుక కుట్ర ఉందని అన్నారు.
తానేమీ, 10 రూపాయల షేర్ వందల్లో అమ్ముకోలేదని, అక్రమ సంపాదన లేదని అన్నారు. అయితే ఈ కేసులు వెనుక చాలా పెద్ద కుట్ర ఉందని అన్నారు. తన పై పెట్టిన కేసు ఎలాగూ వీగిపోతుందని, అయితే ఈ కుట్రని మాత్రం తాను వదలనని అంటున్నారు. తమిళనాడులో ఉన్న ఒక స్టేట్ బ్యాంక్ అఫ్ ఇండియా డైరెక్టర్ తో, చీఫ్ మినిస్టర్ కార్యాలయం నుంచి, ఫోనులు వెళ్లాయని, దీని పై తనకు పక్కా సమాచారం ఉందని, ఆ ఫోన్ కాల్స్ అనంతరం, తన పై కేసులు పెట్టారని రఘురామరాజు అన్నారు. దీని పై త్వరలోనే సిబిఐ విచారణ కోరతానని అన్నారు. కచ్చిత్తంగా దీన్ని వదలను అని, దీని పై సిబిఐకి లేఖ రాసి, దీని వెనుక ఉన్న వారి పై విచారణ కోరతానని అన్నారు. ఒక పక్క అవినీతి కేసుల్లో, ఎన్నో చార్జ్ షీట్లు ఉండి, విచారణకు రాకుండా ఎగ్గోడుతుంటే, జగన్ మోహన్ రెడ్డిని సిబిఐ ఎందుకు ఏమి అనటం లేదో అర్ధం కావటం లేదని అన్నారు. ఏది ఏమైనా జగన్ కార్యాలయం ఫోన్ కాల్స్ పై, విచారణ కోరాతానని, రఘురామరాజు అన్నారు. మరి రఘురామరాజు ఎలాంటి ఆధారాలు ఇస్తారు ? సిబిఐ ఎలా స్పందిస్తుందో చూడాలి.