విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను సవాల్ చేస్తూ, మాజీ సిబిఐ జేడీ లక్ష్మీనారయణ ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసారు. ప్రధానంగా విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ అంటూ క్యాబినెట్ నిర్ణయం తీసుకోవటాన్ని రద్దు చేయాలని, ఆయన పిటీషన లో పేర్కొన్నారు. ఇప్పటి వరకు, విశాఖ ఉక్క ఫ్యాక్టరీకి సంబంధించి కేంద్ర ప్రభుత్వం 5 వేల కోట్లు ఖర్చు చేసి, పన్నుల రూపంలో 30 వేల కోట్ల రూపాయలు వసూలు చేసిందని ఆయన పిటీషన్ లో పేర్కొన్నారు. విశాఖ స్టీల్ ని ప్రభుత్వ రంగ సంస్థగానే కొనసాగిస్తే, ప్రభుత్వానికి వచ్చే నష్టం ఏమి లేదని, తన పిటీషన్ లో స్పష్టం చేసారు. విశాఖ ఉక్కుకు సంబంధించి ప్రైవేటీకరణ అంశాన్ని, ఇప్పటికే వ్యతిరేకిస్తూ, కార్మిక సంఘాలు, గత కొన్ని రోజులుగా, విశాఖలో ఉద్యమాన్ని కొనసాగిస్తున్న పరిస్థితి. అనేక పౌర సంఘాలు, వివిధ రాజకీయ పార్టీలు కూడా ఇప్పటికే విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేసారు. ఈ పరిస్థితిలో సిబిఐ మాజీ అధికారి జేడీ లక్ష్మీనారాయణ ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసారు. అయితే రేపు హైకోర్టులో ఈ ప్రజా ప్రయోజన వ్యాజ్యం విచారణకు వచ్చే అవకాసం ఉన్నట్టు తెలుస్తుంది. రేపు ఈ కేసు విచారణ సందర్భంగా హైకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, ఈ కేసుని విచారణకు తీసుకుంది, నోటీసులు ఇస్తుందా లేదా అని వేచి చూడాలి.

hc 3003200021 2

ఇది ఇలా ఉంటే, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ పై పార్లమెంట్ లో ముగ్గురు మాత్రమే ఉన్నా, కేంద్రాన్ని మాత్రం టిడిపి ఎంపీలు వదలటం లేదు. ఇప్పటికే రామ్మోహన్ నాయుడు పార్లమెంట్ లో విశాఖ ఉక్కు పై ఇచ్చిన స్పీచ్ తో, ఒక్కసారిగా ఈ అంశం పై, దేశ వ్యాప్తంగా చర్చ జరిగింది. అయితే దీని పై మరో టిడిపి ఎంపీ గల్లా జయదేవ్, ఈ విషయం పై కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన కు , లేఖ రాసారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగటం మంచిది కాదని, వేల మంది కార్మికుల జీవితాలు , దాంతో ముడి పడి ఉన్నాయని, అందుకే కేంద్ర నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని ఆ లేఖలో కోరారు. దీనికి బదులు ఇస్తూ, కేంద్ర ఆర్ధిక సహాయ మంత్రి, తిరిగి మళ్ళీ గల్లా జయదేవ్ కు ఈ రోజు లేఖ రాసారు. ఇప్పటికే కేంద్రం, ప్రైవేటీకరణ పై నిర్ణయం తీసుకుందని, తేల్చి చెప్పారు. ప్రైవేటీకరణ వల్ల అంతా మంచి జరుగుతుందని, అక్కడ పని చేసే ఉద్యోగులకు కానీ, స్టీల్ ప్లాంట్ లో భాగస్వామ్యం అయిన వారికి కాని ఎలాంటి ఇబ్బందులు ఉండవని, దీనికి సంబంధించి అనేక చర్యలు తీసుకున్నామని, గల్లాకు లేఖ రాసారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read