తెలుగుదేశం పార్టీ కానీ, నేతలు కానీ, ఎవరికైనా కౌంటర్ ఇవ్వాలి అనుకుంటే, ఒకటికి వంద సార్లు ఆలోచిస్తారు. మంచి చెడు బేరీజు వేసుకుని, ఒక పద్దతి ప్రకారమే అవతలి వ్యక్తికి కౌంటర్ ఇస్తారు. ఇది మంచి చేస్తుందా, చెడు చేస్తుందా అనేది పక్కన పెడితే, మొదటి నుంచి తెలుగుదేశం స్టైల్ ఇలాగే ఉంటూ వచ్చింది. అయితే ఈ రోజు లోకేష్ స్పందించిన తీరు చూస్తూ, ఒకింత షాక్ అవ్వాల్సిన పరిస్థితి. సహజ శైలికి భిన్నంగా తెలుగుదేశం పార్టీ, ఈ రోజు స్పందించింది. తెలుగుదేశం పార్టీ, బీజేపీలో కలిసి పోతుంది అంటూ, వెంకట్రామి రెడ్డి డెక్కన్ క్రానికల్ లో, ఒక వార్త వచ్చింది. అయితే చివరలో ఏప్రిల్ ఫూల్ అంటూ, వెటకారంగా స్పందించారు. ఇది రాసింది కర్రి శ్రీరాం అనే వాడు అంటూ ప్రచారం జరుగుతుంది. అయితే ఇది చదివిన వారు, ఇవేమీ రాతలు ? సోషల్ మీడియాలో జులాయి గాళ్ళ లాగా, ఇలా పత్రికల్లో రాయటం ఏమిటి అంటూ స్పందించారు. అయితే దీని పై తెలుగుదేశం పార్టీ కూడా సీరియస్ గా స్పందించింది. నువ్వు ఒక ఫూల్ గాడివి, వెళ్లి నీ మాస్టర్ దగ్గరకు వెళ్లి, రివార్డ్ తీచ్చుకో అంటూ, టిడిపి సోషల్ మీడియా స్పందించింది. ఇక టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు, కింజరాపు అచ్చెన్నాయుడు కూడా ఘాటుగా స్పందించారు. బాధ్యతగా ఉండాల్సిన పత్రికలు, ఇలా తప్పుడు రాతలు రాయటం పై సీరియస్ అయ్యారు.

dc 010420212

ఇక టిడిపి ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఒక అడుగు ముందుకువేసి, ఆ పత్రిక చరిత్ర అంతా బయట పెట్టారు. జగన్ మోహన్ రెడ్డి, ప్రతిపక్షంలో ఉండగా, ఇదే నీలి మీడియాను అడ్డం పెట్టుకుని, ఇలాంటి నీలి సంస్థలను అడ్డం పెట్టుకుని అధికారంలోకి వచ్చాడని, అధికారంలోకి వచ్చిన తరువాత కూడా, అవే అబద్ధపు రాతలు, కూతలతో విష ప్రచారం చేస్తున్నారని అన్నారు. జగన్ రెడ్డి కూడా తన లాగే, సిబిఐ కేసుల్లో ఇరుక్కుని, దివాళా తీసిన వెంక‌ట్రామిరెడ్డి డెక్కన్ క్రానికల్ లో గాలి వార్తలు రాపిస్తున్నాడని అన్నారు. జగన్ మోహన్ రెడ్డికి సిగ్గు లేదని, వెంక‌ట్రామిరెడ్డికి అసలు ఆ పదమే ఏమిటో తెలియదని అన్నారు. వీళ్ళకే లేనప్పుడు, అక్కడ పని చేసే శ్రీరాం కర్రి లాంటి వాళ్లకు ఎందుకు ఉంటుందని ప్రశ్నించారు. అసలు ముందు మీది చూసుకోండి, మీ సంస్థలో జీతాలు ఇచ్చి ఎన్నాళ్ళు అయ్యింది, ఆంధ్రభూమి మూసేసి, ఉద్యోగులను రోడ్డున పడేసిన వాటి పై కధనాలు రాసుకుంటే, కనీసం వారికైనా న్యాయం జరుగుతుంది అంటూ, లోకేష్ ఘాటుగా స్పందించారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read