కర్నూలు జిల్లా నంధ్యాలలో కుటుంబంతో సహా ఆ-త్మ హ-త్య-కు పాల్పడిన అబ్దుల్ సలాం కేసు విచారణకు సీబీఐ అవసరం లేదని హైకోర్టు తేల్చిచెప్పింది. ఈ కేసును సీబీఐకి అప్పగించాలనే పిటిషనర్ అభ్యర్థనను త్రోసి పుచ్చుతూ అసాధారణ, అరుదైన నేరాలకు సంబంధించిన కేసుల విచారణకే సీబీఐ ఏర్పాటయిందని, దీనికి తోడు చాలా పని ఒత్తిడిలో ఉన్నట్లు సీబీఐ కూడా కోర్టుకు నివేదించినందున అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని సీబీఐ విచా రణకు నిరాకరిస్తూ ధర్మాసనం తీర్పునిచ్చింది. సలాం కుటుంబం ఆ-త్మ-హ-త్యపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (ఐయూఎంఎల్ పి) రాష్ట్ర ప్రధానకార్యదర్శి షేక్ ఖాజావలి గత ఏడాది హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిపై అప్పట్లో విచారణ జరిపిన హైకోర్టు మొత్తం వ్యవహారంలో కౌంటర్ దాఖలు చేయాలని సీబీఐ, కర్నూలు జిల్లా ఎస్పీలను ఆదేశించింది. ఈ మేరకు కౌంంటర్లు దాఖలయ్యాయి. ఇప్పటికే పని ఒత్తిడిని ఎదుర్కొంటున్నామని విశాఖపట్నం సీబీఐ ఎస్పీ కోర్టుకు నివేదించారు. కాగా కేసులో దర్యాప్తు సరైన తీరులోనే జరుగుతోందని కర్నూలు ఎస్సీ కోర్టు దృష్టికి తెచ్చారు. దీనిపై మరోసారి గురువారం హైకోర్టు సీజే అరూప కుమార్ గోస్వామి, న్యాయమూర్తి జస్టిస్ చాగరి ప్రవీణ్ కుమార్‌లతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది.

salaam 02042021 2

అసాధారణాధికారాలను అరుదుగా ఉపయోగించాలని సుప్రీంకోర్టు చెప్పిందని వాటిని పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం అసాధారణ, అరుదైన సందర్భాల్లోనే సీబీఐ విచారణకు ఆదేశించాలని సుప్రీం కోర్టు స్పష్టం చేసిందని ధర్మాసనం గుర్తు చేసింది. జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్ర స్థాయిలో పర్యవసానాలు ముడిపడి ఉన్న కేసుల్లో దర్యాప్తును బదలాయించడం ద్వారా న్యాయం జరుగుతుందని అనిపించినప్పుడు మాత్రమే సీబీఐకి ఆదేశాలు జారీ చేసే అవకాశం ఉందని వ్యాఖ్యానించింది. ప్రతిదీ సీబీఐ విచారణకు ఆదేశిస్తే విశ్వసనీయత కోల్పోయే అవకాశాలు లేకపోలేదని వివరించింది. సలీంపై దొంగతనం ఆరోపణలతో కేసు నమోదైందని ఫలితంగా అతను కుటుంబ సభ్యులతో కలిసి ఆ-త్మ-హ-త్య-కు పాల్పడ్డట్టు భావించాల్సి వస్తోందని, పోలీసు సిబ్బంది నిందితులుగా ఉన్నారని వివరించింది. ఈ నేపథ్యంలో కోర్టు విచక్షణను ఉపయోగించి సీబీఐకి ఆదేశించలేమని తేల్చి చెప్పింది. దీంతో అనేక ఆరోపణలు ఉన్నా, ఇప్పుడు ఈ కేసు పరిష్కరించే భారం ఏపి పోలీసుల పైనే పడింది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read