విశాఖపట్నం నగరంలోని ప్యూజన్ ఫుడ్స్ సంస్థను ఖాళీ చేయించిన వ్యవహారంలో అధికారుల తీరును హైకోర్టు తప్పు పట్టింది. ఆదివారం సెలవు రోజున ఎలా ఖాళీ చేయిస్తారని ప్రశ్నించింది. ముందు రోజు నోటీస్ ఇచ్చి మరుసటి రోజు ఆదివారం అయినప్పటికీ పోలీస్ బలగాలను ఉపయోగించటం అన్యాయమని స్పష్టం చేసింది. ఖాళీ చేయించన స్థలాన్ని పూజన్ ఫుడ్స్ సంస్థకు అప్పగించాలని వీఎంఆర్డీఏ (విశాఖపట్నం మెట్రో రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ)ని ఆదేశించింది. లీజు గడువు ముగియక ముందే ఖాళీ చేయించటాన్ని సవాల్ చేస్తూ సంస్థయాజమాన్యం గత ఏడాది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై బుధవారం హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజులు విచారణ జరిపారు. ప్రాంగణాన్ని ఖాళీ చేసేందుకు తగిన వ్యవధి ఇవ్వకపోవటాన్ని ఆక్షేపించారు. ఈజ్ మెంట్ చట్ట నిబంధనల ప్రకారం లీజుదారు ఓ ప్రాంగణాన్ని ఖాళీ చేయాలంటే అందుకు తగిన వ్యవధి ఇవ్వాల్సి ఉందన్నారు. సెలవు రోజులు, ఆదివారాల్లో ఖాళీ చేయించరాదని గతంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను అధికారులు బేఖాతరు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సంస్థ యాజమాన్యాన్ని ఇబ్బందులకు గురిచేసినందుకు గాను పాతికవేల రూపాయలు ఖర్చుల కింద చెల్లించాలని ఖాళీ చేయించిన ప్రాంగణాన్ని తిరిగి అప్పగించాలని జసిస్ సోమయాజులు తీర్పునిచ్చారు.

fusion 01042021 2

ఇక తీర్పులోని ముఖ్య అంశాలు చూస్తే, 2024 వారలు లైసెన్స్ ఉందని చెప్తున్నారు కానీ, ఎక్కడా పిటీషనర్ విరుద్ధంగా వ్యవహరించారని రుజువు చేయలేక పోయారు కదా అని కోర్టు ప్రశ్నించింది. ఎక్కడా అద్దె చెల్లించకపోవటం లేదు కదా. ఒప్పందం ఉల్లంఘించలేదు కదా అని కోర్టు ప్రశ్నించింది. అసలు ఒక్క రోజులో ఖాళీ చేయమని నోటీసు ఇవ్వటం, తరువాత రోజు బలగాలు తీసుకుని, 11 లారీల్లో అక్కడకు వెళ్ళటం చూస్తుంటే, అంతా ప్లాన్ ప్రకారం చేసినట్టు అర్ధమవుతుందని కోర్టు పేర్కొంది. ఇక అసలు పోలీసులను తీసుకుని వెళ్లి ఎందుకు ఖాళీ చేయించాల్సి వచ్చింది, సామాన్యులు పోలీసులును చూస్తే భయపడి పోతారు అనే కదా, అని కోర్టు ప్రశ్నించింది. ఎందుకు బయటకు నెట్టారు, అంత కారణం ఏముందో మాకు కనపడటం లేదని కోర్టు పేర్కొంది. మొత్తంగా, ఈ చర్యను తప్పు బడుతూ, పాతికవేల రూపాయలు జరిమానా విధించింది. అయితే గతంలో దీన్ని రచ్చ రచ్చ చేసిన వైసీపీ నేతలు, సోషల్ మీడియా, ఇప్పుడు మాత్రం, మౌనంగా ఉన్నారు...

Advertisements

Advertisements

Latest Articles

Most Read