తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో హైకోర్టు న్యాయవాదుల బృందంతో జాతీయ అధ్యక్ష్యులు నారా చంద్రబాబు నాయుడు సమావేశమయ్యారు. ఈ సంధర్భంగా నరేగా బిల్లుల చెల్లింపుల్లో నిబంధనలు అతిక్రమిస్తున్న జగన్ రెడ్డి ప్రభుత్వ వైఖరి చర్చకు వచ్చింది. నేడు ఆ విషయంపై హైకోర్టు ప్రభుత్వ వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేయటం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమైంది. నరేగా బిల్లుల చెల్లింపులపై హైకోర్టు ధర్మాసనం తీర్పును కూడా చిత్తశుద్దితో ప్రభుత్వం అమలు చేయక దిక్కరణకు వడిగట్టడంపై అవసరమైతే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని హైకోర్టు బోను ఎక్కించే అవకాశముంటుందని కోర్టు హెచ్చరించింది. 7 లక్షల మంది సామాన్యులు, మద్యతరగతికి చెందిన వారి నరేగా బిల్లులు రెండేళ్ల నుంచి నిబంధనలు అతిక్రమించి తొక్కిపెట్టడం ఎంతో కాలం సాద్యం కాదు. చట్టం చేతిలో మూర్ఖత్వం చివరకు నిలువజాలదు. కనుక ఇప్పటికైనా అధికారుల్ని బలిపెట్టేవిధానాన్ని జగన్ రెడ్డి విడనాడాలి. నరేగా పనులు చేసిన వారిపై కక్ష్యసాధింపు విధానాలు మానుకోకపోతే జగన్ రెడ్డి ప్రభుత్వం తగు మూల్యం చెల్లించుకోకతప్పదని అభిప్రాయం వ్యక్తమైంది. న్యాయవాదులతో జరిగిన సమావేశంలో వైసీపీ ప్రభుత్వం ప్రతి బిల్లు చెల్లించేంతవరకు గట్టి పోరాటం కొనసాగించాలని న్యాయవాదులను చంద్రబాబు నాయుడు కోరారు. నరేగా పనులు చేసి నష్టపోయిన వారికి పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
వదిలిపెట్టే సమస్యే లేదు... హైకోర్టు లాయర్లతో చంద్రబాబు సమావేశం...
Advertisements