జాతీయఉపాధి హామీపథకం కింద 2018-19, 2019-20లకు గాను, గతంలో టీడీపీప్రభుత్వం దాదాపు రూ4వేల కోట్ల విలువైనపనులు చేయించిందని, ఆ పను లకు సంబంధించిన నిధులచెల్లింపుపై ఇప్పుడున్న ప్ర భుత్వ ఎందుకు స్పందించడంలేదని టీడీపీసీనియర్ నేత, మాజీమంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ నిలదీశారు. బుధవారం ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. నిధుల విడు దల వ్యవహారంపై టీడీపీ ఎంపీలు పార్లమెంట్ లో కూడా ప్రస్తావనచేశారన్నారు. కేంద్ర,రాష్ట్రప్రభుత్వాలకు విజ్ఞప్తిచే సినప్పటికీ జాప్యం జరుగుతుండటంతో నిధులకోసం కోర్టులను కూడా ఆశ్రయించడం జరిగిందన్నారు. దానిపై హైకోర్టు న్యాయమూర్తి జే.కే.మహేశ్వరి నెలరోజుల్లో ఉపా ధి హామీ పనులనిధులు చెల్లించాలని ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగిందన్నారు. గతప్రభుత్వంలో జరిగిన పను లకు సంబంధించి కేంద్రం రూ.2,400కోట్లను విడుదల చేసిందని, గతంలో పెండింగ్ లో ఉన్న బిల్లులకు సొ మ్ముచెల్లించాలని, ఒకవేళ చెల్లింపులు ఆలస్యమైతే, ఆ కాలానికి వడ్డీకూడా కలిపి ఇవ్వాలని కేంద్రప్రభుత్వంలో ని నరేగా చట్టంలో పేర్కొనడం జరిగిందని మాజీమంత్రి వివరించారు. గతప్రభుత్వం చేసిన పనులకు నిధులు చెల్లించకుండా ఇప్పుడున్నప్రభుత్వం విచారణలపేరుతో కావాలనే జాప్యంచేస్తోందన్నారు. ఒకసారి సోషల్ ఆడిట్ జరిగాక దానికిసంబంధించి, చట్టప్రకారం ఎటువంటి నివేదికలు ఇవ్వడం కుదరదని విజిలెన్స్ బృందం, పంచాయతీరాజ్ శాఖాధికారులు ప్రభుత్వానికి స్పష్టం చేసినప్పటికీ, కావాలనే పాలకులు జాప్యం చేస్తున్నా రన్నారు. కావాలనే ప్రభుత్వం అన్యాయంగా వ్యవహరి స్తోందన్న ఆలపాటి, ఈ ప్రభుత్వం వచ్చిన రెండేళ్లలో గ్రామాల్లో ఎలాంటి అభివృద్ధిపనులు జరిగాయో చెప్పాల న్నారు. పాఠశాలలు, పంచాయతీభవనాలు, రోడ్లు, కాల్వలు, నీటవసతి కల్పన వంటి ఇతరత్రా పనులన్నిం టినీ వైసీపీప్రభుత్వం పక్కనపెట్టిందన్నారు. గతప్రభు త్వంలో చేసిన పనులకు సంబంధించి నిధులు ఇవ్వకుం డా కాంట్రాక్టర్లను, కూలీలను ఎందుకు వేధిస్తున్నారో పా లకులు సమాధానం చెప్పాలని రాజేంద్రప్రసాద్ డిమాం డ్ చేశారు.

పెండింగ్ బకాయిలను ముందు చెల్లించాలని కేంద్రం చెబుతుంటే, 2019మేలో వచ్చిన ప్రభుత్వం ఆ నిధులను ఏంచేసిందో చెప్పాలన్నారు. గతప్రభుత్వంలో చేసిన పనులతాలూకూ కేంద్రంనుంచి వచ్చిన రూ.2,400కోట్లు ఏమయ్యాయో కూడా ప్రభుత్వం చెప్ప డం లేదన్నారు. 2019 మే నుంచి, 2021 మార్చిమధ్య రూ.6,400కోట్లు ఖర్చుచేసినట్టు, జెట్ స్పీడులో ఉపాధి హామీ పనులు చేసినట్టు ఈ ప్రభుత్వంచెప్పుకోవడం సి గ్గుచేటన్నారు. ప్రభుత్వం ఎక్కడ, ఏగ్రామంలో తట్ట మట్టి తీసిందో చెప్పాలన్నారు. హైకోర్టు అనేకమార్లు ఉపాధి హామీ నిధులు ఎందుకుచెల్లించడంలేదని ప్రశ్నించినా, ప్రభుత్వం నుంచి స్పందనలేదన్నారు. రూ.5లక్షల లోపు జరిగిన పనులతాలూకా నిధులను 80శాతం వరకు విడుదలచేసినట్టు చెప్పిన ప్రభుత్వాన్ని, అందుకు సంబంధించిన ఆధారాలు తమకు సమర్పిం చాలని హైకోర్టు ఆదేశించిందన్నారు. మిగిలిన 20శాతం నిధులను ఎందుకు చెల్లించడంలేదని కూడా న్యాయస్థా నం ప్రభుత్వాన్ని ప్రశ్నించిందన్నారు. 2019 అక్టోబర్ లో కోర్టులో వ్యాజ్యాలు వేయడం జరిగిందని, అప్పట్నుం చీ, ఇప్పటివరకు ఎందుకు జాప్యంజరిగిందో పాలకులు సమాధానంచెప్పాలన్నారు. కొన్ని పనులను ఎమ్ బుక్ ల్లో రికార్డుచేయలేదని, కళ్లముందు జరిగిన పనులు కని పిస్తున్నా, కావాలనే వాటిని నమోదుచేయలేదన్నారు. విధ్వంసపు ఆలోచనలతో ఉన్నప్రభుత్వం, తనవారికి ఒక న్యాయాన్ని, పరులకు మరోన్యాయాన్ని అమలు చే స్తోందని ఆలపాటి మండిపడ్డారు. ఎన్ఆర్ఈజీఎస్ నిధు లను ఇళ్లస్థలాల చదునుకోసం వాడామని, రూ.4వేలకో ట్లను అందుకోసం విడుదలచేశామని ప్రభుత్వం చెబు తోందన్నారు. రూ.4వేలకోట్లలో, రూ.500కోట్లను కూడా ప్రభుత్వం వినియోగించలేదన్నారు. ఈ ప్రభుత్వంలో చే సిన పనులపై మాత్రం ఎటువంటి విచారణలకు ఆదేశిం చకుండా, అధికారుల సంతకాలతో ఉపాధి నిధులను జగన్ ప్రభుత్వం దోచుకుంటోందన్నారు.

గతప్రభుత్వం లో ఏగ్రామానికి వెళ్లినా పూర్తైన పనులు కళ్లముందు కనిపించేవని, కానీ నేడు పనులుచేయకుండానే, పాల కులు తమవారికి అడ్వాన్స్ లరూపంలో ఉపాధి నిధుల ను ధారాధత్తంచేస్తున్నారన్నారు. కోర్టుల ఆదేశాలను కూడా పాలకులు పెడచెవిన పెడుతున్నారని, కేంద్రం అడుగుతున్నాకూడా సమాధానం చెప్పడంలేదన్నారు. రూ.5లక్షలలోపు జరిగిన పనులకుసంబంధించి కేవలం పుంగనూరు, పులివెందులలో మాత్రమే ప్రభుత్వం నిధులు చెల్లించిందితప్ప, రాష్ట్రంలో ఎక్కడా ఎవరికీ రూపాయి ఇవ్వలేదన్నారు. గతప్రభుత్వంలో జరిగిన పనులకు సంబంధించి విచారణ పేరుతో ఈ ప్రభుత్వం ఇచ్చిన 1000పేజీల నివేదికలో ఎటువంటి సారం లేద న్నారు. కేవలం జాప్యంకోసమే జగన్ ప్రభుత్వం కమిటీ లు వేసిందని, గతప్రభుత్వంలో పనులుచేసిన సర్పంచ్ లు, ఇతరత్రా గ్రామ, మండలస్థాయి నాయకులను పార్టీ మారితేనే నిధులిస్తామంటూ ప్రభుత్వం బెదిరిస్తోందన్నా రు. సిగ్గు, లజ్జలేని ప్రభుత్వం దేనికైనా తెగిస్తుందని, న్యా యస్థానాల ఆదేశాలనుకూడా ఖాతరు చేయకుండా అహంకారంతో వ్యవహరిస్తోందన్నారు. ఏప్రియల్ 23న ఈ అంశం తిరిగి విచారణకు రాబోతోందని, అప్పడు ఈప్రభుత్వం, కోర్టుకి ఏంసమాధానం చెబుతుందో చూస్తామన్నారు. అవకతవకల పేరుతో కోర్టులను పక్క దారిపట్టిస్తున్న జగన్ ప్రభుత్వం, 2019లోజరిగి, పెండింగ్ లోఉన్న పనుల బకాయిలను నిలిపివేశార న్నారు. కోర్టులు అక్షింతలు వేసినా, ఆగ్రహం వ్యక్తంచేసి నా దులుపుకొని పోతున్న ప్రభుత్వం 23వతేదీన న్యా యస్థానంలో దోషిగా నిలబడితీరుతుందని ఆలపాటి స్పష్టంచేశారు. అవినీతి, అక్రమాల ప్రభుత్వం గతప్రభు త్వంలో జరిగిన దాదాపు రూ.8లక్షల విలువైన పనుల కు నేటికీ రూపాయికూడా చెల్లించలేదన్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read