ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన కేసు వివేక కేసు. ఆయన సరిగ్గా 2019 ఎన్నికల నెల రోజులు ముందు, చం-ప-బ-డ్డా-రు. వైసీపీ నేతలు గుండె పోటు అంటూ కవర్ చేద్దామని ట్రై చేసినా, చివరకు నిజం బయటకు వచ్చింది. ప్రజలు ఆశ్చర్య పోయారు. అసలు ముందు గుండె నొప్పి అని ఎందుకు చెప్పారో, ఈ రోజుకీ ఎవరికీ తెలియదు. అయితే అప్పటికే ఎన్నికల ప్రక్రియ మొదలు కావటంతో, కేసు విచారణ ముందుకు సాగలేదు. అప్పట్లో ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్ మోహన్ రెడ్డి, సిబిఐ విచారణ కావాలని నానా యాగీ చేసారు. ఇక ఇక్కడ మరో విశేషం ఏమిటి అంటే, వివేక కేసు గురించి ఎన్నికల్లో టిడిపి మాట్లాడకుండా, గ్యాగ్ ఆర్డర్ తెచ్చుకున్నారు. ఇక తరువాత జగన్ ముఖ్యమంత్రి అయ్యారు. ఇంకేముందు, సిబిఐ విచారణకు ఆదేశిస్తారు, వివేక కుటుంబానికి న్యాయం జరుగుతుందని అందరూ అనుకున్నారు. ఈ లోపు సిబిఐ విచారణ కావాలని వేసిన పిటీషన్ ను, జగన్ వెనక్కు తీసుకున్నారు. అయితే, నెలలు గడుస్తున్నా ఏమి కాకపోవటంతో, వివేక కూతురు సంచలనానికి తెర లేపారు. ఏకంగా 15 మంది పై అనుమానం ఉందని, కోర్టుకు వెళ్లి, సిబిఐ విచారణ తెచ్చుకున్నారు. అయితే ఈ విచారణ కూడా గత ఏడాది కాలంగా సాగుతూనే ఉంది. సిబిఐ వచ్చి, వెళ్తున్నా, విచారణ మాత్రం, ఫాస్ట్ గా సగటం లేదు.
అయితే ఇప్పటికే కేరళలో ఉన్న ఒక సామాజిక కార్యకర్త సహాయం తీసుకున్న వివేక కూతురు, మరిన్ని ఆధారాలు సేకరించే పనిలో ఉన్నారని వార్తలు వచ్చాయి. వీటి అన్నిటి నేపధ్యం, అనేక ప్రచారాల నేపధ్యంలో, వివేక కూతురు సునీత, నిన్న ఢిల్లీ వెళ్లారు. ఈ రోజు ఆమె సిబిఐ కేంద్ర కార్యాలయానికి వెళ్తారని తెలుస్తుంది. అక్కడకు వెళ్లి, కేసు విచారణ తీరు, మరిన్ని ఆధారాలు, ఇలా అనేక అంశాల పై సిబిఐతో చర్చించనున్నారు. ఈ కేసు విచారణ త్వరగా పూర్తి చేయాలని, ఆమె సిబిఐని అడుగుతారు అంటూ, వార్తలు వచ్చాయి. ఘటన జరిగి రెండేళ్ళు అయినా, ఇంకా న్యాయం దొరకలేదని, దోషులను తొందరగా పట్టుకుని శిక్షించాలని కోరుతున్నారు. అయితే సిబిఐని కలిసిన తరువాత, ఆమె ఢిల్లీ ప్రెస్ క్లబ్ లో, ప్రెస్ మీట్ లో మాట్లాడతారని తెలుస్తుంది. ఇప్పుడు ఆమె ఏమి మాట్లాడతారు, ఎవరి పైన ఆరోపణలు చేస్తారు, అనే విషయం పై ఇప్పుడు సస్పెన్స్ నెలకొంది. ఎందుకో కానీ ఈ కేసు విషయంలో, జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం సరిగ్గా స్పందించలేదు అనే ఆరోపణలు ఉన్నాయి. సొంత బాబాయ్ విషయంలోనే, ఇప్పటికీ ఏమి చేయలేదని, ప్రతిపక్షాలు తరుచూ ఆరోపిస్తున్నా, అటు వైపు నుంచి రియాక్షన్ లేదు.