ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు సిఐడి నోటీసులు ఇచ్చిన ఘటన పై, ఒక పక్క రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతుంది. ఈ నోటీసులు ఇచ్చిన తీరు పై అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. రాజకీయ కక్ష సాధింపు తప్ప, ఈ కేసులో పసలేదని వాదిస్తున్నారు. ఎవరో తనకు ఫిర్యాదు చేసారని, ఆ ఎవరో పేర్లు చెప్పకుండా, ఎవరు మోసం చేసారో చెప్పకుండా, జరిగిన స్కాం ఏంటో చెప్పకుండా, ఎక్కడ ఏ ఊరిలో, ఏ భూమిలో జరిగిందో చెప్పకుండా, వైసీపీ ఎమ్మెల్యే ఇచ్చిన ఫిర్యాదుతో, ఏకంగా చంద్రబాబు స్థాయి వ్యక్తికి నోటీసులు ఇవ్వటం పై, అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అయితే దీని పై చంద్రబాబు కోర్టుకు వెళ్లనున్నారు. ఇది ఇలా ఉంటే ఒక పక్క చంద్రబాబు పై ఇలా కక్ష సాధింపు చర్యలు చేస్తూనే, ఇప్పుడు ఆయన కుటుంబం పై కూడా ఒత్తిడి తెచ్చే పనులు చేస్తున్నారని, తెలుగుదేశం నేతలు వాపోతున్నారు. తాజాగా చంద్రబాబు సోదరి, హైమావతి ఇంట్లో, చంద్రగిరి పోలీసులు వెళ్లి హల్ చల్ చేయటం, ఇప్పుడు చర్చనీయంసంగా మారింది. చిత్తూరు జిల్లాలోని చంద్రగిరి మండలం కందులవారిపల్లెలో, చంద్రబాబు సోదరి హైమావతి ఉంటున్నారు. అయితే నిన్న ఆమె ఇంటికి, మేము పోలీసులం అని చెప్పి, కొంత మంది ఇంట్లోకి చొరబడటంతో, ఒక్కసారిగా కలకలం రేగింది.

police 180320212

ఎలాంటి అనుమతి లేకుండా, వాచ్ మెన్ రవి వారిని ఆపుతున్నా కూడా, మేము పోలీసులం అని చెప్పి ఇంట్లోకి వెళ్లి హడావిడి చేసారని, ఇంటి లోపల సిసిటీవీ కెమెరాలు ఉండటం, అవి చూసి, వెంటనే బయటకు వచ్చేసారని చెప్పారు. బయటకు వచ్చిన తరువాత, ఇంటి చుట్టూ ఉన్న పరిసరాలు మొత్తం ఫోటోలు తీసుకున్నారని వాచ్ మెన్ తెలిపారు. అయితే ఈ విషయం పై వాచ్ మెన్ రవి చంద్రగిరి పోలీసులకు ఫిర్యాదు చేసారు. నిన్న కొంత మంది పోలీసులు అని చెప్పి ఇంటి లోపలకి వచ్చారని, దానికి ఆధారంగా సిసిటీవీ ఫూటేజ్ కూడా పోలీసులకు సమర్పించి, అసలు వచ్చిన వారు ఎవరు, ఎందుకు వచ్చారో విచారణ చేయాలని చంద్రగిరి పోలీసులకు ఫిర్యాదు చేసారు. అయితే దీని పై స్పందించిన పోలీసులు, నారావారిపల్లె నుంచి, సుచరిత అనే ఆమె ఇంట్లోకి వచ్చిన కొంత మంది గొడవ చేస్తున్నారని ఫిర్యాదు వచ్చిందని, అయితే కందులవారిపల్లెలో ఉన్న చంద్రబాబు సోదరి హైమావతి కుమార్తె పేరు కూడా, సుచరిత కావటంతో, పోలీసులు కన్ఫ్యూజ్ అయ్యారని, అంతే తప్ప ఇందులో ఏమి లేదని తెలిపారు. అయితే దీని పై టిడిపి శ్రేణులు మాత్రం భగ్గుమంటున్నాయి. ఇందులో ఏదో కుట్ర దాగి ఉందని అంటున్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read