ఈ రోజు, అన్ని రాష్ట్రాలకు సంబందించిన క-రో-నా పరిస్థితితులు, అదే విధంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ పై ప్రధాని మోడీ, అన్ని రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రుల సమావేశంలో ప్రస్తావించారు. ముఖ్యంగా సెకండ్ వేవ్ వచ్చే ప్రమాదం ఉందని, అందరూ అప్రమత్తంగా ఉండి ఎక్కువ చర్యలు తీసుకోవాలని, ఈ సందర్భంగా ఆయన అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు తెలియచేసారు. ఆయా రాష్ట్రాలకు వెళ్ళిన వ్యాక్సినేషన్ అవుతుందని, వేస్టేజ్ అవుతుందని, దాన్ని కట్టడి చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. దేశంలో విస్తరిస్తున్న సెకండ్ వేవ్ ను ఆపాలని, దీనికి రాష్ట్రాలు కూడా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రులకు ప్రధాని మోడి స్పష్టం చేసారు. వ్యాక్సినేషన్ విజయవంతం అవ్వాలి అంటే, నిర్ణయాత్మక చర్యలు తీసుకోవాలని అన్నారు. పెరుగుతున్న కేసులు పై అప్రమత్తంగా ఉండి, అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా, ఒక ప్రణాళికను పంపించాలని అన్నారు. ఆయా రాష్ట్రాలు ఎదుర్కుంటున్న సమస్యలు కూడా ఈ నివేదికలో ఇవ్వాలని, రాష్ట్రాలను ఆదేశించారు. రాష్ట్రాల అభ్యర్ధన మేరకు, 45 ఏళ్ళు పైబడిన వారి అందరికీ కూడా వ్యాక్సిన్ ఇవ్వాలని, ఈ సమావేశంలో కేంద్రానికి ప్రతిపాదనలు ఉన్నాయని, దీని పై త్వరలోనే ఒక నిర్ణయం తీసుకుంటామని కేంద్ర ఆరోగ్య మంత్రి, రాష్ట్రాలకు తెలియ చేసారు.
అలాగే మాస్కులు తప్పనిసరి చేయాలని, బౌతిక దూరం నిబంధనలు ఖటినతనం చేయాలని, రాష్ట్రాలకు ప్రధాని మోడీ సూచించారు. ప్రజలు ఎక్కువగా గుమికూడే ప్రదేశాల్లో జరుగుతున్న ఈవెంట్స్ పై కూడా ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. సెకండ్ వేవ్ వస్తున్న దేశాల జాబితాలో, భారత దేశం రాకుండా చూడాల్సిన బాధ్యత అందరి పై ఉందని అన్నారు. అయితే ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వ్యాక్సిన్ వేస్టేజ్ అవుతున్న విషయం పై, ప్రధాని మోడీ అసంతృప్తి వ్యక్తం చేసారు. దాదాపుగా 10 శాతం వ్యాక్సిన్ వెస్ట్ అవుతుందని, ఆవేదన వ్యక్తం చేసారు. ఇలా వెస్ట్ అవ్వకుండా చూసుకోవాలని మోడీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సూచించారు. దాదాపుగా పది శాతం వ్యాక్సిన్ వెస్ట్ అవుతుందని అన్నారు. టీకా పంపిణీని ప్రతి రోజు జాగ్రత్తగా పర్యవేక్షణ చేసి, వెస్ట్ అవ్వకుండా చూడాలని ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ తో పాటుగా, తెలంగాణాలో కూడా ఈ సమస్య ఉందని, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఈ సమస్య ఉందని, ప్రధాని మోడి అన్నారు. ఈ విషయం పై తాను చింతిస్తున్నానని అన్నారు.