కొద్ది సేపటి క్రితం ప్రివేలేజ్ కమిటీ సమావేశం ముగిసింది. ప్రివేలేజ్ కమిటీ చైర్మెన్ కాకాని గోవర్ధన్ రెడ్డి, సభ్యులు మల్లాది విష్ణు, శిల్పా చక్రపాణి రెడ్డి, తదితర సభ్యులు జూమ్ లో సమవేశం అయ్యారు. అయితే ఈ సమావేశంలో ప్రధానంగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి ఇచ్చిన ప్రివేలేజ్ నోటీస్ పైన ఈ సమావేశంలో చర్చించారు. చర్చించిన తరువాత, ఈ నోటీస్ పై విచారణ చేపట్టాల్సిందే అనే అభిప్రాయానికి వచ్చారు. దీని పై ఫర్ధర్ ప్రొసీడింగ్స్ ఏమి ఉంటాయో, అవి ఫాలో అవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. అవసరం అయితే రాష్ట్ర ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ని విచారణకు పిలవాలి అనే దాని పై కూడా చర్చ జరిగింది. అయితే ఈ ప్రొసీడింగ్స్ పై ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనే దాని పైన, సాంకేతిక అంశాలు అన్నీ పరిశీలించి, దానికి అనుగుణంగా ముందుకు వెళ్ళాలని నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ, తన ప్రతిష్టకు భంగం కలిగించారని, రెండో సారి కూడా పెద్దిరెడ్డి ఫిర్యాదు చేసారు. మొదట మంత్రులు బొత్సా, పెద్దిరెడ్డి గవర్నర్ కు రాసిన లేఖను బయటకు విడుదల చేసి, తమ ప్రతిష్టకు భంగం కలిగించారని, ఫిర్యాదు చేసారు. అయితే తరువాత, మళ్ళీ పెద్దిరెడ్డి ఇంకో ఫిర్యాదు చేసారు. ఈ ఫిర్యాదుని కూడా విచారించి, పరిగణలోకి తీసుకుంది ప్రివేలేజ్ కమిటీ.
దీని పైన వెంటనే అవసరమైన చర్యలు తీసుకోవాలని, నిర్ణయం తేసుకున్నారు. అవసరం అయితే, నిమ్మగడ్డకు నోటీసులు ఇవ్వాలని చర్చ జరిగింది. అయితే అందుతున్న సమాచారం ప్రకారం, విచారణకు అందుబాటులో ఉండాలి అంటూ, నిమ్మగడ్డకు లేఖ రాయాలని, అసెంబ్లీ సెక్రటరీని ఆదేశించినట్టు తెలుస్తుంది. రేపు ఉదయమే, నిమ్మగడ్డకు ఈ లేఖ పంపే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. అయితే ఈ సమావేశాన్ని అత్యవసరంగా నిర్వహించటం, అదే విధంగా వెంటనే చేపట్టాలని , జూమ్ లో ఈ సమావేశం నిర్వహించటం ఆసక్తి రేపుతుంది. గతంలో ఇదే ఫిర్యాదు పై, ఒకసారి సమావేశం అయిన కమిటీ, ఏ నిర్ణయం తీసుకోకుండానే అప్పట్లో వాయిదా వేసింది. అయితే ఈ రోజు ఆరు గంటలకు సమావేశం ఏర్పాటు చేస్తున్నట్టు సమాచారం ఇవ్వటంతో, అందరూ ఈ సమావేశానికి హాజరు అయ్యారు. పెద్దిరెడ్డి , రాష్ట్ర ఎన్నికల కమిషన్ ను దుషిస్తూ మీడియా సమావేశం పెట్టటం, దీని పై నిమ్మగడ్డ, ఈ విషయం పై గవర్నర్ కు లేఖ రాస్తూ, ఆ లేఖ మీడియాకు విడుదల చేయటంతో, తమ హక్కులకు భంగం కలిగింది అంటూ, పెద్దిరెడ్డి, బొత్సా ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.