అమరావతి భూముల్లో ఇన్సైడర్ ట్రేడింగ్ అంటూ, చంద్రబాబుకు ఈ రోజు నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ కేసు పెట్టింది, వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి అని తెలుస్తుంది. ఈ కేసు మార్చ్ 12న నమోదు అయినట్టు తెలుస్తుంది. ఇందులో ప్రధానమైన ఆరోపణ ఏమిటి అంటే, అమరావతి రాజధాని విషయం పై, తన అనుచరులకు చంద్రబాబు ముందే ఇచ్చారని, అక్కడ ఉన్న అసైన్డ్ భూములను చంద్రబాబు ముందే తమ అనుచరుల చేత కొనిపించారని, ప్రదమైన అభియోగం. ఈ అభియోగంలో ముఖ్యంగా అసైన్డ్ భూములు కొనుగోలు చేసిన తరువాత, తన అనుచురులకు కట్టబెట్టిన తరువాత, అమరావతిని రాజధానిగా ప్రకటించారని, దీని వల్ల తన అనుచరులకు లబ్ది చేకుర్చారని అభియోగం. నవులూరు గ్రామానికి చెందిన కొంత మంది రైతులు, అక్కడ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డికి ఫిర్యాదు చేయగా, ఆయన ఫిర్యాదుని తీసుకుని సిఐడి నోటీసులు ఇచ్చింది. ఈ ఫిర్యాదు ఆధారంగానే, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు, మాజీ మంత్రి నారాయణకు, ఈ కేసు నమోదు చేసారు. ఈ కేసు నాలుగు రోజులు క్రితం నమోదు అయ్యింది. ఈ కేసు విచారణకు రావాలని, చంద్రబాబుకు నోటీసులు జారీ చేసారు. చంద్రబాబుపై 120బి, 166, 167, 217 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసారు.

cbn notice 16032021 2

అయితే దీంతో పాటుగా, ఎస్సీ, ఎస్టీ కేసు కూడా ఇందులో చేర్చటం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఒక మాజీ ముఖ్యమంత్రి పై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయటం, ఈ దేశంలోనే మొదటి సారి అని తెలుగుదేశం వర్గాలు అంటున్నాయి. అసైన్డ్ భూములు, దళితుల నుంచి లాక్కున్నారు కాబట్టి, ఈ కేసు పెట్టాం అని చెప్తున్నారు. ఈ కేసులో మరో ప్రదమైన అంశం ఏమిటి అంటే, ఇప్పటికే ఇలాంటి కేసు, అంటే, అసైన్డ్ భూములు కొనుగోలు, ఇన్సైడర్ ట్రేడింగ్ కు సంబంధించి నమోదైన కేసు విషయంలో, హైకోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చింది. ఇన్సైడర్ ట్రేడింగ్ అనే పదం, భూములు కొనుగోళ్ళులో లేదని, ఈ పదానికి ఐపీసిలో అర్ధం లేదని కోర్టు ఈ కేసు కొట్టేసింది. దీంతో వ్యూహం మార్చిన ప్రభుత్వం, ఇన్సైడర్ ట్రేడింగ్ కాకుండా, అసైన్డ్ భూములు, దళితులూ అంటూ, మరో కేసుని వ్యూహాత్మికంగా ముందుకు తీసుకుని వచ్చారు. ఈ కేసులోనే చంద్రబాబు విచారణకు హాజరు కావాలని చంద్రబాబుని, నారాయణను కేసులో పెట్టి, చంద్రబాబుని 23వ తేదీన విచారణకు హాజరు కావాలని ఆదేశాలు ఇచ్చారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read