ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంపీటీసీ, జెడ్పీటీసి ఎన్నికలకు సంబంధించి, ఈ రోజు హైకోర్టు ఇచ్చిన తీర్పుతో, ఈ రెండు ఎన్నికలకు లైన్ క్లియర్ అయ్యింది. కొద్ది సేపటి క్రితం రాష్ట్ర హైకోర్టు, గతంలో రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఇచ్చిన ఉత్తర్వులను పక్కన పెట్టింది. దీంతో పాటుగా, ఎవరు అయితే గతంలో ఏకగ్రీవం అయ్యారో, వారి అందరికీ కూడా, వెంటనే డిక్లరేషన్ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. ఎంపీటీసీ, జెడ్పీటీసి ఎన్నికల్లో, గతంలో సాధారణ స్థాయికి మించి ఏకాగ్రీవాలు అయ్యాయని, రాష్ట్ర ఎన్నికల కమిషన్, కేంద్ర హోం శాఖకు ఫిర్యాదు చేసింది. ఈ నేపధ్యంలోనే, ఈ ఎన్నికల్లో ఏవి అయితే అక్రమాలు జరిగాయో, దాని పై విచారణ జరగాలని, అదే విధంగా గతంలో ఇచ్చిన నోటిఫికేషన్ పైనే ఎన్నికలు జరగాలని కొంత మంది హైకోర్టున ఆశ్రయించగా, హైకోర్టు రీ నోటిఫికేషన్ కు సంబంధించి ఏవైతే ఆదేశాలు ఇచ్చిందో, ఆ ఆదేశాలకు సంబంధించి, రీ నోటిఫికేషన్ ఇచ్చే ముందు, రాష్ట్ర ఎన్నికల సంఘం కొన్ని ఆదేశాలు ఇచ్చింది. అందులో ముఖ్యంగా, గతంలో దౌర్జన్యాలు కారణంగా ఎవరైతే నామినేషన్ ను వేయలేక పోయారో, వారు అప్పట్లో ఎన్నికల కమిషన్ కు కానీ, రిటర్నింగ్ అధికారికి కాని, అక్కడ ఉండే పోలీస్ అధికారికి కానీ ఫిర్యాదు చేసినట్టు అయితే, ఆ ఫిర్యాదు కాపీని జత చేసి, తమకు లేఖ అందిస్తే, వాటిని విచారణ జరిపి, అందులో ప్రాధమిక సాక్ష్యాలు ఉంటే, వారి నామినేషన్ ను పరిశీలిస్తామని అని చెప్పి ఎన్నికల కమిషన్ చెప్పింది. ఈ నేపధ్యంలోనే, వీటిని సవాల్ చేస్తూ, గతంలో ఎవరైతే ఏకగ్రీవం అయ్యారో వారు అంతా, హైకోర్టుని ఆశ్రయించారు.

hc 16032021 1

తాము ఒకసారి ఏకగ్రీవం అయినట్టు చెప్పి, ఆ తరువాత నామినేషన్లు అయిపోయిన తరువాత, ఇప్పుడు కొత్తగా ఫిర్యాదులు స్వీకరించటం ఏమిటి అని, హైకోర్టుని ఆశ్రయించారు. అయితే రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఇచ్చిన ఉత్తర్వులు పై, హైకోర్టులో విచారణ జరిగింది. అటు ఎన్నికల కమిషన్, ఇటు ప్రభుత్వం, అదే విధంగా పిటీషనర్ తరుపు న్యాయవాదులతో పాటు పలు రాజకీయ పార్టీలు కూడా ఇందులో ఇంప్లీడ్ అయ్యాయి. ఈ పిటీషన్ లు అన్నీ కలిపి విచారణ చేసిన హైకోర్టు, ఈ విచారణ అనంతరం, ఈ రోజు కొద్ది సేపటి క్రితం తీర్పు చెప్పింది. ఒకసారి నామినేషన్ల ప్రికియ అయిన తరువాత, ఎవరు అయితే ఏకగ్రీవం అయ్యారో, అటువంటి దాంట్లో మళ్ళీ ఎన్నికల కమిషన్ జోక్యం చేసుకో కూడదు అని నిబంధనలు చెప్తున్నాయని కోర్టు పేర్కొంది. ఎవరు అయితే ప్రలోభాలు, దౌర్జన్యాలకు, గురి అయ్యారో, వాళ్లకి న్యాయం చేయటం అనేది మంచిదే అయినా కూడా, ఒకసారి ప్రక్రియ పూర్తయిన తరువాత, ఇలా చేయటం మంచిది కాదని చెప్తూ, ఎన్నికల కమిషన్ ఉత్తర్వులు పక్కన పెట్టటమే కాకుండా, ఏకగ్రీవం అయిన వారికి డిక్లరేషన్ ఇవ్వాలని ఆదేశించింది. ఈ ఆదేశాలు కారణంగా ఎంపీటీసీ, జెడ్పీటీసి ప్రక్రియ గతంలో ఎక్కడ అయితే ఆగిందో, మళ్ళీ అక్కడ నుంచి తిరిగి నిర్వహించే అవకాసం ఉంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read