మున్సిపల్ఎన్నికల ఫలితాల పై అధికార వైసీపీ అబద్ధాలు చెబుతోందని, గెలుపుకోసం జగన్మోహన్ రెడ్డి ఎన్నికల వ్యవస్థను, ఎన్నికలవిధానాలను ఎలామార్చేశాడనే దానిపై ఆ పార్టీనేతలు, ప్రజలు ఆలోచించాలని టీడీపీ అధికారప్రతినిధి సయ్యద్ రఫీ తెలిపారు. సోమవారం ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయకార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. గతంలో ఎన్నికల్లో గెలుపుకోసం రాజకీయపార్టీలు పోటీపడేవని, ఏపార్టీకి ఆపార్టీ వాటివాటి విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్ల డానికి ప్రయత్నించేవని, పోలీసులు అధికారులు రిఫరీ పాత్ర పోషించేవారని రఫీ పేర్కొన్నారు. ఎవరైనా నిబంధనలను, చట్టాన్ని అతిక్రమిస్తే పోలీసులు సరిచేసేవారన్నారు. ప్రజలు తమ ఓటుహక్కుని స్వేఛ్చగా వినియోగించుకోవడానికి సదరు పోలీస్, అధికారవ్యవస్థ ఉపయోగపడేదన్నారు. జగన్ అధికారంలోకివచ్చాక, గతంలోఉన్న పద్ధతికి భిన్నంగా అంతా మారిపోయిందన్నారు. పోలీస్, అధికారవ్యవస్థలు పూర్తిగా చేతులెత్తేసి ప్రభుత్వానికి దాసోహమయ్యాయన్నారు. వైసీపీ గెలుపులో ప్రభుత్వం, పోలీసులు, ప్రభుత్వయంత్రాంగం, వాలంటీర్ వ్యవస్థ, డబ్బుపంపిణీ వంటివి కీలకపాత్ర పోషించాయన్నారు. ప్రతిపక్షమైన తెలుగుదేశంపార్టీ అధికార పార్టీతోకాకుండా, పైనచెప్పిన ఐదుశక్తులతో పోటీ పడే పరిస్థితిని వైసీపీ ప్రభుత్వం కల్పించిందన్నారు. సంక్షేమ పథకాలనేవి అన్నిప్రభుత్వాలు, అందరు నాయకులు అమలు చేశారని, కానీ తమకు ఓటేయకుంటే, ఆయా పథకాలను తీసేస్తామనే బెదిరింపు ధోరణి, భయానకవాతావరణాన్ని ఈప్రభుత్వంలో చూస్తున్నామన్నారు.
వాలంటీర్ వ్యవస్థ ప్రభుత్వానికి గెలుపు అందించడంలో కీలకపాత్ర పోషించిందని రఫీ తెలిపారు. మున్సిపల్ ఎన్నికల్లో పార్టీలమధ్యన కాకుండా, ప్రభుత్వం కిందున్న ఐదు వ్యవస్థలతో ప్రతిపక్షాలు తలపడాల్సి వచ్చిందన్నారు. వాలంటీర్లు చెప్పింది వినకుంటే, తమ రేషన్ కార్డులు, పింఛన్లు, ఇళ్లస్థలాలు ఎక్కడ తీసేస్తారోనన్న భయమే ఎక్కువగా ప్రజలను ప్రభావితం చేసిందన్నారు. ప్రభుత్వ పథకాలపై ఆధారపడి బతికే పేదలంతా విధిలేక, గతిలేక వాలంటీర్ల బెదిరింపులకు తలొగ్గాల్సి వచ్చిందన్నారు. దాని తోపాటు, ఓటర్ల ఓట్లను తారుమారుచేయడం, ఒక డివిజన్ లో ఉండాల్సిన ఓట్లను మరోడివిజన్ కు మార్చడం వంటివి కూడా ఓటింగ్ పై ప్రభావం చూపిందన్నారు. అన్నివ్యవస్థలు కలగలిసిన కొండచిలువవంటి ప్రభుత్వంతో, తెలుగుదేశంపార్టీ ప్రాణాలకు తెగించి పోరాడిందన్నారు. మున్సిపల్ ఎన్నికల ఫలితాలను చూశాక, ప్రభుత్వంతోపాటు, మిగిలినశక్తులను ఎలా తట్టుకోవాలనే దానిపై టీడీపీ ఇప్పటికే దృష్టిసారించింద న్నారు. అన్నింటికన్నా చివరిదైన డబ్బు ప్రభావాన్ని ఎలా నిలువరించాలనే దానిపై కూడా ఆలోచనచేస్తున్నామన్నారు. తాడిపత్రి, మైదుకూరులో టీడీపీనేతలు చేసినపోరాటమే, అన్నిచోట్లా చేయాలనే విషయాన్ని తమపార్టీనేతలు ఆలస్యం గా గ్రహించారన్నారు. విశాఖ ఉక్కుప్రైవేటీకరణ, అమరావతి, ఆస్తిపన్ను పెంపువంటి అంశాలను టీడీపీ ప్రజలకు తీసుకె ళ్లిందని, అయినప్పటీకీప్రజలు వాటిని ఒప్పుకొనే ఓటింగ్ కు రావడంజరిగిందన్నారు. ఫలితాలు అమరావతికి వ్యతిరేకమని, మూడురాజధానులకు అనుకూలమని చెప్పుకుంటున్న వైసీపీనేతలంతా ఆస్తిపన్నుపెంపును, ధరలపెరగుదలను కూడా ప్రజలు ఆమోదించారని చెప్పగలరా అని రఫీ ప్రశ్నిం చారు.