మున్సిపల్ ఎన్నికల్లో మైదుకూరులో టీడీపీ విజయం సాధించడంతో, వైసీపీ ఓర్వలేకపోతోందని, నామినేషన్ల ఉప సంహరణ మొదలు కౌంటింగ్ ప్రక్రియపూర్తయ్యేవరకు టీడీపీ అభ్యర్థులు ఎక్కడా భయపడకుండా బరిలోనిలిచారని టీడీపీ నేత, టీటీడీ మాజీ ఛైర్మన్ పుట్టాసుధాకర్ యాదవ్ తెలిపా రు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. మైదుకూరు మున్సిపాలి టీ మేయర్ అభ్యర్థిఅయిన ధనపాల్ జగన్, సమయం ముగి సినా కూడా నామినేషన్లు ఉపసంహరణ ఎలా చేస్తారని ప్రశ్నించాడని, ఆయనపై తప్పుడు కేసులు పెట్టారని సుధాకర్ యాదవ్ తెలిపారు. ఈనెల 3వతేదీన నామినేషన్ల ఉపసంహరణ జరిగితే, 4వతేదీన ఆయనపై తప్పుడుకేసు పెట్టి, 5వ తేదీన ఆయన్ని అరెస్ట్ చేయడానికి, 100మంది పోలీసులు ఆయనింటికి వెళ్లారన్నారు. మేయర్ అభ్యర్థిని అరెస్ట్ చేయడమేంటని తాము ప్రశ్నించామని, అతన్ని తామే పోలీస్ స్టేషన్ కు తీసుకొస్తామని చెప్పినా వినకుండా ధనఫాల్ జగన్ ను పోలీసులు బలవంతంగా స్టేషన్ కు తీసుకెళ్లారన్నారు. టీడీపీ శ్రేణులంతా స్టేషన్ కువెళితే, అక్కడ మేయర్ అభ్యర్థి లేడని, దానిపై తాము పోలీసులను ప్రశ్నిస్తే, తమపై కూడా తప్పుడు కేసులు పెట్టారని సుధాకర్ యాదవ్ తెలిపారు. వార్డుకు ఇద్దరు చొప్పున టీడీపీకి చెందిన 24మంది నేతలపై తప్పుడు కేసులుపెట్టి, టీడీపీ వారిని పోలీసులు భయభ్రాంతులకు గురిచే శారన్నారు. టీడీపీ మేయర్ అభ్యర్థిని 5వతేదీ అర్థరాత్రి న్యాయమూర్తి ఎదుట హాజరుపరచగా, తప్పుడుకేసు అని నిర్ధారించిన మేజిస్ట్రేట్ బెయిల్ మంజూరు చేశారన్నారు.
పోలీసులు పెట్టిన తప్పుడుకేసులు వీగిపోవడంతో, తిరిగి 9వ తేదీన టీడీపీనేతలను మరలా స్టేషన్ కు తరలించారన్నారు. ఆనాటినుంచి పోలీస్ యంత్రాంగం టీడీపీశ్రేణులపై కక్షసాధిం పులకు పాల్పడుతూనే ఉందన్నారు. పోలీస్, ప్రభుత్వలను తట్టుకొని టీడీపీ 12వార్డుల్లో విజయం సాధిం చిందన్నారు. ప్రభుత్వఆదేశాలతో పోలీసులు, అధికారయం త్రాంగంఎన్ని కుట్రలు పన్నినా టీడీపీ విజయంసాధించింద న్నారు. ఇంతజరిగాక జిల్లాలోని పోలీస్ యంత్రాంగం వైసీపీ అభ్యర్థినే మేయర్ పదవిలో కూర్చోబెట్టాలని చూస్తోందన్నా రు. పోలీసులతో పాటు, జగన్ సొంతమనుషులు కొందరు టీడీపీ అభ్యర్థిని కి-డ్నా-ప్ చేశారన్నారు. టీడీపీ వార్డు మెంబర్ ని పోలీసులే స్వయంగా వైసీపీ శిబిరానికి తీసుకెళ్లారన్నారు. పోలీసుల తీరుని ప్రశ్నించామన్న అక్కసుతో తనపై, ధన్ పాల్ జగన్ పై తప్పుడుకేసు పెట్టారని సుధాకర్ యాదవ్ చెప్పారు. నాపై, మైదుకూరు టీడీపీనేతలపై తప్పడు కేసులు పెట్టిన పోలీసులను వదిలేదిలేదన్నారు. ఛైర్మన్ ఎన్నిక జరిగే 18వతేదీన టీడీపీ వార్డుసభ్యులెవరూ, కౌన్సిల్ సమావేశానికి రాకుండా, పోలీసులుఇప్పటినుంచే కుట్రలు పన్నుతున్నా రని టీడీపీనేత మండిపడ్డారు. 11మంది టీడీపీఅభ్యర్థులు ఎలాగైనా సమావేశానికి హాజరై తీరుతారన్నారు.