ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పలుకేసుల్లో ఏ1 అయితే, విజయసాయిరెడ్డి ఏ2గాఉన్నాడని, కొద్దిరోజులనుంచీ వారుఎందుకో తీవ్రఆందోళనతో, కంగారు పడుతున్నారని, వారిరువురికీ బెయిల్ రద్దయ్యే కాలం సమీపించినందునే వారు ఆందోళనచెందుతున్నారని టీడీపీ జాతీయప్రధానకార్యదర్శి మరియు పొలిట్ బ్యూరోసభ్యులు వర్లరామయ్య తెలిపారు. మంగళవారం ఆయన మంగళగిరి లోని పార్టీజాతీయకార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఆవివరాలు ఆయన మాటల్లోనే "సీబీఐ 11కేసు లు, ఈడీ 5కేసులు ఆయనపై మోపింది. వేలకోట్లు అన్యాక్రాం తంచేశారనే అభియోగాలు ఎదుర్కొంటున్నారు. అన్ని కేసు లను ఎదుర్కొంటున్న వ్యక్తి, వాటన్నింటినీ తనహోదా, పలుకుబడిని అడ్డంపెట్టుకొని దాటవేస్తూవస్తున్నాడు. 2012లో ఆయనపై కేసులుమోపబడితే,ఇంతకాలం నుంచీ విచారణజరగకుండా, తనశక్తియుక్తులు, తెలివితేటలు, తన అవీనితిసొమ్ముతో వాటిని అడ్టుకుంటున్నాడు. రాష్ట్రప్రజలు అప్పగించినఅధికారంకూడా ఆయనకు కలిసొచ్చింది. తనపై ఉన్నకేసులన్నీ విచారణజరగకుండా అడ్డుకుంటున్నాడు. దేశవ్యాప్తంగా ఉన్న అవినీతికేసులన్నింటికీ, జగన్ పై ఉన్న కేసులు మోడల్ గా నిలిచాయన్నారు. జగన్మోహన్ రెడ్డిపై ఉన్న కేసులుఅలానేఉంటే, తమకేసులు ఎలా విచారిస్తారని అనేకమంది అవినీతిపరులు అంటున్నారు. అవినీతిపరులపై ఉన్నకేసులవిచారణ ఏడాదిలోనే పూర్తిచేస్తామని ప్రధాని మోదీచెప్పారు. కానీ అదిఎందుకో, రాజకీయకారణాలవల్ల ఆగిపోయింది. సుప్రీంకోర్టు అవినీతిపరులపైఉన్నకేసులవిచా రణను వేగవంతంచేయడంతో, తనబెయిల్ రద్దవుతుందనే భయాందోళన ముఖ్యమంత్రికి పట్టుకుంది. సీబీఐ విభాగం ముఖ్యమంత్రి వెన్నులో వణుకుపుట్టించే పనిలో నిమగ్నమైం ది. సీబీఐ అధికారులు ఇప్పుడు పులివెందులలో విచారణ జరుపుతున్నారు. అసలు ముద్దాయిలను పట్టుకునే స్థాయి కి సదరు అధికారులుచేరారు. వి-వే-కా కేసు విచారణలో భాగంగా, ఏక్షణమైనా సీబీఐ అధికారులు జగన్ఇంటి తలుపు తట్టే అవ కాశముంది. వీటన్నింటినీచూశాక జగన్ వెన్నులో వణుకు మొదలైంది."

"తనవ్యవహారాలు, తనపై ఉన్నకేసుల నుంచి ప్రజలదృష్టిమళ్లించడానికే జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబుకు నోటీసులంటూ చిన్నపాచికవేశాడు. ఆయనకునోటీసులిస్తే ఏమవుతుంది? దళితుల అసైన్డ్ భూముల్లో ఏంఅవకతవక లు జరిగాయి? జగన్ సంగతేంటి? ఆయన తండ్రి, తాతల సంగతేంటి? 690ఎకరాల దళితుల అసైన్డ్ భూములను ఇడుపులపాయలో స్వాధీనంచేసుకొని, భుజించింది ఈ ముఖ్యమంత్రి, ఆయనకుటుంబం కాదా? 3దశాబ్దాలుగా వాటిని సాగుపేరుతో భుజిస్తూ, బొక్కుతోంది మీరు కాదా? ఈ విషయం మేముచెప్పడంలేదు. జగన్ తండ్రి రాజశేఖర్ రెడ్డే స్వయంగా అసెంబ్లీలోనే చెప్పారు. తనతండ్రికి (రాజారెడ్డికి) ఆట్టే చదువు సంధ్యలు లేక, 30ఏళ్లనుంచి దళి తులభూములను గుంజుకొని, వాటిని స్వాధీనం చేసుకున్నా మని చెప్పారు. ఆ విషయం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి తెలియదా? ఎస్సీఎస్టీ, కేసులుపెట్టాల్సింది జగన్మోహన్ రెడ్డి పై, ఆయన తాత, తండ్రులపై. 30ఏళ్లనుంచి దళితులనోళ్లు కొట్టి, వారిభూములను అనుభవించినందుకు ఆయనకుటుం బంపై ఎస్సీఎస్టీ కేసులుపెట్టాలి. అంతేగానీ న్యాయబద్ధంగా చట్టబద్ధంగా వ్యవహరించిన చంద్రబాబుపై ఎలా కేసులుపెడ తారు? ఇప్పటికీ కొన్ని ఎకరాల అసైన్డ్ భూమి జగన్మోహన్ రెడ్డి, ఆయన కుటుంబఅధీనంలోనే ఉన్నాయి. ఉన్నాయో లేదో తేల్చే ధైర్యం జగన్ కు ఉందా? భూములవిచారణపై కడపజిల్లా కలెక్టర్ తో, ఒక బృందాన్ని ఏర్పాటుచేయండి, తాము ఒకబృందంగా ఇడుపులపాయకు వస్తాము. అక్కడ విచారణ జరిపితే దళితుల భూములుఎవరి స్వాధీనంలో ఉన్నాయో తేలుతుంది. రాష్ట్రంలోని అసైన్డ్ భూములను తిని దళితులకు తీరని అన్యాయంచేసింది జగన్, ఆయన కుటుంబం.

మూడుదశాబ్దాలనుంచి ఇడుపులపాయలో దళి తులుభూములు తింటున్నది జగన్, ఆయన కుటుంబమే. అటువంటి వ్యక్తి నంగనాచిలా, చంద్రబాబునాయుడిని తప్పు పడతారా? చట్టబద్ధంగా, న్యాయంగా దళితులభూములను వారి అంగీకారంతో తీసుకొని, వారికి ఈవిధంగా న్యాయంచేస్తా మని ఒప్పందం చేసుకుంటే, ఇన్నేళ్లతర్వాత అక్కడేదో జరి గిందని నోటీసులిస్తారా? నోటీసులిస్తే ఏమవుతుంది? జగన్ ఉద్దేశం గురించి ప్రజలు తెలుసుకోలేరా? ఆయన దొంగ, కాబట్టి చంద్రబాబునికూడా దొంగగా నిరూపించాలని చూస్తు న్నాడు. జగన్ జైలుకువెళ్లాడు కాబట్టి, చంద్రబాబుని కూడా జైలుకు పంపాలని చూస్తున్నాడు. అవినీతి సముద్రంలో పీకల్లోతు కూరుకుపోయిన ఏకైక ముఖ్యమంత్రి, దేశ యవని కపై జగన్మోహన్ రెడ్డి ఒక్కడే. 29రాష్ట్రాల్లో, కేంద్రపాలితప్రాంతా ల్లో అవినీతిలో జగన్ ను మించిన ఘనాపాఠి మరొకరు లేరు. జగన్ తనకంటిలో ఉన్న దూలాన్ని విస్మరించి, ఎదుటివారి కంట్లోలేని నలుసంత అవినీతిని దుర్భిణీవేసి వెతకడానికి ప్రయత్నిస్తున్నాడు. తాను జైలుకువెళ్లడం ఖాయ మని జగన్ కు అర్థమైంది కాబట్టే, ప్రజలను దారిమళ్లించడా నికే చంద్రబాబుకు నోటీసులిచ్చారా? రైల్వేస్టేషన్లలో దృష్టి మరిల్చే దొంగలని ఉండేవారు. వారిలానే జగన్ కూడా ప్రజల దృష్టిని తనఅవినీతిబాగోతంనుంచి మళ్లించడానికి చంద్రబా బుకి నోటీసులిచ్చాడు. జగన్ కు అత్తారింటికి (జైలుకు) వెళ్లే సమయం ఆసన్నమైంది కాబట్టే చంద్రబాబుకి తన ప్రభుత్వంలోని అధి కారులతో నోటీసులిప్పించాడు.

కాకినాడ ఎస్ఈజెడ్ లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా దళితులునేడు కోర్టుకు ఎందుకువెళ్లారో, అమరావతిలో దళితులకు అన్యా యం జరిగిందని చంద్రబాబుకు నోటీసులచ్చిన జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలి. జగన్, ఆయన అనుమాయులు, ఆయన ప్రభుత్వ వేధింపులు పడలేకనే కాకినాడ ఎస్ఈజడ్ లోదళితులు కోర్టుకెళ్లారు. ఎస్ఈజడ్ లోని దళితుల భూములను జగన్ లాక్కుంటున్నారన్నది నిజంకాదా? ఆ ఎస్ఈజడ్ కు, తనకు ఏంసంబంధంలేదని జగన్ చెప్పగలడా ? ఏ2సారథ్యంలో ఎస్ఈజడ్ లోని భూములు కొట్టేయడానికి జగన్ పథకరచన చేయలేదా? కాకినాడలోని దళితుల భూములను ఏ2నేత్రత్వంలోకొట్టేయడానికి జగన్ ప్లాన్ చేయలేదా? ఏ2 విజయసాయిరెడ్డి అసలు మనిషేనా? పూర్తిగా అవినీతిలోకూరుకుపోయిన ఒక అవినీతి విగ్రహం. ఏదోరోజును ముట్టుకుంటే కూలిపోతుంది ఆ విగ్రహం. ఆ విగ్ర హాన్ని చట్టం ముట్టుకున్నరోజున దానంతటదే కూలిపోతుంది. చంద్రబాబునాయుడికి ఎస్సీ, ఎస్టీ కేసు ఎలా వర్తిస్తుంది? 30ఏళ్లపాటు జగన్, ఆయన కుటుంబం దళితు లభూములను తిన్నది చూడండి.. అదిఎస్సీ, ఎస్టీ కేసు. ఆనేరంలో జగన్ ను, ఆయనకుటుంబాన్ని కుమ్మేయాలి. వారికే వర్తిస్తుంది ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీకేసు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read