ఆంధ్రప్రదేశ్ సిఐడి పోలీసులు ఆంధ్రప్రదేశ్ లో జుబ్లీ హిల్స్ లో ఉన్న చంద్రబాబు నివాసం వద్దకు చేరుకున్నారు. అయితే అమరావతి రాజధాని భూములు అమ్మకాలు, కొనుగోళ్లకు సంబంధించి, తాజాగా మరో కేసు నమోదు కావటం, అందులో చంద్రబాబుని కూడా దోషిగా పెట్టారు. ఈ కేసుకు సంబంధించి, ముఖ్యంగా రాజధానిలో అసైన్డ్ భూములుకు సంబంధించి, చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో, ముందుగానే రాజధాని ఇక్కడ వస్తుందని చెప్పి, తన అనుచరులు ద్వారా, ఇక్కడ భూములు కొనిపించి, ఆ తరువాత ఇక్కడ రాజధాని ప్రకటించటం వల్ల, తన అనుచరులకు లబ్ది చేకూర్చారు అని ఆ కేసు నమోదు చేసారు. దీనికి సంబంధించి, కొంత మంది ఫిర్యాదు చేయటంతో, ఈ కేసు నమోదు అయ్యిందని చెప్తున్నారు. అయితే దీన్ని ఇంకా అధికార వర్గాలు దృవీకరించలేదు. మొత్తం ఎనిమిది మంది పై ఈ కేసు నమోదు అయ్యిందని చెప్తున్నారు. ఈ కేసులో చంద్రబాబు పేరు కూడా ఉండటంతో, చంద్రబాబుకి నోటీసులు ఇచ్చేందుకు, ఏపి సిఐడి అధికారులు ఆయన ఇంటికి వెళ్ళారని తెలుస్తుంది. ఈ కేసులో విచారణకు హాజరు కావల్సిందిగా, నోటీసులు ఇచ్చేందుకు అక్కడకు వెళ్ళారని సమాచారం అందుతుంది. అయితే చంద్రబాబుకి నోటీసులు ఇచ్చారా, ఆయన తీసుకున్నారా అనే విషయం పై ఇంకా క్లారిటీ లేదు. చంద్రబాబు ప్రస్తుతం, హైదరాబాద్ లో ఉన్నారు.
ఆయన్ను కలుసుకోవాలి అంటే, ముందు అపాయింట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. లేన పక్షంలో, సెక్యూరిటీ సిబ్బందికి చెప్పి, టైం తీసుకుని, నోటీసులు ఇచ్చే అవకాసం ఉంది. ఇప్పటి వరకు అయితే, సిఐడి అధికారులు చంద్రబాబు నివాసం బయట మాత్రమే ఉన్నారని, మీడియాలో వార్తలు వస్తున్నాయి. రాజధాని భూముల్లో గతంలో కూడా కొన్ని కేసులు నమోదు అయ్యాయి. ఈ కేసులకు సంబంధించి ముఖ్యంగా , హైకోర్టులో కొన్ని తీర్పులు కూడా వచ్చాయి. ల్యాండ్ పోలింగ్ ప్రక్రియకు ముందు, అప్పటి ప్రభుత్వంలో ఉన్న పెద్దలు రాజధాని అమరావతిలో వస్తుందని లీక్ చేసి, తన అనుచరులతో భూములు కొనిపించారని, ఇది ఇన్సైడర్ ట్రేడింగ్ అంటూ, హైకోర్టులో కేసులు వేసారు. అయితే హైకోర్టు ఈ కేసులు కొట్టేసింది. ఇన్సైడర్ ట్రేడింగ్ అనే పదం లేదని హైకోర్టు స్పష్టం చేసింది. అయితే ఇప్పుడు మరో కేసు పెట్టి, చంద్రబాబుని ఇబ్బంది పెట్టె ఉద్దేశంతోనే ఇలా చేస్తున్నారని టిడిపి అంటుంది. దీని పై న్యాయ స్థానాల్లో తేల్చుకుంటాం అని అంటున్నరు.