ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీవెంకటేశ్వరరావుపై ఈ నెల 18న సచివాలయంలో శాఖాపరమైన విచారణ జరగనున్నది. కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీస్ నేతృత్వంలో అభియోగాలపై విచారణ జరపనున్నారు. సాక్షులుగా మాజీ డీజీలు రాముడు, సాంబశివరావు, మాల కొండయ్య, ఆర్పీ ఠాకూరులు ఉన్నారు. సాక్షులుగా విచా రణకు హాజరు కావాలని మాజీ డీజీలకు కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీస్ మెమోలు పంపింది. ఏబీవెంకటేశ్వరరావుపై శాఖాపరమైన విచారణను ఏప్రిల్ నెలాఖరులోగా పూర్తి చేయాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. రోజువారీ విచారణను చేపట్టాలని విచారణాధి కారికి సుప్రీం ఆదేశాలు ఇచ్చింది. విచారణ నివేదికను మే 3 తేదీ నాటికి కోర్టుకు సమర్పించాలని స్పష్టం చేసింది. రోజు వారీ విచారణ చేసి, కేసుని త్వరగా ముగించాలని కోర్టు ఆదేశించింది. దీంతో సుప్రీం కోర్టు ఆదేశాలు ఇవ్వటంతో, ఈ కేసు విచారణ చేయకుండా ఇంకా ఇంకా పొడిగించాలని ప్రభుత్వం వేసిన పాచిక అపరలేదు. దీంతో విచారన షురు అయ్యింది. కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీస్ చేపట్టే విచారణను ఎలక్ట్రానిక్ మీడియా సమక్షంలో చేపట్టాలని ఏబీ వెంకటేశ్వరరావు అభ్యర్థించారు. క్వాసీ జ్యూడీషియల్ సంస్థగా కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీస్ విచారణ గోప్యంగానే జరుగుతుందని తెలిపింది. ఆర్పీ సిసోడియా నేతృత్వంలో ఈ విచారణ జరగనుంది.
ఇక కేసు విషయానికి వస్తే, తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా, ఏబీవెంకటేశ్వరరావు, ఇంటెలిజెన్స్ చీఫ్ గా పని చేసారు. అయితే అప్పటి నుంచి ఆయన్ను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టార్గెట్ చేస్తూ వచ్చింది. అధికారంలోకి రాగానే, ఆయనకు పోస్టింగ్ ఇవ్వకుండా పక్కన పెట్టింది. తరువాత ఆయన నిఘా పరికరాల కొనుగోలు వ్యవహారంలో కుంభకోణం చేసారు అంటూ, ఆయన్ను సస్పెండ్ చేసారు. అయితే చార్జెస్ పెట్టటానికి ఏడాది కాలం పెట్టింది. చివరకు ఆయన వల్ల, రాష్ట్ర ఖజానాకు పది లక్షల నష్టం వచ్చింది అంటూ కేసుని తేల్చారు. వందల కోట్లు కుంభకోణం అని మీడియాలో ఊదరగొట్టి, చివరకు ఆయన ఏమి డబ్బులు తీసుకోలేదు కానీ, ఆయన తీసుకున్న నిర్ణయం వల్ల, రాష్ట్ర ఖజానాకు పది లక్షల నష్టం అని తేల్చారు. అయితే ఆయన సస్పెన్షన్ మరో ఏడాది పాటు పొడిగిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. విచారణ చేయకుండా, ఏమి చేయకుండా, కేవలం ఆరోపణలు చేసి, ఇప్పటి వరకు సస్పెండ్ చేసారని, ఇప్పుడు మరో ఏడాది సస్పెండ్ అంటున్నారని సుప్రీం కోర్టుకు వెళ్ళటంతో, కోర్టు వెంటనే విచారణ చేసి, తేల్చమని ఆదేశాలు ఇచ్చింది.