రాష్ర్ట ప్రజల ప్రతినిధిగా ఉన్న ముఖ్యమంత్రి జగన్ రాష్ర్ట్ర ప్రయోజనాలు కాపాడకపోగా తన కేసుల మాపీ కోసం రాష్ర్ట ఆర్దికమూలాలు దెబ్బతీస్తున్నారని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి నాదెండ్ల బ్రహ్మం చౌదరి అన్నారు. బుధవారం టీడీపీ జాతీయ కార్యాలయంలో నిర్వహించిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... జగన్ లోపాయికారీ ఒప్పందాలతో రాష్ట్ర ఆర్దిక మూలాలు దెబ్బతీస్తున్నారు. నాడు చంద్రబాబు నాయుడు దేశ, విదేశాలు తెచ్చి రాష్ట్రానికి అనేక పరిశ్రమలు తీసుకువస్తే, నేడు జగన్ ఒక్క కొత్త పరిశ్రమ తేకపోగా ఉన్నవాటిని అమ్మేస్తున్నారు. నాడు 32 మంది బలిదానాలతో ఏర్పాటైన విశాఖను తన స్వార్దప్రయోజనాల కోసం జగన్ తాకట్టు పెట్టడటం సిగ్గుచేటు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు సంబంధించిన ప్రతి అంశాన్నీ రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పే చేస్తున్నామని కేంద్ర మంత్రులు పార్లమెంట్లో స్పష్టంగా చెప్పారు కానీ జగన్ రెడ్డి అండ్ కో.. మాత్రం మాకేమీ తెలియదంటూ మాట్లాడటం సిగ్గుచేటు. జనవరి 27 నే స్టీల్ ప్లాంట్ పై నిర్ణయం తీసుకున్నామని ఆ విషయం రాష్ట్ర ప్రభుత్వానికి తెలుసని కేంద్రం చెప్పింది, కానీ ఆ తర్వాత జరిగిన నీతి ఆయోగ్ సమావేశంలో స్టీల్ ప్లాంట్ ప్రవేటీకరణను ఆపాలంటూ ముఖ్యమంత్రి ప్రధానమంత్రిని ఎందుకు అడగలేదు? లేఖలు వల్ల ప్రయోజనం ఏంటి? ప్రధానితో నేరుగా ఫోన్ లో ఎందుకు మాట్లాడటం లేదు? విశాఖలో ఉవ్వెత్తున్న ఉద్యమం రుగులుతుంటే ముఖ్యమంత్రి, వైసీపీ నేతలు ఉద్యమానికి ఎందుకు మద్దతు తెలపటం లేదు? 25 మంది ఎంపీలు ఇస్తే హోదా తెస్తామన్న జగన్ నేడు విశాక ప్రజల ఆత్మగౌరవ ప్రతీకైన విశాఖ ఉక్కును కేంద్రం అమ్ముతుంటే జగన్ నోరు ఎందుకు మెదపటం లేదు? పోస్కో కంపెనీని అడ్డుపెట్టుకుని , జగన్, విజయసాయిరెడ్డి స్టీల్ ప్లాంట్ ని కొట్టేసే ప్రయత్నం చేస్తున్నారని ప్రజలకు తెలిసిపోయింది, ఇది వాస్తవం కాకపోతే కేంద్రాన్ని ఎందుకు ప్రశ్నించటం లేదు?
28 మంది ఎంపీలు, 151 మంది ఎమ్మెల్యేలు ఉండి కూడా స్టీల్ ప్లాంట్ ప్రవేట్ పరం కాకుండా అడ్డుకోలేరా? వైసీపీ ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు ఎందుకు రాజీనామాకు ముందుకు రాటం లేదు? రాజీనామాల ద్వారా ఏం సాధించలేమని మంత్రి పెద్దిరెడ్డి చెప్పటం సిగ్గుచేటు. మీరు రాజీనామా చేస్తే ఉక్కు పరిశ్రమను కాపాడుకోవచ్చు, అన్ని రాజకీయపార్టీలు, కార్మికులు, ఉద్యోగులు ప్రభుత్వానికి మద్దతు తెలిపేందుకు సిద్దంగా ఉన్నారు. రాష్ర్టంలో ఉన్న యువత, విధ్యార్దులు అందరూ కూడా ఏకమై విశాఖ ఉక్కును కాపాడుకోవాలి. నాడు స్టీల్ ప్లాంట్ ఏర్పాటులో యువత, విధ్యార్ది ఉద్యమంలో కీలకపాత్రం పోషించారు, ఆ వారసత్వం నేడు కొనసాగించాల్సిన అవసరం ఉంది, విశాఖ ఉక్కును కాపాడుకోవాలన్న, రాష్టంలో జరుగుతున్న అరచాకాలకు అడ్డకోవాలన్నా, వైసీపీ దొంగనాటకాలకు పుల్ స్టాప్ పడాలన్నా విశాఖ కార్పోరేషన్ ఎన్నికల్లో వైసీపీని ఓడించాలి. యువత, విద్యార్ధులు వైసీపీ పాలనలో వైపల్యాల్ని, , పెరిగిన నిత్యవసరాలు, వైసీపీ అరచాకాలను ప్రజలకు వివరించి చైతన్యం చేసి టీడీపీకి ఓటు వేయించాలి, విశాఖలో రూ.70వేల కోట్లతో పెట్టుబడి పెట్టేందుకు వచ్చిన అదానీ డేటా సెంటర్, లులూ కన్వెన్షన్ సెంటర్ ఇతర రాష్ట్రాలకు తరలిపోవడానికి జగన్ రెడ్డి దుర్మార్గమైన జేట్యాక్స్ బెదిరింపులే కారణం. విశాఖ ఉక్కును అమ్మడానికి. వాళ్లెవరు, అమ్మేయమని చెప్పడానికి వీళ్లెవరు.? విజయసాయిరెడ్డికి డిల్లీలో పాదయాత్ర చసే దమ్ముందా, ఉద్యమంలో పెద్దన్న పాత్రపోషించాల్సిన ప్రభుత్వం స్వార్ద ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెట్టాలని చూస్తే రాష్ర్ట్ర యువత చూస్తూ ఊరుకోరు. జగన్ ఇప్పటికైనా తాడేపల్లి ప్యాలె స్ నుంచి బయటకి వచ్చి అఖిలపక్షాన్ని డిల్లీ తీసుకెళ్లి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రవేటీకరణను అడ్డుకోవాలని బ్రహ్మం చౌదరి డిమాండ్ చేశారు.