విశాఖ స్టీల్‍ప్లాంట్ వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. నిన్న కేంద్రం ప్రకటనతో, కార్మికుల నిరసన తెలిపారు. ప్లాంట్ ఫైనాన్స్ డైరెక్టర్ వేణుగోపాల్‍ను కార్మికులు దిగ్బంధించారు. వేణుగోపాల్ కారుకు అడ్డంగా కూర్చుని కార్మికుల నిరసన తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పై నినాదాలు చేసారు. చేతాకాని సియం అంటూ, జగన్ మోహన్ రెడ్డి పై నినాదాలు చేసారు. జగన్ మోహన్ రెడ్డి ఫోటోలు, విజయసాయి రెడ్డి ఫోటోలు తగలబెడుతూ, నిరసన తెలుపుతున్నారు. ఇంత మంది ఎంపీలు ఉండి అధికార పార్టీ నేతలు ఏమి చేస్తున్నారు అంటూ, ఆందోళన వ్యక్తం చేసారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్ష్యులు, కింజారపు అచ్చెన్నాయుడు జగన్ మోహన్ రెడ్డి పై ధ్వజమెత్తారు. "ముఖ్యమంత్రి జగన్ తన కేసుల మాఫీ కోసం, స్వార్ధ ప్రయోజనాల కోసం రాష్ర్టానికి చేస్తున్న అన్యాయం నేడు పార్లమొంట్ సాక్షిగా బట్టబయలైంది. వైసీపీ ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపాకే స్టీల్ ప్లాంట్ పై నిర్ణయం తీసుకున్నామని కేంద్ర మంత్రే స్వయంగా చెప్పారు? ఇన్నాళ్లు డ్రామాలాడిన వైసీపీ నేతలు ఇప్పుడు రాష్ర్ట ప్రజలకు ఏం సమాధానం చెబుతారు? విశాఖ ఉక్కుపై కేంద్రమంత్రి మాట్లాడేటపుడు కనీసం ఒక్క ఎంపీ అయినా ఎందుకు అడ్డుకోలేదు? విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం కేంద్రంపై పోరాడుతాం, కేంద్రాన్ని నిలదీస్తామంటూ గల్లీలో ప్రగల్భాలు పలికిన వైసీపీ ఎంపీలు నేడు పార్లమెంట్ లో ఎందుకు మౌనంగా ఉన్నారు?"

vizag 09032021 2

"మీ మౌనం రహస్య ఒప్పందానికి నిదర్శనం కాదా? 32 మంది బలిదానాలతో వేలాది మంది రైతుల త్యాగాలతో సాధించుకున్న విశాఖ స్టీల్ ప్లాంట్ ని ప్రవేట్ పరం చేసి... కార్మికుల జీవితాలను రోడ్డున పడేసి, విశాఖ జిల్లా ప్రజల భవిష్యత్ పై దెబ్బగొడుతున్నారు. అమరుల త్యాగాలంటే వైసీపీకి లెక్కలేదా? గల్లీల్లో విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం పాదయాత్రలు చేసిన వైసీపీ ఎంపీలు ఇప్పుడెందుకు కేంద్రం ముందు సాగిలపడ్డారో ప్రజలకు చెప్పాలి. రాష్ర్ట ప్రయోజనాలు కాపాడలేని మీకు మంత్రి పదవులు ఎందుకు? సిగ్గుంటే వెంటనే మీ పదవులకు రాజీనామా చేయాలి. మీ చేతకానితనంతో తెలుగువారి ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టడానికి సిగ్గనిపించటం లేదా? విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మేయాలని ప్రతిపక్షనేతగా పాదయాత్ర చేసినపుడే జగన్ పిక్సయ్యారు, అధికారంలోకి వచ్చాక అర్ధరాత్రుళ్లు పోస్కో కంపెనీ ప్రతినిధులతో సమావేశాలు జరిపి వాటాలు పంచుకున్నారు. ఇప్పుడేమీ తెలియనట్లు జగన్ డ్రామాలాడుతున్నారు, 25 మంది ఎంపీలిస్తే ప్రత్యేకహోదా తెస్తానన్న జగన్ ప్రత్యేకహోదా తేకపోగా తన చేతకానితనంతో ఉన్న పరిశ్రమలు, కంపెనీలు అమ్మేస్తున్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read