తిరుమలశ్రీవారిని దర్శించుకున్న సుబ్రహ్మణ్యస్వామి సంచలనవ్యాఖ్యలు చేశారని,ప్రత్యేకవిమానంలో సుబ్రహ్మణ్య స్వామిని తిరుపతికితీసుకొచ్చి, ఆయనతో చెప్పించాల్సింది చెప్పించి, చంద్రబాబునాయుడిపై కేసులు వేయించాలని చూడటం, ఎందరో అవినీతిపరులకు శిక్షలుపడేలాచేసిన సుబ్రహ్మణ్యస్వామి, ఎవరోచెప్పింది విని లైన్ తప్పి మాట్లా డటం విడ్డూరంగా ఉందని టీడీపీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న తెలిపారు. గురువారం ఆయన మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడా రు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.. "తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకొని విచ్చలవిడిగా అవినీతికి పాల్పడిన అవినీతి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఆయన 16నెలలు జైల్లోఉండివచ్చారు. ముఖ్యమంత్రి అయ్యాక ఆయన అవినీతికి పరాకాష్టగా మారిపోయారు. ప్రత్యేక విమా నంలో తిరుమలకు వచ్చిన సుబ్రహ్మణ్యస్వామి, జగన్ తో కలిసి వేడివేడి భోజనంచేసి, రహస్యమంతనాలు జరిపి, తిరిగి ఢిల్లీవెళ్లిపోయారు. సుబ్రహ్మణ్యస్వామి అవినీతి గురించి మాట్లాడేముందు, ఆయన ప్రత్యేకవిమానం ఖర్చులు ఎవరు భరించారో ఆయనే చెప్పాలి. ఎవరితో కలిసి ఆయన వేడివేడి భోజనం చేశారో, ఆయన పెట్టారా? లేక సుబ్రహ్మణ్యస్వామే పెట్టుకున్నారా? ఇదివరకు సుబ్రహ్మణ్యస్వామి పై ప్రజలకు గౌరవముండేది. అవినీతిచక్రవర్తితో కలిసి ఆయన ఎప్పుడైతే భోజనాలుచేశారో, అప్పుడే ఆయనపైఉన్న గౌరవం పోయిం ది. దేవాదాయఆస్తులను ఎందుకు అమ్ముతున్నారని సుబ్రహ్మణ్యస్వామి జగన్ ను అడిగారా? పింక్ డైమండ్ ఏమైందని, రాష్ట్రంలో 165కుపైగా దేవాలయాలపై దాడులు ఎందుకు జరిగాయని సుబ్రహ్మణ్యస్వామి, జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించాడా?
సుబ్రహ్మణ్యస్వామి ఏదో రాజకీయప్రయోజనం ఆశించే జగన్ తోసమావేశమైనట్టు, జగన్ ఆయన్ని ప్రలోభపె ట్టినట్టు అనిపిస్తోంది. ఎందరో అవినీతిముఖ్యమంత్రులను గతంలో జైలుకు పంపిన సుబ్రహ్మణ్యస్వామి, నేడు ఈ విధం గా ప్రవర్తించడం సిగ్గుచేటు. జగన్మోహన్ రెడ్డిపై పోరాడుతోంది తెలుగుదేశంపార్టీ, ఆపార్టీ నేతలు మాత్రమేననే వాస్తవాన్ని సుబ్రహ్మణ్యస్వామి తెలుసుకోవాలి. రాష్ట్రంలోని ప్రసారమాధ్య మాలు, పత్రికలతోపాటు, జాతీయపత్రికలను చూస్తే, ఆయనకు వాస్తవాలు బోధపడతాయి. టీడీపీ మాట్లాడటం లేదని సుబ్రహ్మణ్యస్వామి చెప్పడం విడ్డూరానికే విడ్డూరం. ఆయన వ్యాఖ్యలుచూస్తుంటే, జగన్ తో లాలూచీ పడినట్టుగా ఉంది. సుబ్రహ్మణ్యస్వామి తనపార్టీతో సంబంధంలేకుండా ప్రత్యేకవిమానంలోవచ్చిమరీ, జగన్మోహన్ రెడ్డితో సమావేశ మవ్వాల్సిన సందర్భం ఏమొచ్చింది? రాష్ట్రానికి హడావుడి గా వచ్చి, ఏదేదోచెప్పాల్సిన అవసరం ఆయనకు ఏమొచ్చిం ది? చంద్రబాబునాయుడిపై గతంలో రాజశేఖర్ రెడ్డి అనేక ఆరోపణలుచేసి, లెక్కకు మిక్కిలి కేసులువేసి, భంగపడ్డాడనే వాస్తవాన్ని, ఇప్పుడు కేసులువేస్తానంటున్న సుబ్రహ్మణ్య స్వామి గ్రహించాలి. సుబ్రహ్మణ్యస్వామికి చేతనైతే, అవినీతి ని, అవినీతికిపాల్పడిన జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించాలి. చంద్రబాబునాయుడిని, ప్రజలపక్షాన పోరాడుతున్న ఆయ న తీరుని ప్రశ్నించడం మానేస్తే మంచిది. సుబ్రహ్మణ్యస్వామి తనవయసుని, అనుభవాన్ని గుర్తుంచుకొని తనకున్న గౌరవాన్ని కాపాడుకుంటే మంచిదని సూచిస్తున్నాను.