జెడ్పీటీసి, ఎంపీటీసి ఎన్నికలకు సంబంధించి, నిన్న సింగల్ బెంచ్ ఇచ్చిన తీర్పుని నిలిపివేస్తూ ఈ రోజు హైకోర్టు డివిజనల్ బెంచ్ కీలక ఆదేశాలు ఇచ్చింది. దీంతో రేపు జరిగే జెడ్పీటీసి, ఎంపీటీసి ఎన్నికలు యధావిధగా జరగనున్నాయి. అయితే ఇక్కడ హైకోర్టు మరో ట్విస్ట్ ఇచ్చింది. ఎన్నికల కౌంటింగ్ మాత్రం, తదుపరి ఉత్తర్వులు వచ్చేంత వరకు నిలిపివేయాలని ఆదేశించింది. ఈ రోజు ఉదయం నుంచి అటు ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల కమిషన్, అలాగే పిటీషన్ వేసిన వర్ల రామయ్య, పూర్తి స్థాయిలో వాదనలు వినిపించారు. ముఖ్యంగా సుప్రీం కోర్టు చెప్పిన , నాలుగు వారల ఎన్నికల కోడ్ విషయంలో, రెండు వైపుల వాదనలు వినిపించారు. అయితే ప్రభుత్వం, ఈ వాదనను తోసిపుచ్చుతూ, సుప్రీం కోర్టు, కొన్ని ప్రత్యెక పరిస్థితితుల్లో ఆ ఆదేశాలు ఇచ్చిందని, ఇందులో అంతకు మించి ఏమి లేదని అన్నారు. అలాగే వర్ల రామయ్య పిల్ వేయకుండా, రిట్ పిటీషన్ వేసారని వాదించారు. దీనికి విచారణ అర్హత లేదని వాదించారు. దీంతో ప్రభుత్వ వాదనను సమర్ధించిన న్యాయ స్థానం, ఎన్నికలు జరుపుకోవచ్చని, అయితే కౌంటింగ్ మాత్రం తదుపరి ఆదేశాలు వచ్చే వారకు, ఆగాలని ఆదేశాలు ఇచ్చింది. అయితే ఈ తీర్పుతో ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల కమిషన్ వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.

hc 07042021 2

అయితే ఈ కేసు పై సుప్రీం కోర్టుకు వెళ్ళే అవకాసం లేదని తెలుస్తుంది. ఎందుకుంటే, రేపు ఎనిమిది గంటలకు పోలింగ్ మొదలు అవుతుంది. ఈ లోపు హైకోర్ట్ జడ్జిమెంట్ కాపీ వచ్చి, దాన్ని తీసుకుని సుప్రీం కోర్టుకు వెళ్ళటం అనేది అసాధ్యం అని అంటున్నారు. అయితే నిన్న సింగల్ బెంచ్ ఎన్నికలు జరపవద్దు అంటున్నా, ప్రభుత్వం మాత్రం, ఎన్నికలు ఏర్పాట్లు చేసుకోవాలని మోఖిక ఆదేశాలు ఇవ్వటంతో, ఇప్పటికే అన్ని చోట్ల ఎన్నికల ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పుడు హైకోర్టు తీర్పుతో, ఇక ఎన్నికల ఏర్పాట్లు జోరు అందుకోనున్నాయి. అయితే పిటీషనర్, ఈ రాత్రికి సుప్రీం కోర్టుకు వెళ్తారా అనేది కూడా ఆలోచించాల్సి ఉంటుంది. సుప్రీం కోర్టు ఆర్డర్స్ ఉల్లంఘన జరుగుతుంది కాబట్టి, సుప్రీం కోర్టుని కన్విన్స్ చేసి, ఈ రాత్రికి హౌస్ మోషన్ పిటీషన్ దాఖలు చేసే అవకాసం కూడా లేకపోలేదని, న్యాయ నిపుణులు చెప్తున్నారు. అయితే పిటీషనర్ అంత పోరాటం చేస్తారా ? లేకపోతే హైకోర్టు తీర్పుతో సంతృప్తి చెందుతారా అనేది చూడాల్సి ఉంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read