ప్రభుత్వంయొక్క ఆర్థిక విధానాలు, వాటిలోని డొల్లతనం సామాన్యులకుకూడా అర్థమైపోయిందని, చంద్రబాబు ప్రభుత్వంలో అన్నిరకాల ఉద్యోగులకు ఠంఛన్ గా ఒకటేతేదీనే జీతాలు అందేవని, ఎన్నిసమస్య లున్నా, ఉద్యోగులజీతాలను నాటిప్రభుత్వం ఆపలేదని, 5, 6 తేదీలొచ్చినా ఈప్రభుత్వం జీతాలివ్వలేని దుస్థితి లోఉందని టీడీపీ ఎమ్మెల్సీ పరుచూరి అశోక్ బాబు తెలిపారు. మంగళవారం ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వం నెలకు రూ.5వేలకోట్లవరకు జీతాలకే చెల్లించా లని, అదినిరంతరప్రక్రియని, ఆ విషయాన్ని విస్మరించి, కాంట్రాక్టర్లకు రూ.2,800కోట్లవరకు చెల్లింపు లుచేయడం బాధాకరమన్నారు. ప్రభుత్వఉద్యోగుల జీతాలుఆపి, కాంట్రాక్టర్లపై, వారిచ్చే కమీషన్లపై ఈ ప్రభు త్వం అమితమైన ప్రేమను చూపుతోందన్నారు. ప్రభు త్వం బెదిరించబట్టే, ఈవ్యవహారంపై ఉద్యోగసంఘాల నాయకులెవరూ మాట్లాడటంలేదన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల్లో ప్రభుత్వంపై తీవ్రవ్యతిరేకతఉందని, కానీ వారు నోరుతెరవకుండా సంఘాలు నిరోధిస్తున్నాయ న్నారు. చంద్రబాబునాయుడి ప్రభుత్వం రూ.16వేలకోట్ల లోటుబడ్జెట్ ఉన్నప్పటికీ ఉద్యోగులకు 43శాతం ఫిట్ మెంట్ఇచ్చిందన్నారు. ఏటా రూ.10వేలకోట్ల వరకు భా రంపడుతున్నా ఆనాడుచంద్రబాబునాయుడు లెక్కచే యకుండా ఉద్యోగులకు మేలుచేశారన్నారు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నాకూడా టీడీపీ ప్రభుత్వంలో ఉద్యోగుల కు ఒకటోతేదీనే జీతాలు అందాయన్నారు. ఈ ప్రభుత్వం లో 2020-21 ఆర్థికసంవత్సరంలో దాదాపు రూ.29వేల కోట్ల రెవెన్యూ వచ్చిందన్నారు. కరోనా వల్ల జరిగిన న ష్టం ప్రభుత్వానికి చాలా తక్కువన్నారు. కేంద్రంనుంచి కరోనా నిమిత్తం వచ్చిన రూ.8వేలకోట్లను ఈప్రభుత్వం ఎక్కడ ఖర్చుపెట్టిందో తెలియడంలేదన్నారు. ఆర్థికవ్యవస్థ సక్రమంగా లేకుంటే, ప్రభుత్వాలు ఎలా ఉంటాయనే దానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే ఉదాహరణ ని అశోక్ బాబు తెలిపారు. కేంద్రప్రభుత్వం ఎఫ్ఆర్ బీఎం లిమిట్ పెంచినాకూడా ఏ సంస్థా, ఏబ్యాంక్ ఏపీప్రభుత్వా నికి రుణాలివ్వడంలేదన్నారు. ప్రభుత్వానికి ధైర్యముం టే సీఎఫ్ఎంఎస్ లో పెండింగ్ లో ఉన్న బిల్లులపై తక్ష ణమే శ్వేతపత్రం విడుదలచేయాలన్నారు. పూర్తిస్థాయి లో రాష్ట్ర ఆర్థికస్థితిపై ప్రభుత్వం వెంటనే శ్వేతపత్రం విడు దలచేయాలని టీడీపీ తరుపున అశోక్ బాబు డిమాండ్ చేశారు.
జీపీఎఫ్ అడ్వాన్స్ లు, హెల్త్ స్కీమ్ లకింద చేసే చెల్లింపులేవీ రిటైరైన ఉద్యోగులకు అందడంలేదన్నారు. సత్తుపళ్లెంలో పంచభక్ష్యాల పెడితే తృప్తి ఉంటుందిగానీ, ఖాళీ బంగారుపళ్లెం పెడితే ఉద్యోగులకు, రిటైర్ ఉద్యోగు లకు ఏం ఒరుగుతుందని అశోక్ బాబు నిలదీశారు. రిటై ర్డ్ ఉద్యోగులకు ప్రభుత్వమిచ్చిన డిజిటల్ హెల్త్ కార్డులు దేనికీ ఉపయోగపడటంలేదన్నారు. ఆసుపత్రిల్లో వారికి వైద్యసేవలు అందడంలేదని, ప్రభుత్వంవారికి బిల్లులు ఇవ్వకపోవడంతో, వారు ఉద్యోగులకు వైద్యసేవలు అం దించడానికి నిరాకరిస్తున్నారన్నారు. రూ.60, రూ.70వేలకుకూడా నాలుగైదు నెలలు ఎదురు చూడాల్సిన పరిస్థితిని ఈ ప్రభుత్వం తీసుకొచ్చిం దన్నారు. బిల్లులు ఆలస్యం కాకూడదనే గతంలో తాము ఆరోగ్యశ్రీకి బదలాయించి, అక్కడనుంచి త్వరగా అయ్యేలా ఏర్పాటుచేశామన్నారు. ఉద్యోగులకు జీతాలు, రిటైర్డ్ ఉద్యోగులకు పింఛన్లు, జీపీఎఫ్ అడ్వాన్స్ లు, లైఫ్ ఇన్సూరెన్స్ బెనిఫిట్స్ వంటి వాటిని కూడా ఈ ప్రభుత్వం ఇవ్వలేకపోవడం సిగ్గుచేటన్నారు. బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అసెంబ్లీ, కౌన్సిల్ సమావేశాల్లో పిట్టక థలుచెబుతుంటాడు తప్ప, ఆర్థికపరిస్థితి గురించి సమా ధానం చెప్పడని అశోక్ బాబు తెలిపారు. రాష్టఆర్థిక మంత్రి ఎవరనే అనుమానం అందరికీ కలుగుతోందన్నా రు. కరోనా రావడంవల్ల రాష్ట్ర ఆదాయం పడిపోయిందనే ది సుద్ధ అబద్ధమన్నారు. కరోనా వచ్చినప్పుడు, ఒక నెలజీతాన్ని రాష్ట్ర సీఎమ్ఆర్ఎఫ్ కు , ఎమ్మెల్సీలు, ఎంపీలు, ఎమ్మెల్యేలువిరాళంగా ఇస్తే, దాన్నికూడా ఈ ప్రభుత్వం ఇంతవరకు రికవరీ చేయలేకపోయిందన్నా రు.
మంత్రులకు , ఇతరప్రజాప్రతినిధులకు సక్రమంగా జీతాలిస్తున్న ప్రభుత్వం ఉద్యోగులకు, రిటైర్ ఉద్యోగుల కు ఎందుకుఇవ్వలేకపోతోందో సమాధానం చెప్పాలని టీడీపీనేత డిమాండ్ చేశారు. కాంట్రాక్టర్లకు చెల్లించిన రూ. 2,800కోట్లతో 70శాతం ఉద్యోగులకు జీతాలు చెల్లిం చవచ్చన్నారు. ప్రభుత్వం దిగజారిపోయిందని అర్థమ వుతోందని, దానివల్ల అంతిమంగా ప్రజలే నష్టపోతారని అశోక్ బాబు తెలిపారు. ఏబ్యాంక్ ప్రభుత్వానికి రుణమి వ్వడానికి ముందుకురాకపోవడమే అందుకు నిదర్శన మన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకుసక్రమం గాచేరాలంటే, రాష్ట్ర ఆర్థికవ్యవస్థ మెరుగుపడాలన్నారు. ఆర్థికశాఖలోని ఉద్యోగులెవరూ బాధ్యతాయుతంగా వ్యవ హరించడంలేదన్నారు. సీఎఫ్ఎంఎస్ సిస్టమ్ కంట్రోలింగ్ మొత్తం ఆర్థికశాఖ కార్యదర్శుల చేతిల్లోనే ఉందని, వారు ఏమడిగినా పైనుంచి వస్తేనే చేస్తామని చెబుతున్నార న్నారు. పైనుంచి అంటే ముఖ్యమంత్రినుంచా...లేక ఆర్థి కశాఖ మంత్రినుంచా అనేది తెలియడంలేదన్నారు. 2020-21 కిసంబంధించిన ఆర్థికవ్యవహారాలతో పాటు, సీఎఫ్ఎంఎస్ లోని పెండింగ్ బిల్లులపై ప్రభుత్వం తక్షణమే శ్వేతపత్రం విడుదలచేయాలన్నారు. ఉద్యోగు ల విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్నవిధానం ఎంత మాత్రం సరైందికాదని అశోక్ బాబు స్పష్టంచేశారు. ప్రభు త్వాలను పడగొట్టి, నిలబెట్టిన చరిత్ర ఉద్యోగులకుందని ఈప్రభుత్వం గుర్తిస్తే మంచిదన్నారు. ఉద్యోగుల మౌనం తుఫాను ముందు ప్రశాంతత వంటిదని ప్రభుత్వం తెలుసుకుంటే మంచిదని అశోక్ బాబు హితవు పలికారు.a