జగన్ మోహన్ రెడ్డి పై, 11 సిబిఐ, 5 ఈడీ కేసులు ఉన్న సంగతి తెలిసిందే. ఈ కేసులు పై, అయన 16 నెలలు జైలులో ఉండి, చార్జ్ షీట్ లు ఫైల్ చేసిన తరువాత, కోర్టు కండీషనల్ బెయిల్ ఇవ్వటంతో, ఆయన బయటకు వచ్చారు. 2017 ఆ సమయంలో, ప్రతి వారం వారం కోర్టుకు విచారణ కావాలని, ఆదేశాలు వచ్చాయి. అయితే తరువాత ఆయన ముఖ్యమంత్రి అవ్వటంతో, కేసు ముందుకు సాగటం లేదు. వారం వారం విచారణ జరుగుతున్నా, జగన్ మోహన్ రెడ్డి మాత్రం, కోర్టుకు విచారణకు వెళ్ళటం లేదు. ఇది చాలా మందికి ఆశ్చర్యాన్ని కూడా కలిగిస్తుంది. ఇదే విషయం పై, వైసిపీ ఎంపీ రఘురామరాజు, ఈ రోజు ఆవేదన చెందుతూ ప్రెస్ మీట్ పెట్టారు. మా జగన్ మోహన్ రెడ్డి గారు, అందరి చేత మాటలు పడుతున్నారని అన్నారు. మొన్న బీజేపీ నేత సునీల్ దియోధర్ కూడా , జగన్ ని జైలుకు పంపిస్తాం అని అంటున్నారని, అందుకే విచారణ ఎదుర్కుని కడిగిన ముత్యంలా బయటకు రావాలని కోరుకుంటున్నా అని అన్నారు. అందుకే మా ముఖ్యమంత్రి గారి బెయిల్ రద్దు చేయాలని, విచారణ తొందరగా చేయాలని, సిబిఐ కోర్టులో, తాను కొద్ది సేపటి క్రితమే, పిటీషన్ దాఖలు చేసామని అన్నారు. తానే స్వయంగా, ఈ కేసు వేశానని, ఈ కేసు విచారణ పై, సిబిఐ కోర్టు ఏమి చెప్తుందో చూడాలని అన్నారు. అలాగే, అసలు ఏడాదిగా విచారణకు హాజరుకాకపొతే, సిబిఐ ఏమి చేస్తుందని ప్రశ్నించారు.

cbi 06042021 2

సిబిఐ కోర్టు అంత నిస్సహయతగా ఉందా ? ఎందుకు నువ్వు విచారణకు రావటం లేదని, ఒక ఏ1ని అడిగే సాహసనం ఎందుకు చేయటం లేదు అంటూ ప్రశ్నించారు. ఈయన బయట ఉంటే, అందరినీ ప్రభావితం చేస్తారని అనిపిస్తుందని, ఇప్పటికే తన కేసులో సహా నిందితులకు, అనేక పదవులు ఇచ్చారని అన్నారు. ఇప్పటికే సిబిఐ మీద నమ్మకం పోతూ ఉంటే, న్యాయ వ్యవస్థ కూడా ఒక ఏ1 విచారణకు రాకపొతే, ఏమి చేస్తున్నారని ప్రశ్నించారు. మహారాష్ట్రలో తన పై ఆరోపణలు రావటంతో, హోంమంత్రి రాజీనామా చేసి, విచారణ ఎదుర్కుంటున్నారని, మా ముఖ్యమంత్రి పై ఇన్ని కేసులు ఉంటే, ఈయన ఇలా ఉన్నారని అన్నారు. అందుకే జగన్ గారు కూడా, ఈ విచారణ ముగించేలా, వేరే వారిని తన సీటులో పెట్టి, ఈ విచారణ తొందరగా అయ్యేలా చూడాలని అన్నారు. న్యాయ వ్యవస్థ మీద ఎదురుదాడి, న్యాయ వ్యవస్థను వివస్త్రను చేస్తున్న మా ముఖ్యమంత్రి అంటూ, రఘురామరాజు ఘాటు వ్యాఖ్యలు చేసారు. అయితే ఈ కేసు ఎప్పుడు విచారణకు వస్తుంది ? కోర్టు ఏమి చెప్తుంది అనే దాని పై సస్పెన్స్ నెలకొంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read