ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, జగన్ మోహన్ రెడ్డి వచ్చిన తరువాత అప్పులు అధికంగా చేస్తూ, ప్రజల నెత్తిన బండను పెడుతున్న విషయం తెలిసిందే. ఆదాయం సంపాదించే మార్గాలు రోజు రోజుకీ తగ్గిపోవటంతో, కేవలం అప్పుల మీద నెట్టుకుని వస్తున్నారు. గత చంద్రబాబు హాయాంలో, 5 ఏళ్ళలో లక్షా 25 వేల కోట్లు అప్పు చేస్తే, జగన్ మోహన్ రెడ్డి వచ్చిన 22 నెలల్లోనే లక్షా 50 వేల కోట్ల వరకు అప్పులు చేసారని లెక్కలు చెప్తున్నాయి. ఇక దీనికి మరో లక్ష కోట్లు పెండింగ్ బిల్లులు అధనం. ఇలా ఇష్టం వచ్చినట్టు అప్పులు చేస్తూ, రాష్ట్రాన్ని దివాళా తీయిస్తున్నారు అంటూ, వివిధ రాజకీయ పార్టీలు ఆరోపిస్తున్నాయి. కేంద్రానికి ఫిర్యాదులు కూడా వెళ్ళాయి. అయితే కేంద్రం ఇప్పటి వరకు ఆపింది లేదు. ఇది ఇలా ఉంటే, ఇప్పుడు కేంద్రం కొన్ని నిబంధనలు పాటించాలి అంటూ, రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. 15 వ ఆర్ధిక సంఘం సిఫారుసు మేరకు, కొంత లిమిట్ వరుకే అప్పులు తీసుకోవలసి ఉంటుంది. ముఖ్యంగా రాష్ట్ర జీడీపీలో, కేలవం నాలుగు శాతం వరుకే మాత్రం, నికరంగా రుణాలు పొందే వీలు ఉంటుంది. దీని ప్రకారం లెక్క కట్టిన కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వానికి ఈ ఆర్ధిక ఏడాదిలో రూ.42,472 కోట్ల రూపాయలు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం రుణంగా పొందే అవకాసం ఉంటుంది. ఇందులోనే అన్ని రకాల అప్పులు ఉంటాయని, కేంద్రం స్పష్టం చేసింది.
ఈ పరిమితి దాటి అప్పులు చేయటానికి వీలు లేదని కేంద్రం తేల్చి చెప్పింది. మరో పక్క, ఈ ఏడాది కచ్చితంగా రూ.27,589 కోట్లు రూపాయలు పెట్టుబడి వ్యయం కింద ఖర్చు చేయాలని తెలిపింది. అలా చేయని పక్షంలో, రుణ పరిమితిని మరి కొంత తగ్గిస్తారు. పెట్టుబడి వ్యయం చెప్పినంత ఖర్చు చేయకపోతే, 0.5 శాతం వరకు ఋణం పొందే అవకాసం కోల్పోతారు. అంటే దాదాపుగా 5 వేల కోట్లు వరకు రుణ పరిమితి తగ్గిపోతుంది. ఇక దీంతో పాటుగా సమగ్ర వివరాలు పంపాలని, కేంద్రం , రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. రెండు రకాల ఫార్మటు లు , రాష్ట్ర ప్రభుత్వానికి పంపి, అవి పూర్తి చేసి పంపించామని కోరారు. అందులో ముఖ్యంగా రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి, రుణ పరిస్థితి, డిస్కంల వివరాలు, ఇలా పూర్తి వివరాలు కేంద్రానికి పంపించాలని కోరారు. ఇవి పంపిన తరువాతే, ఆర్బిఐ నుంచి రుణం పొందే అవకాసం ఉంటుందని, కేంద్రం స్పష్టం చేసింది. అయితే ఇప్పటి వరకు 80 వేల వరకు ఏడాదికి అప్పు చేస్తూ వస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి, ఇప్పుడు సగానికి ఈ అప్పు తగ్గించటంతో, ఎలా నెట్టుకుని వస్తారో చూడాలి.