ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు కుల పరంగా కొట్టుకుని, కుల పరంగా విడిపోవటానికి కారణం, గతంలో సోషల్ మీడియాలో చేసిన విపరీత ప్రచారం. అలాగే ఎన్నో ఫేక్ ప్రచారాలు సోషల్ మీడియాలో జరిగాయి. అప్పట్లో చంద్రబాబు ప్రభుత్వం, ఈ ఫేక్ ప్రచారాలు ప్రజలు నమ్మరని, పోలవరం, అమరావతి, ఇరిగేషన్ ప్రాజెక్ట్ లు, ఉద్యోగాలు, కంపెనీలు, పెట్టుబడులు, అభివృద్ధి, సంక్షేమం, ఇవన్నీ ప్రజలకు కావాలని, ఇలాంటి ఫేక్ ప్రచారాలు కాదని, చిన్న చూపు చూసింది. చివరకు ఈ ఉదాసీనతతో, ఏకంగా అధికారం కోల్పోవాల్సి వచ్చింది. చంద్రబాబు ఓడిపోవటానికి కారణం, ఈ ఫేక్ ప్రచారం సింహభాగం అని అనేక విశ్లేషణలు చెప్పాయి. ఇక ఇది ఎవరు చేసారు, ఎందుకు చేసారు అనేది అందరికీ తెలిసిందే. అప్పటి నుంచి, తరువాత అధికారంలోకి వచ్చిన తరువాత నుంచి, వైసీపీ కి అడ్డు లేకుండా పోయింది. ఎన్ని చేసినా వైసీపీ ఎదురు దాడి చేయటంలో ప్రావీణ్యం సంపాదించింది. చివరకు మీడియాలో కూడా అధిక భాగం వైసీపీ భజనకే ఇష్ట పడుతున్నారు. అయితే ఎక్కడో ఒక చోట వీటికి బ్రేక్ పడుతుంది కదా. అలాగే వైసీపీ చేస్తున్న హడావిడికి "జై శ్రీరాం" అనే నినాదం బ్రేక్ వేసింది. ఇన్నాళ్ళు తిరుగు లేదు అనుకున్న వైసీపీ డిఫెన్సు లో పడింది. చంద్రబాబు గత నెల రోజులుగా పెంచిన స్పీడ్ కు విలవిలలాడుతుంది.

pk 08012021 2

ఎన్ని చేసినా మైలేజ్ రాక పోగా, చంద్రబాబు వాదన ప్రజల్లోకి వెళ్తుంది. అసెంబ్లీలో ఇన్సురన్సు ప్రీమియం కట్టలేదు అని బయట పెట్టిన దగ్గర నుంచి, రామతీర్ధం వరకు గత నెల రోజులుగా చంద్రబాబు వేసిన పాచికలకు, వైసీపీ విలవిలలాడుతుంది. చివరకు ముఖ్యమంత్రి హోదాలో, అంతా చంద్రబాబు చేసాడు అని జగన్ చెప్పినా, జరుగుతున్న పనులు చూసి ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. అందుకే జగన్ పడిపోతున్న గ్రాఫ్ ని కనిపెట్టారు. తమ పార్టీ నాయకులతో ఇక వర్క్ అవ్వదు అనుకున్నారో ఏమో, ప్రశాంత్ కిషోర్ ని వెంటనే రమ్మని కబురు పంపించారు. ఆయన తాడేపల్లిలో జగన్ తో సమావేశం అయ్యారు. వైసీపీ రాజకీయ వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్ కి మంచి పేరు వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు జగన్ ఆయన్ను పిలిపించటం వెనుక, గత నెల రోజులుగా చంద్రబాబు తనపై సాధిస్తున్న పై చేయికి కౌంటర్ వ్యూహం కోసమే అని పొలిటికల్ సర్కిల్స్ లో టాక్ నడుస్తుంది. మరి ప్రశాంత్ కిషోర్ ఎలాంటి సలహాలు ఇస్తారో చూడాలి. ప్రశాంత్ కిషోర్ ఎలాంటి సలహాలు ఇచ్చినా, ప్రభుత్వం చేయాల్సింది దేవాలయాల పై జరిగిన ఘటనలు ఎవరు చేసారో వాళ్ళని పట్టుకోవటం, ఇలాంటి ఘటనలు మళ్ళీ జరగకుండా చూడటం. చూద్దాం, మళ్ళీ సోషల్ మీడియా ఎలా తయారు అవుతుందో..

Advertisements

Advertisements

Latest Articles

Most Read