ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఈ రోజు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేస్తూ, ప్రెస్ నోట్ విడుదల చేసారో లేదో, జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆత్మరక్షణలో పడింది. నిమ్మగడ్డ ఇంత తొందరగా నిర్ణయం తీసుకుంటారని ప్రభుత్వం కూడా ఊహించలేదు. అయితే నిమ్మగడ్డ నిర్ణయం పై ప్రభుత్వం ముందుగా చేయాల్సింది కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకోవటం. అయితే రేపటి నుంచి హైకోర్టుకు సంక్రాంతి సెలవలు ఉన్నాయి. ఈ నెల 17 వరకు సెలవలు ఉంటాయి. మరి రేపు ప్రభుత్వం హౌస్ మోషన్ పిటీషన్ మూవ్ చేస్తుందో లేదో చూడాలి. ఇది ఇలా ఉంటే, ముందుగా ప్రభుత్వం నిమ్మగడ్డ నిర్ణయాన్ని ఖండిస్తూ ఉత్తరం రాసింది. చీఫ్ సెక్రటరీ నిమ్మగడ్డకు లెటర్ రాసారు. మీ మీద గౌరవంతో, రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు సహకరించటం లేదు అని చెప్పిన, మీ నిర్ణయాన్ని మేము అంగీకరించటం లేదని అన్నారు. క-రో-నా కారణంగా మేము ఎన్నికలు నిర్వహణ చేయలేక పోతున్నామని అన్నారు. అలాగే వ్యాక్సిన్ కూడా వేయాల్సి ఉందని అన్నారు. ఈ ప్రక్రియ అంతా అయ్యే దాకా ఎన్నికలు వద్దు అని, మా నిర్ణయాన్ని అంగీకరిస్తారని ఆశిస్తున్నామని అన్నారు. ఇక పంచాయతీ రాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ కూడా ఒక పత్రికా ప్రకటన విడుదల చేసి, ప్రజల ప్రాణాలు హరించే విధంగా ఎన్నికల కమిషన్ నిర్ణయాలు ఉన్నాయని అన్నారు. మొండి వైఖరి అంటూ, ఎన్నికల కమిషన్ ని నిందించారు. సుప్రీం కోర్టు తీర్పును ఉల్లంఘించారు అంటూ ప్రకటన విడుదల చేసారు.
నిమ్మగడ్డ లేఖకు, వెంటనే కౌంటర్ ఇచ్చిన ప్రభుత్వం.. చీఫ్ సెక్రటరీ, పంచాయతీ రాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ లేఖ...
Advertisements