ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్, ఎవరినీ వదలటం లేదు. తెలుగుదేశం పార్టీకి షాక్ ఇస్తూ, రాష్ట్ర ఎన్నికల కమీషనర్ కొద్ది సేపటి క్రిందట, ఆదేశాలు ఇస్తూ, టిడిపికి షాక్ ఇచ్చింది. పంచాయతీ ఎన్నికల మొదటి విడత నామినేషన్ రాగానే, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రెస్ మీట్ పెట్టారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ బలపరిచిన అభ్యర్ధులను గెలిపించాలని కోరారు. దీని కోసం టిడిపి తరుపున పంచసూత్రాల పేరుతో ఒక మ్యానిఫెస్టో విడుదల చేసారు. పంచాయతీ ఎన్నికలు పార్టీ రహిత ఎన్నికలు అయినా, వెనుక ఉండేది పార్టీలే అని, అందుకే తమ పార్టీ బలపరిచిన అభ్యర్ధుల తరుపున ఎన్నికల మ్యానిఫెస్టో విడుదల చేస్తున్నట్టు చెప్పారు. అయితే దీని పై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యంతరం తెలిపింది. పార్టీ రహితంగా జరిగే ఎన్నికలకు, పార్టీ తరుపున మ్యానిఫెస్టో ఎలా విడుదల చేస్తారు అంటూ, వైసిపీ నేత లేళ్ల అప్పిరెడ్డి రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేసారు. ఫిర్యాదు స్వీకరించిన రాష్ట్ర ఎన్నికల కమిషన్, తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి మద్దిపాటి వెంకటరాజుకు నోటీసులు పంపించారు. వైసీపీ ఫిర్యాదు పై వివరణ ఇవ్వాలని కోరారు. ఫిబ్రవరి 2 లోపు వివరణ ఇవ్వాలని కోరారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాలు ప్రకారం, తెలుగుదేశం పార్టీ వివరణ ఇచ్చింది.

manifesto 04022021 2

ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి మద్దిపాటి వెంకటరాజు, ఎస్ఈసి నోటీస్ కు వివరణ ఇచ్చారు. వివరణలో వివిధ చట్టాలు, పంచాయతీ రాజ్ ఆక్ట్, సుప్రీం కోర్టు ఇచ్చిన కొన్ని తీర్పులు ఇలా అన్నీ ఉదహరించి, మ్యానిఫెస్టో విడుదల తప్పు కాదని, దీని పై వైసీపీ ఇచ్చిన ఫిర్యాదు పట్టించుకోవద్దని కోరారు. అయితే టిడిపి వివరణ మొత్తం చుసిన రాష్ట్ర ఎన్నికల కమీషనర్, సంతృప్తి చెందలేదు. టిడిపి వివరణ సంతృప్తికరంగా లేదని తెలిపారు. అందుకే తెలుగుదేశం పార్టీ రిలీజ్ చేసిన మ్యానిఫెస్టోని వెంటనే ఆపేయాలని కోరారు. ఇప్పటికే జిల్లాలకు పంపిస్తే వాటిని వెనక్కు రప్పించాలని కోరారు. ఇక మీదట మ్యానిఫెస్టో బయటకు వెళ్ళటానికి వీలు లేదని తెలిపారు. పార్టీ రహితంగా జరిగే ఎన్నికలకు, ఒక పార్టీ మ్యానిఫెస్టో విడుదల చేయ కూడదు అని, అందుకే వెంటనే మ్యానిఫెస్టోని వెనక్కు తీసుకోవాలని తెలుగుదేశం పార్టీని ఆదేశించారు. మరి దీని పై తెలుగుదేశం పార్టీ ఎలా స్పందిస్తుందో చూడాలి. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఈసీ చర్యలు పై సంతృప్తి చెందుతుందో లేదో చూడాలి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read