ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు అడ్డుకోవటానికి జగన్ ప్రభుత్వం చేసిన పనులు అన్నీ ఇన్నీ కావు. సహజంగా అధికారంలో ఉన్న పార్టీ, స్థానిక ఎన్నికలు అంటే ఉరకలు వేస్తుంది, ప్రతిపక్ష పార్టీలు తటపటాయిస్తాయి. మన రాష్ట్రంలో మాత్రం, అధికార పక్షం స్థానిక సంస్థల ఎన్నికలు అంటేనే భయపడి పోతుంది. ఇవి జరగకుండా ఉండటానికి మొదట, చరిత్రలో ఎక్కడా లేనిది ఏకంగా ఎన్నికల కమీషనర్ ని కూడా తప్పించారు. తరువాత ఉద్యోగులకు క-రో-నా వస్తుందని, ఎన్నికలకు మేము దూరం అన్నారు. తరువాత ప్రజలకు క-రో-నా వస్తుందని అన్నారు. ఆ తరువాత క-రో-నా తగ్గిపోయింది కదా అంటే, క-రో-నా వ్యాక్సిన్ అని సాకులు చెప్పారు. చివరకు ఏ వాదనా కోర్టుల్లో నిలవలేదు. హైకోర్టు, సుప్రీం కోర్టు కూడా ఎన్నికలు జరపాల్సిందే అని తేల్చాయి. అయితే ఎన్నికల నోటిఫికేషన్, నామినేషన్లు మొదలు అయిన తరువాత కూడా, మరో ప్రయత్నం ఎన్నికలు ఆపటానికి హైకోర్టుకు వెళ్లారు. 2019 ఎన్నికల జాబితా ప్రకారం, రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించటం సమంజసం కాదని, దీని వల్ల 2019 ఎన్నికల ఓటర్ల జాబితా తరువాత, కొత్తగా ఎన్రోల్ అయిన కొత్త ఓటర్లు ఓటు హక్కు కోల్పోతున్నారని, 2021 ఓటర్ జాబితా పరిగణలోకి తీసుకోవాలి అంటూ, దాఖలైన ఒక హౌస్ మోషన్ పిటీషన్, ప్రజా ప్రయోజన వ్యాజ్యం పై, హైకోర్టు తీర్పు చెప్పింది.
ఈ రెండు పిటీషన్ ల పై కూడా తీర్పు చెప్పింది. 2021 ఓటర్ల జాబితాను తమకు అందించాలని పలు మార్లు రాష్ట్ర ఎన్నికల కమిషన్, రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేసినప్పిటికీ, ప్రభుత్వం వైపు నుంచి స్పందన కనిపించలేదని, అందువల్ల అందుబాటులో ఉన్న 2019 ఎన్నికల జాబితాను తాము పరిగణలోకి తీసుకున్నామని, ఎన్నికల కమిషన్ వాదించింది. పైగా ఒకసారి ఎన్నికల ప్రక్రియ మొదలు అయిన తరువాత, ఆ ఎన్నికల్లో ప్రభుత్వాలు జోక్యం చేసుకోరాదని, సుప్రీం కోర్టు పలు మార్లు ఇచ్చిన తీర్పును కూడా హైకోర్టు ముందు ప్రస్తావించారు. ఇక 2021 ఎన్నికల జాబితా కావాలని తాము రాసిన లేఖలు, ప్రభుత్వం వైపు నుంచి వచ్చిన స్పందన, అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన అఫిడవిట్ కూడా హైకోర్టు కి ఇచ్చారు. అయితే పిటీషనర్ అసలు ఓటు హక్కు కూడా అప్లై చేయలేదని, కోర్టు దృష్టికి తెచ్చారు. అయితే ప్రభుత్వ వాదనను, పిటీషనర్ వాదనను కోర్టు పరిగణలోకి తీసుకోకుండా, ఈ రెండు పిటీషన్ లు డిస్మిస్ చేసారు. అయితే ఈ తీర్పు పై స్పందించిన ఎలక్షన్ కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్, ఇక ఎన్నికలు ఎవరూ ఆపలేరని, చివరి ప్రయత్నం కూడా అయిపోయిందని అన్నారు.