ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ చర్యలతో, వైసీపీ పార్టీ ఉక్కిరిబిక్కిరి అవుతుంది. రాష్ట్ర ఎన్నికల కమిషన్, రూల్స్ ప్రకారం వెళ్తున్నా, వైసీపీ పార్టీ ఇబ్బందులు పడుతుంది. ఇప్పటికే నిమ్మగడ్డ రమేష్ కుమార్ పై, ప్రతి రోజు ఎదురు దా-డి చేస్తూనే ఉన్నారు. అయితే నిమ్మగడ్డ మాత్రం తన పని తాను, రాజ్యాంగం ప్రకారం, రూల్స్ ప్రకారం చేస్తూనే ఉన్నారు. వైసీపీ వాళ్ళకు నిమ్మగడ్డ పై లీగల్ గా వెళ్ళటానికి ఒక్క పాయింట్ కూడా దొరకలేదు. చివరకు తనను మంత్రులు తిట్టారని, గవర్నర్ కు నిమ్మగడ్డ లేఖ రాస్తే, అది తమ హక్కులకు భంగం అంటూ, ప్రివిలేజ్ కమిటీకి ఫిర్యాదు చేసి, తద్వారా నిమ్మగడ్డ పై కక్ష తీర్చుకునే ధోరణిలో ఉన్నారు. అయితే ఇదంతా ఒక ఎట్టు అయితే, గతంలో పెద్ద ఎత్తున వచ్చిన ఏకాగ్రీవాలు ఇప్పుడు రాలేదు. అధికార పార్టీ నేతలు ఎన్ని బెదిరింపులకు పాల్పడ్డా, ప్రజల్లో వచ్చిన చైతన్యం, ఎలక్షన్ కమిషన్ చర్యలతో అవి కూడా ఆగిపోయాయి. చాలా తక్కువ ఏకాగ్రీవాలు నమోదు అయ్యాయి. ఇవన్నీ వైసీపీ పార్టీకి ఇబ్బందిగా మారాయి. వీటితోనే ఇబ్బందులు పడుతుంటే, ఇప్పుడు మరో ఇబ్బంది వైసీపీ పార్టీకి వచ్చి పడింది. అదే ఎన్నికల కమిషన్ విడుదల చేస్తున్న "ఈ-వాచ్" అనే యాప్. ఈ రోజు ఎన్నికల కమిషన్ ఈ -వాచ్ అనే యాప్ ప్రారంభం చేయనున్నారు.
ఈ యాప్, ప్రజలకు, ఎలక్షన్ కమిషన్ కు అనుసంధానంగా ఉంటుంది. ఎన్నికల వేళ ప్రజలు ఎదురు అయ్యే ఇబ్బందులు, అభ్యర్ధులకు వచ్చే బెదిరింపులు, ఇలా ఒకటి ఏమిటి, ఎన్నికలకు సమంధించి అన్నీ, ఎలక్షన్ కమిషన్ కు నేరుగా ఫిర్యాదు చేయవచ్చు. అయితే ఈ యాప్ పై వైసీపీ ఎందుకో కంగారు పడుతుంది. ఏ రాజకీయ పార్టీ అయినా, ఇలాంటివి స్వాగిస్తుంది. వైసీపీ మాత్రం కంగారు పడుతుంది. ఈ యాప్ ని ఎలా అడ్డుకోవాలో తెలియక, యదావిధిగా, ఈ యాప్ తెలుగుదేశం పార్టీ తాయారు చేస్తుంది అంటూ పాత పాట పడుతూ ఎదురు దాడి చేస్తుంది. చంద్రబాబు, నిమ్మగడ్డ కలిసి ఈ యాప్ తయారు చేస్తున్నారు అంటూ వైసీపీ ఎదురు దాడి చేస్తుంది. అయితే, ఇంత సిల్లీ వాదన అధికార పార్టీ చేయటం ఏమిటో ఎవరికీ అర్ధం కావటం లేదు. ఇలాంటి యాప్ లో అనేక రాష్ట్రాల్లో ఉన్నాయి. ఎలక్షన్ కమిషన్ లాంటి సంస్థ, ఒక రాజకీయ పార్టీ దగ్గర యాప్ తయారు చేపిస్తుందా ? చేపిస్తే, ప్రభుత్వం వద్ద ఉన్న వ్యవస్థతో ఆధారాలు చూపించటం ఎంత సేపు ? ఆధారాలు చూపించకుండా, ఇలా ఎందుకు ఎదురు దాడి చేస్తున్నారు ? ప్రజలు, అభ్యర్ధులు దౌర్జన్యాల పై ఫిర్యాదు చేస్తారు, ఇందులో ఏముంది, వైసీపీ కంగారు పడటానికి ?