ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి, రాష్ట్ర ఎన్నికల సంఘం దూకుడు పెంచింది. ఇప్పటికే 13 జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పంచాయతీ ఎన్నికలకు సంబంధించి, ఎటువంటి ప్రణాళిక సిద్ధం చేయాలి, ఇటు ఉద్యోగల సౌకర్యాలు, బ్యాలెట్ పత్రాలు, బ్యాలెట్ బాక్సులు, సమస్యాత్మక ప్రాంతాలు, అత్యంత సమస్యాత్మక ప్రాంతాలు గుర్తించటం, ఇవన్నీ పనులు ముందుకు తీసుకుని వెళ్తున్నారు. దీనికి సంబంధించి, ఎన్నికలక నిర్వహణకు సంబంధించి, ఇప్పుడు రాష్ట్ర ఎన్నికల కమీషనర్ మరో నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల నిర్వహణ సాఫీగా సాగటానికి, ఒక స్పెషల్ ఆఫీసర్ ను నియమించారు. ఐజి స్థాయి అధికారిని, ఎన్నికల నిర్వహణ కోసం నియమించారు. ఐజి గా ఉన్న ఎన్.సంజయ్ ను, ఎన్నికల నిర్వహణ అధికారిగా నిమ్మగడ్డ నియమించారు. చార్జ్ తీసుకున్న ఎన్.సంజయ్, కొద్ది సేపటి క్రిందట, ఎన్నికల కమిషన్ ను కలిసారు. గతంలోనే ఒక ఐజి స్థాయి ప్రత్యెక అధికారిని నియమిస్తామని రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రెస్ మీట్ లో చెప్పిన విషయం తెలిసిందే. ముఖ్యంగా బలవంతంగా చేస్తున్న ఏకగ్రీవాలు, బలవంతంగా నామినేషన్ వేయనివ్వకుండా చేయటం వంటి వాటి గురించి, ఈ అధికారి దృష్టి సారించే అవకాసం ఉంది.
ముఖ్యంగా ఎన్నికలు నామినేషన్ లు దగ్గర నుంచి, ఎన్నికల కౌంటింగ్ అయ్యే వరకు, ఎక్కడా ఎలాంటి ఘటనలు జరగకుండా, ఐజి సంజయ్ వ్యవహరించాల్సి ఉంటుంది. సమస్యాత్మక ప్రాంతాలు గుర్తించి, కావాల్సిన బలగాలు దింపి, ప్రజలు స్వేచ్చగా ఎన్నికల్లో పాల్గునేలా ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకుంది. గత ఎన్నికల సమయంలో, నామినేషన్ ల సమయంలో, జరిగిన ఘటనలు దృష్టిలో పెట్టుకుని, ప్రత్యెక అధికారిని నియమించారు. కొద్దిసేపటి క్రితమే ఐజి సంజయ్ విజయవాడలో , ఎలక్షన్ కమిషన్ తో చర్చించారు. నాలుగు విడతల ఎన్నికల్లో బద్రత, ఎంత మంది సిబ్బంది కావాలి, ఏ జిల్లాలో ఎంత మందిని నియమించారు, ఎన్నికల విధుల్లో పాల్గునే పోలీసులకు మౌలిక సదుపాయాలు ఇలా అన్ని విషయాల పై చర్చించారు. ఇక మరో పక్క, రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు చిత్తూరు కలెక్టర్ తన బాధ్యతల నుంచి తప్పుకున్నారు. ఆయన స్థానంలో ఇంఛార్జ్ కలెక్టర్గా, జాయింట్ కలెక్టర్ మార్కండేయులుకు బాధ్యతలు అప్పగించారు.