ఈ రోజు పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేది, పంచాయతీరాజ్ కమిషనర్ గిరిజాశంకర్‍ పై ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకున్న విషయం తెలిసిందే. వీరిద్దరూ 3.61లక్షల మంది యువ ఓటర్లు ఓటు హక్కు కోల్పోవటానికి కారణం అనేది అభియోగం. ఇక ఈ అభిశంసనకు సంబంధించి, నిన్నే ప్రభుత్వానికి లీకులు వచ్చిన నేపధ్యంలో, నిన్నే ప్రభుత్వం వారిని సస్పెండ్ చేసింది. అయితే సర్వీస్ రూల్స్ కు వ్యతిరేకంగా రిమార్క్ రాసే అవకాసం లేకుండా చేసారు. ఇది గమనించిన ఈసి , ప్రభుత్వ ఉత్తర్వులు అంగీకరించకుండా, ఈసినే సర్వీస్ రూల్స్ లో రిమార్క్ రాసి, ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకుంది. దీంతో, ప్రభుత్వ ఉద్యోగి సర్వీస్ రికార్డ్ లో రిమార్క్ పడితే, ప్రమోషన్లు సమయంలో చాలా ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. ఇక్కడ ప్రభుత్వం, అధినేతలు బాగానే ఉంటారు కానీ, అధికారులు బలి అయిపోతారు. అయితే ఇక్కడే ఇప్పుడు ఇంకో విషయం చెప్పుకోవాలి. ఈ చర్యలతో ద్వివేది, గిరిజాశంకర్‍ పని అయిపోలేదు. ఇప్పుడు ఈ అంశం కోర్టులో కూడా ఉంది. సుప్రీం కోర్టు తీర్పు రాకముందు, ఎన్నికలు ఆపే ఉద్దేశంతో, హైకోర్టులో మరో పిటీషన్ దాఖలు అయ్యింది. ఇది ఏ రాజకీయ పార్టీ కానీ, ప్రభుత్వం కానీ దాఖలు చేయలేదు కానీ, వెనుక ఎవరైనా ఉన్నారో లేదో తెలియాల్సి ఉంది.

hc 26012021 2

రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు జరపకూడదు అంటూ, హైకోర్టులో పోయిన వారం హౌస్ మోషన్ పిటీషన్ దాఖలు చేసారు. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు అనేవి, 2019 ఓటర్ల జాబితా పై జరుగుతున్నాయని, అలా కాకుండా 2021 ఎన్నికల జాబితా ప్రకారం జరగాలని పిటీషన్ లో పేర్కొన్నారు. 2019 ఓటర్ల జాబితాతో ఎన్నికలకు వెళ్ళటం వల్ల, 3.60 లక్షల మంది ఓటు హక్కు కోల్పోయారు అనేది పిటీషన్ లో తెలిపారు. అయితే ఈ పిటీషన్ ను అత్యవసరంగా విచారణ చేయాలి అంటూ పిటీషనర్ కోరగా, ఇందులో అత్యవసరం ఏమి లేదని హైకోర్టు రెగ్యులర్ గా తీసుకుంది. అయితే తరువాత రోజు విచారణకు రాగా, ఇది సుప్రీం కోర్టులో ఉంది కాబట్టి, బుధవారం విచారణ చేస్తామని హైకోర్టు వాయిదా వేసింది. అయితే, సుప్రీం కోర్టులో ఎన్నికలు జరపుకోవచ్చని ఆదేశాలు రావటంతో, రేపు ఈ పిటీషన్ పై హైకోర్టు ఎలా స్పందిస్తుందో చూడాలి. ఎన్నికలు ఆపే పరిస్థితి ఉండదు కానీ, ఈ పరిస్థితి కారణం అయిన అధికారుల పై చర్యలు తీసుకునే అవకాసం ఉంది. ఎన్నికల కమిషన్ ఓటర్ల జాబితా రెడీ చేయమన్నా, ప్రభుత్వం ఈ దిశగా అడుగులు వేయలేదు, పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేది, పంచాయతీరాజ్ కమిషనర్ గిరిజాశంకర్‍ పై ఈసి చర్యలు తీసుకున్న విషయం తెలిసిందే. రేపు ఇదే కోర్టుకు చెప్తే, కోర్టు కూడా వీరి పై చర్యలు తీసుకునే అవకాసం ఉంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read