ఆంధ్రప్రదేశ్ లో రేపటి నుంచి ఇంటిఇంటికీ రేషన్ కార్డు కార్యక్రమం ప్రారభం కావాల్సి ఉంది. ఇప్పటికే వాటికి సైరెన్ లు పెట్టి, ఊరు ఊరు ఊరేగించారు కూడా. అయితే ఈ పధకం ఫిబ్రవరి ఒకటిన ప్రారంభించాలని జగన్ మోహన్ రెడ్డి భావించారు. జగన్ మోహన్ రెడ్డి ఈ వ్యాన్ లు రేపు ప్రారంభం చేయాలని అనుకున్నారు. ఈ ప్రాజెక్ట్ శ్రీకాకుళం జిల్లాలో, పైలట్ ప్రాజెక్ట్ గా నిర్వహించి, రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఇది ప్రారంభించాలని అనుకున్నారు. అయితే ఈ పధకం కొత్త పధకం కావటం, ఎన్నికల నోటిఫికేషన్ రావటంతో, ఎలక్షన్ కమిషన్ కొన్ని మార్గదర్శసూత్రాలు విడుదల చేసింది. ముందుగా ఈ వాహనాలు అన్నిటి పై, పార్టీ రంగులు తొలగించాలని సూచించింది. రాజకీయ పార్టీ నేతలు, ఎమ్మెల్యే, మంత్రులు పాల్గునకుండా ఈ కార్యక్రమం సాగాలని చెప్పి సూచించింది. అయితే రేపు ప్రారంభం కావలసి ఉన్న ఈ కార్యక్రమం పై, రాష్ట్ర ఎన్నికల సంఘం ఇచ్చిన సూచనలతో, రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు ఉదయం హడావిడిగా హౌస్ మోషన్ పిటీషన్ మూవ్ చేసింది. ఈ రోజు ఉదయం హౌస్ మోషన్ పిటీషన్ పై విచారణ జరిగింది. కొద్ది సేపటి క్రితం హైకోర్టు విచారణలో కొన్ని కీలకమైన సూచనలు చేసింది. రెండు రోజుల్లో దీనికి సంబంధించి, దీని పై ఒక కార్యాచరణ రెడీ చేసింది, రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని కలవాలని ఆదేశించింది.
ఆ తరువాత అయుదు రోజుల్లో దీనికి సంబంధించి, ప్రభుత్వ నిర్ణయం పై పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చింది. అలాగే దీంతో పటు రాజకీయ పార్టీ రంగులు కానీ, దీంతో పాటు రాజకీయ పార్టీ నేతల జోక్యం కానీ ఈ పధకం అమలులో ఉండకూడదు అంటూ ఆదేశాలు ఇచ్చింది. ఏదైతే ఎన్నికల కమిషన్ చెప్పిందో, అదే విషయం హైకోర్టు కూడా చెప్పింది. ఈ పధకాలు అన్నీ పేద ప్రజలకు సంబదించినవి అని, దీనికి పెట్టె ఖర్చు అంతా ఏ ఒక్క రాజకీయ పార్టీది కాదని, ప్రజలు కట్టే పన్నుల్లో నుంచి ఇస్తున్నవని, ఏ రాజకీయ పార్టీ కానీ ఇది ఓన్ చేసుకోకూడదు అని హైకోర్టు చెప్పింది. ముఖ్యంగా ఎన్నికల మోడల్ కోడ్ అఫ్ కాండాక్ట్ ను అనుసరించి కార్యక్రమం ఉండాలని, హైకోర్టు చెప్పింది. అయితే ఎన్నికల కమిషన్ ఏదైతే చెప్పిందో, అదే విషయం హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో వ్యాన్ లు పై వేసిన వైసీపీ రంగులు, జగన్ ఫోటోలు లేకుండా, రాజకీయ నాయకులు లేకుండా ఈ పధకం అమలు చేయాల్సి ఉంటుంది. దీంతో మరి, ప్రభుత్వం దీని పై ఎలా స్పందిస్తుందో చూడాలి. ప్రతి నెలా రేషన్ బియ్యం, కొన్ని ఏళ్ళుగా ఎలా ఇస్తున్నారో, ఈ నెల కూడా అలాగే ఇస్తారు. మరి ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.