గత ఎన్నికల్లో చేసిన ఫేక్ ప్రచారాల్లో, ఇన్సైడర్ ట్రేడింగ్, పింక్‌ డైమండ్‌ ప్రధమైనవి. అయితే నిన్నే హైకోర్టులో ఇన్సైడర్ ట్రేడింగ్ అనేది లేదు, ఏమి లేదు అంటూ కేసు కొట్టేసి, ఫేక్ ప్రచారానికి ఫుల్ స్టాప్ పెట్టింది. అయితే నిన్నే పింక్‌ డైమండ్‌ కూడా హైకోర్టు ఒక తీర్పు ఇచ్చింది. నిజానికి ఇది విజయసాయి రెడ్డికి అనుకూలమైన తీర్పు అయినా, కోర్టు వ్యాఖ్యలు చేస్తే చేసిన వ్యాఖ్యలు మాత్రం, పింక్‌ డైమండ్‌ పై చేసిన ఫేక్ ప్రచారాన్ని కూడా తిప్పి కొట్టినట్టు అయ్యింది. పోయిన ఎన్నికలకు ముందు, తమకు అనుకూలమైన రమణ దీక్షితులు చేత, అప్పటి ప్రతిపక్ష పార్టీ వైసీపీ, తమ వ్యుహకర్త ప్రశాంత్ కిషోర్ తో కలిసి, తమ పై అసత్య ప్రచారం చేసారు అంటూ తెలుగుదేశం నేతలు తరుచూ వ్యాఖ్యానిస్తూనే ఉంటారు. అంటే ఈ అంశం అప్పటి ప్రభుత్వాన్ని ఎంతలా డ్యామేజ్ చేసిందో అర్ధం చేసుకోవచ్చు. ఏకంగా వెంకటేశ్వర స్వామి పింక్‌ డైమండ్‌ పోయింది అని, దాన్ని విదేశాలకు తరలించారు అంటూ, రమణ దీక్షితులు ప్రెస్ మీట్లు పెట్టి హంగామా చేయటం, ఆ తరువాత విజయసాయి రెడ్డి మాట్లాడుతూ, పింక్‌ డైమండ్‌ చంద్రబాబు ఇంట్లో ఉంది అంటూ ఆరోపణలు చేయటం, చంద్రబాబు ఇంట్లో శ్రీవారి నగలు కూడా ఉన్నాయి అంటూ, విష ప్రచారం చేసారు. అయితే అప్పట్లో తెలుగుదేశం ప్రభుత్వం, ఈ ప్రచారాన్ని దీటుగా ఎదుర్కోలేక పోవటంతో, ఇబ్బంది పడింది.

pink 20012021 2

కొంత మంది ప్రజలు, హిందువులు ఇది నిజం అని కూడా నమ్మారు. ఇక తరువాత ఎంత మంది వచ్చి, పింక్ డైమెండ్ లేదు అని చెప్పినా ప్రజల్లోకి వెళ్ళలేదు. వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చింది. మరి పింక్‌ డైమండ్‌ గురించి ఎందుకు ఎంక్వయిరీ చేయటం లేదు అంటే సౌండ్ లేదు. రమణ దీక్షితులు పింక్‌ డైమండ్‌ గురించి ఎందుకు మాట్లాడటం లేదో తెలియదు. అయితే పింక్‌ డైమండ్‌ పై, విజయసాయి రెడ్డిని ప్రతి వాదిగా చేర్చి, పింక్‌ డైమండ్‌ విషయంలో విచారణ చేయాలి అంటూ హైకోర్టులో పిటీషన్ దాఖలు అయ్యింది. అయితే దీని పై స్పందించిన హైకోర్టు విజయసాయి రెడ్డిని ఎందుకు ప్రతి వాదిగా చేర్చారు అంటూ అభ్యంతరం వ్యక్తం చేసింది. అయితే ఇదే సమయంలో పింక్‌ డైమండ్‌ విషయంలో ఇంకా విచారణ అవసరం లేదని, ఇప్పటికే పింక్‌ డైమండ్‌ విషయం పై, ఇప్ప‌టికే సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన‌ రెండు కమిటీలు విచారణ జరపగా, వాటి నివేదికలు కూడా వచ్చాయి కదా, మళ్ళీ విచారణ ఎందుకు అంటూ పిటీషన్ కొట్టేసింది. అంటే ఆ నివేదికలు ఫైనల్ అని హైకోర్టు అభిప్రాయం. దీంతో పింక్‌ డైమండ్‌ పై ఆ నివేదికలు ఫైనల్ అని చెప్పటంతో, గతంలో పింక్‌ డైమండ్‌ పై వీళ్ళు చేసిన ప్రచారం ఫేక్ అని తేలిపోయింది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read