జగన్ మోహన్ రెడ్డి సారధ్యంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ నేతలనే కాదు, తమకు ఇష్టం లేని ఐపీఎస్, ఐఏఎస్ ఆఫీసర్ల పైన కూడా కక్ష సాధింపు చర్యలు ఏమాత్రం మానటం లేదు. ముఖ్యంగా ఐఏఎస్ అధికారి జాస్తి కృష్ణ కిషోర్, ఐపీఎస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావు ఉదంతాలు ఇందుకు ప్రత్యక్ష సాక్ష్యం. అయితే ఇందులో ఐఏఎస్ అధికారి జాస్తి కృష్ణ కిషోర్, కేంద్ర సర్వీసులకు వెళ్ళిపోవటంతో, ఆయన్ను టచ్ చేసిన అవకాసం ఇంకా వీళ్ళకు లేకుండా పోయింది. అయితే ఐపీఎస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావుని మాత్రం, ఇప్పటికీ వేదిస్తునే ఉన్నారు. పది రోజుల క్రితమే ఏబి వెంకటేశ్వర రావు, తన పై క్రిమినల్ కేసులు పెట్టి, అరెస్ట్ చేపించి, తన పై కుట్ర పన్నుతుంది అంటూ, ఐపీఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్‌కు లేఖ రాసారు. అంతే కాదు, తనను జ్యూడిషియల్ రిమాండ్‌కు పంపి, మళ్ళీ సస్పెండ్ చేయాలని చూస్తున్నారు అంటూ కోర్టులో కూడా కేసు వేసారు. అయితే హైకోర్టు, ఆయన్ను అరెస్ట్ చేయవద్దు అంటూ ఆదేశాలు జారీ చేసింది. అయితే ఇప్పుడు జగన్ ప్రభుత్వం, ఏబీ వెంకటేశ్వర రావు ఊహించినట్టే, ఆయన పై మళ్ళీ సస్పెన్షన్ వెతి వేసింది. ఆయన ఆరోపణలు చేసిన కొద్ది రోజులుకే, సస్పెన్షన్ ఉత్తర్వులు ఇవ్వటంతో, ఆయన ఊహించిందే నిజం అయ్యింది.
ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్‌ను మరో ఆరు నెలలు పాటు పొడిగిస్తున్నట్టు ఉత్తర్వులు ఇస్తూ, సస్పెన్షన్ అనేది గత ఏడాది ఆగష్టు నుంచే అమలు అవుతాయని తెలపటం మరో కొసమెరుపు. అయితే, ఇప్పటికే ఏబీవీ ఈ విషయం పై కోర్టులో పిటీషన్ కూడా వేసారు. తనకు ఇప్పటి వరకు జీతం కూడా ఇవ్వలేదని వాపోయారు. అంతే కాదు, అసలు తన వల్ల రూపాయి నష్టం కూడా జరగక పోయినా, ఏదో జరిగిపోయింది అంటూ, తన పై తప్పుడు ఆరోపణలు మీడియాలో చేసారని, చివరకు చార్జెస్ లో తనకు సంబంధం లేని విషయాలు ప్రస్తావనించారని, అందులో కూడా, ఎక్కడా ప్రభుత్వానికి రూపాయి నష్టం జరిగినట్టు లేదని వాపోయారు. అసలు డబ్బులు లావాదేవీలు జరగని చోట, అవినీతి జరిగింది అంటూ, తన పై అనవసర అభాండాలు వేసి, ఇబ్బందులు పెడుతున్నారని వాపోయారు. తనకు సంబంధం లేని విషయంలో, రూపాయి కూడా లావాదేవీ జరగని విషయంలో తనను లాగి, తన పై అభియోగాలు మోపి, తనను ఏదో విధంగా అరెస్ట్ చేసి, సస్పెండ్ చేయాలని చూస్తున్నట్టు ఏబి వెంకటేశ్వర రావు ఆరోపించిన సంగతి తెలిసిందే.