రెండు రోజుల క్రితం, గిద్దలూరు వైసిపీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు వీడియో ఒకటి వైరల్ అయ్యింది. అందులో ఆయన సమస్య చెప్పుకోవటానికి వచ్చిన జనసేన కార్యకర్తపై బూతులు వర్షం కురిపించారు. ప్రకాశం జిల్లా కొనపల్లికి వచ్చిన ఎమ్మెల్యే రాంబాబుకు రోడ్ల తీరు సరిగా లేదని, ఒకసారి కారు దిగి వచ్చి చూడండి అంటూ జనసేన కార్యకర్త వెంగయ్య అడ్డుకోగా, జనసేన కార్యకర్త వెంగయ్యను బూతులతో తిట్టేసారు ఎమ్మెల్యే అన్నా రాంబాబు. ఎమ్మెల్యే అన్నా రాంబాబు తీరుపై జనసేన నేతల ఆగ్రహం వ్యక్తం చేయటం, ఇది మీడియాలో హైలైట్ అవ్వటం తెలిసిందే. అయితే ఎమ్మెల్యేని ఏకవచనంతో సంబోదించారు కాబట్టి, ఎమ్మెల్యే తిట్టారని వైసీపీ నేతలు వాదిస్తున్నారు.అయితే ఈ రోజు వెంగయ్య ఆత్మహత్య చేసుకుని చనిపోయిన సంఘటన జిల్లా వ్యాప్తంగా సంచాలనం సృష్టిస్తుంది. వీడియో బయటకు ఎందుకు విడుదల చేసారు అంటూ, వైసీపీ నేతలు, జనసేన కార్యకర్త వెంగయ్య పై ఒత్తిడి తేవటం, నిన్న గిద్దలూరుకు సంబందించిన ఒక వైసీపీ నేత, ఆ గ్రామ పర్యటనకు వెళ్ళటంతో, గ్రామస్తులు ఆయనతో కూడా రోడ్డులు బాగు చేయకుండా ఎందుకు వచ్చారు అంటూ నిరసన తెలిపారు.

janasena 18012021 2

అయితే, వైసీపీ నేతల ఒత్తిడితోనే వెంగయ్య ఆత్మహత్య చేసుకున్నారని జనసేన నేతలు ఆరోపిస్తూ ఉండగా, మరో పక్క పోలీసులు మాత్రం, వెంగయ్య మద్యం సేవించి, మానసిక ఒత్తిడితోనే, అతను ఆత్మహత్య చేసుకుని చనిపోయారని, బంధవులు కూడా అదే చెప్పారని అంటున్నారు. జనసేన నేతలు మాత్రం, పోలీసులు వాదనతో ఏకీభవహించటం లేదు. జనసేన నేతలు మాత్రం, నిజాలు బయటకు రావాలని అంటున్నారు. ఈ ఘటన పై పవన్ కళ్యాణ్ తీవ్రంగా స్పందించారు. గ్రామాల్లో ఉన్న సమస్య తీర్చండి అంటూ, ఒక ఎమ్మెల్యేను అడగటం కూడా తప్పేనా అంటూ, పవన్ ప్రశ్నించారు. జనసేన కార్యకర్త వెంగయ్య మృతి బాధాకరం అని, అతని మరణానికి, అధికార వైసీపీ నేతలు బాధ్యత వహించాలని పవన్ కళ్యాణ్ డిమాండ్ చేసారు. గ్రామాల్లో సమస్యలను అడగటమే తప్పా అని పవన్ ప్రశ్నించారు. ఈ ఘటన పై ఎమ్మెల్యేతో పాటుగా, అతని అనుచరులు పై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ డిమాండ్ చేసారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read