నెల్లూరు జిల్లా ఎస్.పి భాస్కర్ భూషణ్ కు జనవరి 18, 2021 న వైకాపా ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన బహిరంగ బెదిరింపుల నేపధ్యంలో తెదేపా అధికార ప్రతినిధి ఆనం వెంకట రమణా రెడ్డి డిజిపికి లేఖ రాసారు. ఒకవైపు రాష్ట్రంలో రోజురోజు శాంతిభద్రతలు క్షీణిస్తున్నాయని మరోవైపు అధికార పార్టీ వైకాపా నాయకులు పేట్రేగిపోతూ నేరాలు-ఘోరాలకు పాల్పడుతున్నారని, ఇంకోవైపు దళితులు, మైనారిటీలు, మహిళలు, దేవాలయాలపై దాడులు పెరిగిపోయాయని లేఖలో పేర్కొన్నారు. రాష్ట్రంలో జరుగుతన్న అనేక సంఘటనలు డిజిపీ దృష్టికి తీసుకెళ్లినా ఎటువంటి చర్యలు లేవన్నారు. తెలుగుదేశం కార్యకర్తలపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద అక్రమ కేసులు నమోదు చేయనందున జనవరి 18, 2021 న నెల్లూరు ఎస్పీ భాస్కర్ భూషణ్ ను బహిరంగంగా పబ్లిక్ మీటింగ్ లో వైకాపా ఎమ్మల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి బెదిరించారని పేర్కొన్నారు. వైకాపా నాయకులతో ఒక వర్గం పోలీసులు కుమ్మక్కై రాష్ట్రంలో ప్రతిపక్ష తెలుగుదేశం నాయకులపై, కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతున్నారనడానికి ఇదే సాక్ష్యమని నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి పై డిజిపి చర్యలు తీసుకోవాలని లేఖలో కోరారు. ప్రస్థుతం ఆంధ్రప్రదేశ్ పోలీసులలో ఆత్మస్థైర్యం దెబ్బతిందని నల్లపరెడ్డి లాంటి వ్యక్తులపై చర్యలు తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ పోలీసులలో ఆత్మస్తైర్యం నింపడంతో పాటు రాష్ట్రంలో శాంతి భద్రతలు కూడా మెరుగుపడుతాయి ప్రస్తావించారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read