ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి హైకోర్టులో ఊరట లభించింది. రాష్ట్ర ఎన్నికల సంఘం ఇచ్చిన షెడ్యూల్ ను కోర్టు నిలిపివేసింది. ప్రజారోగ్యం దృష్ట్యా ఎన్నికల షెడ్యూల్ ను నిలిపివేస్తున్నట్టు హైకోర్టు తెలిపింది. వ్యాక్సినేషన్‌కు ఎలాంటి ఆటంకం కలగకూడదనే ఎన్నికల కమిషన్ ఇచ్చిన షెడ్యూల్ నిలిపివేస్తున్నట్టు కోర్టు తెలిపింది. ప్రభుత్వం తరుపున అడ్వొకేట్ జనరల్ రెండు గంటల పాటు తమ వాదనలు వినిపించారు. ఎన్నికలు, వ్యాక్సినేషన్ ఒకేసారి ప్రభుత్వం చేయలేదని వాదించారు. ప్రభుత్వ వాదనను హైకోర్టు ఒప్పుకుంది. అయితే హైకోర్టు ఇచ్చిన తీర్పు పై, డివిజనల్ బెంచ్‌కు వెళ్లాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకుంది. త్వరలోనే ఈ పిటీషన్ వేయనున్నారు. అయితే ప్రభుత్వానికి మాత్రం, ఈ తీర్పు భారీ ఊరటను ఇచ్చింది.
Advertisements