జగన్ మోహన్ రెడ్డి అక్రమ ఆస్తుల కేసులో, నేడు కీలక పరిణామం చోటు చేసుకుంది. జగన్ కేసులు అటు, సిబిఐ విచారణ జరుపుతుంది, ఇటు ఈడీ కూడా విచారణ జరుపుతుంది. 11 సిబిఐ కేసులు ఉండగా, 5 ఈడీ కేసులు జగన్ మోహన్ రెడ్డి పై, విజయసాయి రెడ్డి పై ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. సిబిఐతో పాటు, ఈడీ కూడా ఈ కేసుల్లో చార్జీ షీట్లు దాఖలు చేసాయి. ఈ నేపద్యంలో, జగన్ తరుపు న్యాయవాదులు కోర్టులో వాదిస్తూ సిబిఐ చార్జ్ షీట్లు తేలిన తరువాతే, ఈడీ కేసులు విచారణ జరపాలి అంటూ, జగన్ మోహన్ రెడ్డి పిటీషన్ వేసారు. అయితే దీని పై వాదనలు జరిగాయి. సిబిఐ, ఈడీ కేసులు రెండు వేరే వేరు సెక్షన్లు అని ఈడీ వాదించింది. దీంతో ఈడీ కోర్టుకు ఈ వాదనతో ఏకీభవించింది. సిబిఐ కేసులతో సంబంధం లేకుండా, కేవలం ఈడీ కేసు విచారణ చేయటం కుదరదు అని కోర్టు తేల్చి చెప్పింది. ఈడీ కేసులను ముందుగా విచారణ చేస్తాం అని చెప్పిన కోర్టు, ఈ కేసుని 21కి వాయిదా వేసింది. ఈ రోజు జరిగిన విచారణకు జగన్ హాజరు కావాల్సి ఉండగా, ఈ రోజు అమ్మ ఒడి కార్యక్రమం ఉండటంతో, జగన్ రాలేదు. ఈ రోజు విచారణకు విజయసాయి రెడ్డి వచ్చారు. గతంలో కూడా  సిబిఐ కోర్టులో కూడా అన్ని చార్జ్ షీట్లు కలిపి ఒకేసారి విచారణ చేయాలని కోరగా, గతంలోనే సిబిఐ ఈ పిటీషన్ తోసిపుచ్చుంది. ఇప్పుడు ఈడీ కూడా కుదరదు అని చెప్పింది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read