ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్, ఈ రోజు గవర్నర్ ను కలవాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ రోజు ఉదయం 11:30 గంటలకు గవర్నర్ ఆయనకు అపాయింట్మెంట్ ఇచ్చారు. గత నాలుగు రోజులు నుంచి జరుగుతున్న పరిణామాలు అన్నీ నిమ్మగడ్డ, గవర్నర్ కు వివరించనున్నారు. రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న తన పై ప్రభుత్వంలోని వివిధ వర్గాలు చేస్తున్న విమర్శలు, అలాగే ఎన్నికలకు సహకరించబోమని, ఉద్యోగులు, పోలీసులు చెప్పటం పై, ఆయన ఆగ్రహంగా ఉన్నతు తెలుస్తుంది. ఇన్నాళ్ళు సభలు, సమావేశాలు, ఈ పధకం, ఆ పధకం అంటూ ఉద్యోగులను కూడా భాగస్వామ్యులను చేసి, పెద్ద పెద్ద మీటింగ్ లు పెట్టారని, ఇప్పుడు ఎన్నికలు అనగానే తన పై దాడి చేస్తున్నారని, ఆ సభలకు సంబంధించిన ఫోటోలు గవర్నర్ కు ఇచ్చే అవకాసం ఉన్నట్టు తెలుస్తుంది. ఇక అదే విధంగా, ఏ పరిస్థితిలో ఎన్నికల షెడ్యుల్ ఇవ్వాల్సి వచ్చింది, తరువాత జరిగిన పరిణామాలు, సింగల్ బెంచ్ షెడ్యుల్ రద్దు చేయటం, మళ్ళీ ఈ రోజు డివిజన్ బెంచ్ కు అపీల్ చేయటం, ఇవన్నీ గవర్నర్ కు నిమ్మగడ్డ వివరించనున్నారు. అదే విధంగా ఎన్నికలు పెట్టే ముందు చేసిన కసరత్తు కూడా, నిమ్మగడ్డ వివరించే అవకాసం ఉంది. ముఖ్యంగా వివిధ రాష్ట్రాల్లో ఈ మధ్య కాలంలో జరిగిన ఎన్నికల గురించి, నిమ్మగడ్డ ప్రస్తావించే అవకాసం ఉంది.
ముఖ్యంగా బీహార్, కర్ణాటక, రాజస్తాన్, హర్యానా ఎన్నికలతో పాటుగా, కేరళలో జరగబోయే ఎన్నికలు గురించి, అలాగే మన పక్కన ఉన్న హైదరాబాద్ లో జరిగిన మునిసిపల్ ఎన్నికల గురించి, అక్కడ తీసుకున్న జాగ్రత్తలు, మనం ఏమి చేస్తున్నాం అనేవి వివరించే అవకాసం ఉంది. ఇక సుప్రీం కోర్టు కూడా ఈ మధ్య కాలంలో, ఎన్నికలకు అభ్యంతరం చెప్పలేదనే విషయం కూడా చెప్పే అవకాసం ఉందని తెలుస్తుంది. మొత్తంగా, పూర్తి ఆధారాలతో, ఆయన తన వాదనను గవర్నర్ వద్ద వివరించే అవకాసం ఉంది. మరో పక్క, ఈ రోజు జగన్ మోహన్ రెడ్డి కూడా గవర్నర్ ను కలుస్తారని తెలుస్తుంది. మొత్తంగా, ఈ రోజు రాజ్ భవన్ వేదికగా ఎలాంటి సంచలనాలు ఉంటాయో చూడాలి. ఇక, ఈ రోజు రాష్ట్ర ఎన్నికల కమిషన్ వేసిన పిటీషన్ ను డివిజన్ బెంచ్ విచారించనుంది. నిన్న సింగల్ బెంచ్ ఇచ్చిన తీర్పుని, రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిన్నే డివిజన్ బెంచ్ లో ఛాలెంజ్ చేసింది. ఈ రోజు దీని పై విచారణ చేస్తామని డివిజన్ బెంచ్ అంగీకరించింది.